కళాంజలి

సుందర శిల్పాల సుదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుదర్శన్ బొమ్మ ప్రఖ్యాత మేకప్ కళాకారుడు. దేశ విదేశాల్లో పర్యటించి ఎన్నో వేల ప్రదర్శనలకు మేకప్ సహకారం అందించారు. దశాబ్దాలుగా మేకప్ కళకే అంకితమయ్యారు. ఎన్నో ప్రఖ్యాత డాన్స్ ఫెస్టివల్స్ ప్రదర్శనల్లో కళాకారులకు మేకప్ చేశారు. టీమ్ వర్క్, ప్రొఫెషనల్‌గా ఉంటారు.
ప్ర: మీ ప్రస్థానం గురించి చెబుతారా?
జ: నేను 1974లో మంచాలలో జన్మించాను. మంచాల హైదరాబాద్‌కు సుమారు 30 కి.మీ. దూరంలో ఉంది. అమ్మ అచ్చమ్మ, నాన్నగారు మల్లేశం. నాన్నగారు తొమ్మిది సంవత్సరాల క్రితం పోయారు. ఆ సమయంలో ఇంటర్మీడియెట్ ఇబ్రహీంపట్నంలో చదివాను. చిన్నప్పటి నుండీ బొమ్మలు గీయడం చాలా ఇష్టం. ముందుగా అసిస్టెంట్ మేకప్‌మేన్‌గా చేశాను. ఆ తర్వాత దూరదర్శన్‌లో ‘టెలీ స్కూల్’ అనే ప్రోగ్రామ్ వచ్చేది. ఆ కార్యక్రమానికి దాదాపు తొమ్మిదేళ్లు మేకప్ ఆర్టిస్టుగా చేశాను.
* డాన్స్ ఫీల్డ్‌లో డా.అలేఖ్య పుంజాల, డా.ఉమారామారావు గారి బృందం, స్వాతి సోమనాథ్, దీపికారెడ్డి, పద్మజారెడ్డి, పసుమర్తి శేషుబాబు, యశోదా ఠాకూర్, స్వప్నసుందరి, స్మితామాధవ్.. ఇలా ఎంతోమంది నర్తకీమణులకు మేకప్ చేశారు. వారి శిష్యులకు సైతం మేకప్ సహకారాన్ని అందించాను. ఆయా కళాకారులతోపాటు దేశ విదేశాలు పర్యటించాను.
* 2007లో వెనిజులా, మెక్సికో, అరూబా సౌత్ అమెరికా టూర్ చేశాను. 2016లో యుఎస్‌ఏ లో నాలుగు నెలలు పర్యటించాను. 2018లో ఫిజీ వెళ్లాను. మళ్లీ ఈ నెల 18న యుఎస్‌ఏ ప్రోగ్రాం ఉంది.
* గీత గోవిందం, నలచక్రవర్తి, మణిశంకర్ గారి టీవీ సీరియల్స్‌కి మేకప్ సహకారం అందించాను. ఖజురహో, కోణార్క్, కూచిపూడి, హైదరాబాద్ నిషాగంధి, సూర్య, బాంబే, ఉజ్జయిని కాళిదాస్ సమారోహ్, కాశీ ఇలా ఎన్నో డాన్స్ ఫెస్టివల్స్‌లో నృత్య కళాకారులకు మేకప్ చేశాను.
* రావణాసురుడు, మైకాసురుడు, శివుడు, కృష్ణుడు, విష్ణువు, వేంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, సీత, ఆండాళ్, ద్రౌపది, లక్ష్మీదేవి.. ఇలా ఎన్నో పాత్రలకి మేకప్ చేశాను.
* అమ్మానాన్నా చిన్నప్పటి నుంచీ ప్రోత్సహించటం వల్లనే నేనీ స్థాయికి ఎదగగలిగాను. ప్రతి ప్రోగ్రామ్ ఒక మధుర స్మృతి. కళాకారులు నేను వేసిన మేకప్ వల్ల సంతృప్తి పొందితే అంతకంటె కావల్సిందేముంటుంది.
* ప్రతి కళలోనూ, ప్రతి కళాకారుడికీ అడ్డంకులు అవరోధాలూ ఉంటూనే ఉంటాయి. అందరితో సరదాగా కలిసిపోవటం నా మనస్తత్వం. అందరినీ ప్రేమిస్తాను. దాంతో అందరూ నాతో ప్రేమగా ఉంటారు. నాలోని కళను గుర్తించి గౌరవిస్తారు. అదే నాకు తృప్తి.
* ఏ కళలోనైనా రాణించాలంటే కృషి, సాధన తప్పనిసరి. ఇది మేకప్‌కి కూడా వర్తిస్తుంది.
*

-డాక్టర్ శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి