కళాంజలి

సంస్కృతిలోనే కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమతి లక్ష్మీకృష్ణగారు పవిత్ర కృష్ణానదీ తీరంలో విజయవాడలో 17 అక్టోబర్ 1954లో జన్మించారు. వీరు ప్రఖ్యాత వీణ, సంగీత విద్వాంసురాలు. స్వయంగా వీణ వాయిస్తూ పాడటం వీరి ప్రత్యేకత. ఎన్నో అవార్డులు పొందారు. హైదరాబాద్‌లో ‘శ్రీ విశ్వవాణి మ్యూజిక్ స్కూలు’ 1994లో స్థాపించి కర్ణాటక సంగీతం, లలిత సంగీతం, వీణ నేర్పిస్తూ కళాసేవ చేస్తున్నారు. వీరు భగవాన్ విశ్వయోగి విశ్వంజీ భక్తురాలు.
ప్రస్థానం
లక్ష్మీకృష్ణగారికి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం. వీరి గురువులు పద్మభూషణ్ నూకల చిన్న సత్యనారాయణ, పప్పు సోమేశ్వరరావు, మహాభాష్యం చిత్తరంజన్, పద్మశ్రీ డా.శోభారాజు. ఆలిండియా రేడియోలో గ్రేడెడ్ ఆర్టిస్టు వీరు.
1973 ఫిబ్రవరిలో లక్ష్మీకృష్ణగారి వివాహం ములకలూరి రాధాకృష్ణ గారితో జరిగింది.
దూరదర్శన్, ఈటీవీ, జీ, టీవీ9 లలో అనేక కార్యక్రమాలను, దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. సహస్రగళ గానార్చన, నృత్యాంజలి చేశారు. ఐపిఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ చేతుల మీదుగా సత్కారం పొందారు.
‘విశ్వాంబిక’ ‘ఓంకారేశ్వర సుప్రభాతం’ ‘విశ్వగురు సుబ్రహ్మణ్యం’ ‘శ్రీవిశ్వాంజనేయం’ ‘శ్రీ కమలాంబికా భక్తిమంజరి’ ‘శ్రీవిశ్వ చరణం’ ‘శ్రీరమణ సంకీర్తనం’ ‘శ్రీ శారద రామకృష్ణ భక్తిమంజరి’ ‘శ్రీ బెజ్జంకి లక్ష్మి నరసింహస్వామి’ ‘శ్రీ విశ్వవాణి సంగీత పాఠాలు (9 భాగాలు), ‘విశ్వవాణీయం’ ‘విశ్వసంస్కృతి’ (స్వామీ విశ్వంజీ 75వ పుట్టినరోజు ఉత్సవాల సందర్భంగా మార్చిలో వెలువడనుంది). శ్రీమతి లక్ష్మీకృష్ణగారు వెలువరించిన సీడీలు ఇవన్నీ.
పొందిన అవార్డులు
మహిళారత్న - నవ భారత నిర్మాణ సంఘం
స్వరమాధురి - ఊయల
సేవారత్న - అమృత యువసేవ
సంగీత రత్న - శ్రీ తాళ్లపాక అన్నమాచార్య కల్చరల్ అసోసియేషన్
విశిష్ట మహిళామణి, గానరత్న - గోల్డ్‌స్టార్
రాష్ట్ర స్థాయి విశిష్ట సంగీత సేవారత్న - మనోరంజని
అన్నమయ్య పదాంకిత జీవని -జ్ఞానపీఠ గ్రహీత పద్మభూషణ్ డా.సి.నారాయణరెడ్డి చేతుల మీదుగా.
దుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డు
ఏడిద కామేశ్వరరావు మెమోరియల్ అవార్డు
తొలి సంధ్య సంగీత అవార్డు
సంగీత విశారద పోపూరి శంకరశర్మ అవార్డు
శ్రీమతి రావూరి కాంతమ్మ మెమోరియల్ అవార్డు
ఆషాఢ యోష్మణిగురు శత్క్రము
శ్రీరామ ఉగాది మహిళా ఉత్సవ పురస్కారం.
కొన్ని ప్రత్యేక ప్రదర్శనలు
వీరబ్రహ్మంగారి తత్వాలు, సుశీల మెలొడీస్- ఫిలిం సంగీతం, ఫిలిం సాంగ్స్, దేశభక్తి గీతాలు, అన్నమయ్య సంకీర్తనలు, కర్ణాటక సంగీత కీర్తనలు, భక్తి సంగీత విభావరి, అన్నమయ్య పదములు.
శ్రీమతి లక్ష్మీకృష్ణ గారు ‘కళలను కాపాడుకోవడం మన బాధ్యత, హక్కు’ అంటారు. మన సంస్కృతి మన కళలో దాగి ఉంది. రెండూ వేరు కాదు. భారతీయ కళలు భగవంతుని పూజించడం కోసమేనంటారు.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి