కళాంజలి

అరుదైన చారిత్రక నవల.. ‘మాలిక్ కాఫిర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీ.శ.1290 ప్రాంతంలో భారతదేశ చరిత్రను మార్చిన వీరుడు మాలిక్ కాఫిర్. ఇతడు ఢిల్లీని పాలించిన అల్లావుద్దీన్ ఖిల్జీకి బానిస. వెయ్యి దీనారాలకు అమ్ముడుపోయి, నపుంసకుడిగా మార్చబడిన ‘హజార్ దీనారీ’ మాలిక్ కాఫిర్. ఇతను వీరుడు. కానీ నాయకుడు, ప్రతినాయకుడు కాదు. అంటే ఇతను హీరో కాదు, విలన్ కాదు. వేటాడి, వేటాడబడి, తన క్రోధాగ్నిలో తనే ఆహుతి అయిపోయిన అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రియుడు.
మాలిక్ కాఫిర్ ముఖ్య పాత్రలో ఈ మధ్యనే దీపికా పదుకొనె, రణ్‌వీర్‌సింగ్, షాహిద్ కపూర్ తారలుగా పద్మావత్ (పద్మావతీ) సినిమా వచ్చింది. మాలిక్ కాఫిర్ అనే నవల ప్రొ. ముదిగొండ శివప్రసాద్ గారు రాశారు. ఢిల్లీ నుండి వచ్చి మన తలమానికమైన కోహినూర్ వజ్రాన్ని, మన వైభవాన్ని కొల్లగొట్టిన బానిస సేనాని మాలిక్ కాఫిర్.
ఈ నవల పేరు అతని మీదే. కథ మాలిక్ కాఫిర్ చుట్టూ తిరిగినా, ఈ నవల నాయకుడు మాలిక్ కాఫిర్ కాదు. ఈ నవల ఆత్మ అజరామరమైన హిందూ ధర్మం. గంగలా అనంతంగా, చిరాయువుగా హిందూ సంస్కృతి మన దేశంలో సాగుతోంది. గంగానది ఎన్ని మలుపులు తిరిగినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఒక జీవనదిగా ఎన్నో నదులను కలుపుకుంటూ, యుగయుగాలుగా సాగుతోంది. అలాగే హిందూ ధర్మం కూడా మన దేశంలో ఒక జీవనదిగా జీవశైలిగా సాగుతోంది. భారతదేశం వెనె్నముక శ్రీరాముడు. ఆత్మ శ్రీకృష్ణుడు. ఎక్కడ రామనామం జపిస్తారో అది భారతదేశం. శ్రీకృష్ణుడి కథలు ఆడిపాడి యుగయుగాలుగా తరించారు. భారతదేశ సంస్కృతి రామనామంలో దాగి ఉంది. ఈ ధర్మం కుల మతాలకు అతీతంగా, ఈ దేశ ప్రజల్లో జీవనాడిగా, సజీవ నదిగా ఉంది. ఇదే మన జవమూ, జీవమూ!
అలెగ్జాండర్, గజనీ, ఘోరీ, తైమూర్, ఛెంగిజ్‌ఖాన్‌లు బందిపోటు దొంగలుగా వచ్చారు. మాలిక్ కాఫిర్, బాబర్, ఔరంగజేబు ఇక్కడే ఢిల్లీలో వుంటూ మన గుళ్లూ గోపురాలూ కొల్లగొట్టారు. ఎందుకంటే గుడి ఒక బడి. గుడిలో భక్తి, ముక్తి, రక్తి లభిస్తాయి (్భక్తి కూడా!) కాకతీయుల నాటికి గుడి సమాజం కేంద్ర బిందువు. ఇక్కడ పెళ్లిళ్లు జరుగుతాయి. ఉపనయనం, సామాజిక ధార్మిక సంఘటనలు అన్నీ గుడిలోనే జరిగేవి. గుడికి అనుబంధంగా బడి, వైద్యాలయం, ప్రసూతి ఆస్పత్రి, యుద్ధ రంగానికి కావలసిన శిక్షణాలయం ఉండేవి. గుడిలో తక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చేవారు. అంటే గుడి - ఆర్థిక, సామాజిక, ధార్మిక, వైద్య, విద్య, కళ, సైనిక, యుద్ధాలకు కేంద్ర బిందువు. గుడిని కొల్లగొడితే మన సమాజం నిర్వీర్యమై పోయేది. అందుకే ఆ రోజుల్లో ధనాన్ని లూటీ చేయడంతో పాటు, దేవదాసీలను చెరిచి, శిల్పాలను, మన దేవతా విగ్రహాలను కొల్లగొట్టి సంస్కృతిని తుడిపేయడానికి ప్రయత్నం చేసి, సమాజాన్ని నిర్వీర్యం చేసేవారు ఈ దోపిడీదారులు. అయితే గుడిని కొల్లగొడితే మన హిందూ ధర్మం కుంటుపడుతుందనేది ఈ వెర్రివాళ్ల భ్రమ. హిందూ ధర్మం మన రక్తంలో ఇమిడి ఉంది. పుణ్య పవిత్ర గంగానది ప్రవహించినన్నాళ్లూ హిందూ ధర్మం సాగుతూనే ఉంటుంది.
ఇక మాలిక్ కాఫిర్ మొదటి పంక్తి ‘ఓం నమస్తే రుద్రమన్య వఉతోత ఇషవే నమః’ ఔను! ఇది రుద్ర మహారాజు కథ, ప్రతాపరుద్ర మహారాజు గాథ! కథలో నాగయ్యగన్న సేనాని ఆహార్యం వేసుకుంటూ గడ్డం పెట్టుకుంటాడు - ఇది అలంకార భాషలో ‘గండం’. రాబోయే ప్రమాదానికి సూచన. మాలిక్ కాఫిర్ యుద్ధంలో దొరికిన బానిస, బలవంతంగా నపుంసకుడిగా మార్చబడి, మతం మార్పిడికి లోనవుతాడు. అతడు వేటగాడు! తన మనస్సులో క్రోధానికి, బీభత్సానికి తనే వేటాడబడ్డాడు. తన హృదయంలో అతడే నరరక్తం మరిగిన పులి, తనే మేక, తనే కసాయి.
ఏ గుడి నుండి బయటకు వెళ్లగొట్టబడ్డాడో అదే గుడి మీద దండయాత్ర చేశాడు. పురుషత్వం కోల్పోయిన మాలిక్ కాఫిర్‌కు సంసార సుఖం లేదు. ఈ నేపథ్యంలో అతి వైభవోపేతమైన కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. వారి (మన) నిజమైన సంపద కావ్యాలు, శిల్పాలు, గుళ్లల్లో దేవదాసీల నృత్యాలు. ఎంత వైభవం కోల్పోయాం. ‘మాలిక్ కాఫిర్’ నవలకు అంగీరసం అంటే ప్రధాన రసం కరుణ. భవభూతి ఉత్తరామ చరిత్రలో ఇలా అన్నాడు.. ‘ఏకోరసః కరుణ ఏవ నిమిత్త భేదాద్భిన్నః పృథక్పృథ గివాశ్రయతే వివర్తాన్‌॥ ఆవర్త బుద్బుధ తరంగ ఘయాన్వి కారా సంభో యథా సలిలమేవ హి తత్సమస్తమ్‌॥
అంటే కరుణ రసమొక్కటే ప్రకృతి రసం అని అర్థం. ధర్మ నాశం, అర్థనాశం, ఇష్టజన బాంధవనాశం, వధ, ఉరి, దారిద్య్రం, పద భ్రంశం, అవమానం, ధిక్కారం, వ్యాధి మొ. వినటం, చదవటం, చూడటం కరుణరస విభావాలు. దీని స్థారుూ భావం శోకం, రంగుకపోతము, దేవత యముడు. రౌద్రము యొక్క ఫలమే కరుణ (జన్య జనకత్వం)
నర్మదానదిలో ప్రతి రాయి ఒక సాలగ్రామం. ప్రతాపరుద్రుడు లింగోద్భవ సమయంలో నర్మదలో మునిగి లింగైక్యం అయ్యాడు. చారిత్రక నవలా రచన కత్తిమీద సాము. ప్రామాణికత వదిలి గాలిలో గారడీ చేయడానికి వీల్లేదు.
అలాగని మరీ హిస్టరీ పాఠ్య గ్రంథంలా రాస్తే పాఠకుడికి విసుగు వస్తుంది. అందుకే తెలుగులో చారిత్రక నవలలకు నోరి, విశ్వనాథ, అడివి బాపిరాజుతో నాల్గవ మూలస్తంభం ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్.
ప్రతి వ్యక్తి విజయం, పరాజయం వెనుక ఒక స్ర్తి ఉంటుంది. ఖిల్జీ భార్య మల్లికాబేగం వల్ల ప్రతాపరుద్రుడు మాచల్దేవి వల్ల విజయులు కాలేకపోయారు. మాలిక్ కాఫిర్ చనిపోయినా అతని ద్వేషం, పగ కొనసాగి అతని ఆత్మను సజీవంగా ఉంచాయి.
భారతీయ సంస్కృతి మళ్లీ కాకతీయ రుద్రమదేవి నాటి వైభవం చేరుకుంటుందని ఆశిద్దాం.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి