కళాంజలి

‘రమ’ణీయ నృత్యాభినయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డా.పి.రమాదేవి ప్రఖ్యాత నర్తకి, గురువు, పరిశోధకురాలు, రచయిత్రి. కూచిపూడి నృత్యంలో పిహెచ్.డి చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఎం.్ఫల్ చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ.లో స్వర్ణ పతకం పొందారు. వీరు ఎన్నో పుస్తకాలు రాశారు. శ్రీసాయి నటరాజ అకాడమీ స్థాపించి దశాబ్దాలుగా నృత్యం నేర్పిస్తూ ఉత్తమ కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. వీరు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. డా. రమాదేవి అభినయానికి ప్రఖ్యాతి. ఒకవైపు గృహిణిగా, తల్లిగా ఎన్నో వ్యక్తిగత బాధ్యతలు నిర్వహిస్తూ మరోవైపు దశాబ్దాలుగా కళాసేవ చేస్తున్నారు.
డా.రమాదేవి ‘గొల్లకలాపం’ ‘దాదినమ్మ కలాపం’ ఎంతో ఉన్నత స్థాయికి తీసుకువచ్చారు. ‘గొల్లకలాపం’లో పిండోత్పత్తి - పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌తో కూడా ప్రదర్శించారు. వీరి పిహెచ్.డి పరిశోధనాంశం కూచిపూడి - కథాకళి తులనాత్మక పరిశీలన. ఈ నేపథ్యంగా రెండు నృత్య రూపకాలు కళాకళి, కూచిపూడి కళాకారులతో రెండు నృత్య శైలులతో కూడా చేశారు. ‘రామాయణం’, ‘మోహినీ భస్మాసుర’ కాకుండా 8 నృత్య రూపకాలు, ఎన్నో పాటలను రచించారు.
26 ఏళ్ల క్రితం శ్రీసాయి నటరాజ అకాడమీని స్థాపించారు. దీని శాఖలు హైదరాబాద్, నాగపూర్, కేరళ, యుఎస్‌ఏ, పెన్సిల్వేనియాలో ఉన్నాయి. దేశ విదేశాల్లో ఎన్నో లెక్చర్ డెమోలు, వర్క్‌షాపులు, సెమినార్లు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ‘మీనాక్షి అమ్మ’ అవార్డును 10 వేల నగదుతో ఉత్తమ కళాకారులకు ఇస్తున్నారు.
ఎన్నో గౌరవాలు...
* దూరదర్శన్ గ్రేడెడ్ ఆర్టిస్టు.
* ఎం.ఏ. కూచిపూడి స్వర్ణపతకం
* పిహెచ్.డి. కూచిపూడిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.
* ఎస్‌ఆర్‌ఎఫ్ - సీనియర్ ఫెలోషిప్ -
కూచిపూడిలో 2002, డిపార్ట్‌మెంట్ కల్చర్.
ఎన్నోసార్లు భారత ప్రభుత్వం నుండి గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఎన్నోసార్లు సంగీత నాటక అకాడెమీ నుండి ఫైనాన్సియల్ ఎయిడ్.
* కళా సుబ్బారావు స్మారక పురస్కారం - 2006
* దుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డు - 2006
* లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు, ఆరాధన -2008
* నవరస నాట్య ప్రపూర్ణ - 2008
* బాదం సరోజినీదేవి స్మారక అవార్డు
* నవరత్న మహిళా పురస్కారం
* నృతధ్రుమ - కొచ్చి
* నాట్య విలాసిని - భిలాయి
* కళాశ్రీ - కేరళ సంగీత నాటక అకాడెమీ - 2012
* నాట్టియకళై చుడార్ - పొల్లచ్చి తమిళ సాయి
సంఘం -2014
* యువ కళావాహిని, లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు
* గీత గోవింద సమ్మాన్ - జయదేవ సమారోహ్ -2016
* నృత్య విలాసిని - వైశాఖీ ఫెస్టివల్ - విశాఖపట్నం
* నృత్యవిద్యాధరి - నిశుంచిత
ప్రచురణలు...
రమాదేవి ఎన్నో పుస్తకాలు రచించారు. వాటిలో కొన్ని.
* కూచిపూడి డాన్స్ ఇన్ టెక్స్ట్ ఫారం - 2000
* కూచిపూడి కలాపాలు - 2004
* కూచిపూడి నాట్యం - డిప్లొమా సిలబస్ - 2006
* కూచిపూడి నాట్యం - సర్ట్ఫికెట్ కోర్స్ - 2006
* హిస్ట్రియానిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఇన్-
కూచిపూడి డాన్స్ - 2011
* కూచిపూడి - కథాకళి తులనాత్మక పరిశీలనపై సిద్ధాంత వ్యాసం - కంపేరిటివ్ స్టడీ ఆఫ్ చతుర్విధ అభినయాస్
* బిట్వీన్ కథాకళి అండ్ కూచిపూడి
యక్షగానం - 2014
* నాట్యశాస్త్ర ఇన్ ఎ నట్‌షెల్ - సీడీ
* ఈ-బుక్ .. 2013
అలాగే రిథమికల్లీ యువర్స్, కూచిపూడి కలాపంపై వ్యాసాలు, నర్తనంలో వ్యాసాలు, గొల్లకలాపంపై పరిశోధనా వ్యాసాలు, వందేమాతరంలో నాట్యంపై వ్యాసం, నవరసాల మీద కళాస్పందనలో వ్యాసాలు, సాత్త్వికాభినయం ఇన్ భాగవత మేళా ట్రెడిషన్‌పై కళాస్పందనలో వ్యాసాలు, ఇన్నొవేషన్స్ అండ్ చేంజెస్ ఇన్ కూచిపూడి డాన్స్.. వ్యాసాలు ప్రచురించారు.
వీక్షీదేవ దేవం - శ్రీకృష్ణ లీలాతరంగిణి ఆధారంగా, భావయామి రఘురామం, సమ్యక్ సంబుద్ధ, రఘుకుల తిలకం రామం, అష్టలక్ష్మీ వైభవం, శబరి గిరీశ శరణం, సత్యం శివం సుందరం, అమరజీవి పొట్టిశ్రీరాములు, సంక్రాంతి సంబరాలు, సిద్దార్థ, శ్రీ తులసి మహత్మ్యం, చైతన్యమూర్తి వివేకానంద, నారీ మానసం, ఉగాది ఉల్లాసం, భళిరా బైరాజు, తిరుప్పావై, నరకాసుర వధ, నీహారిక, కృష్ణార్పణం, మోహినీ భస్మాసుర, నవరసములు, పంచ భూతాత్మకం దేహం - పంచీకరణం నాట్య యోగం, గాంధారి, గులాబీ -లకు కొరియోగ్రఫీ అందించారు.
కొత్త పథంలో రూపకాలు...
ఋతురవళి, రామాయణం, సప్త నృత్యమంజరి, మో హినీ భస్మాసుర, గొల్ల కలాపం.. ఇలా ఎన్నో ప్రయోగాత్మకంగా, సృజనాత్మకంగా నృత్య రూపకాలను రూపొందించి ప్రదర్శించారు.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి