కళాంజలి

అన్నదానం ఆశయంతో ఆలయానికి భూదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకతీయ సామ్రాజ్యాన్ని 13వ శతాబ్దంలో ఏలిన సామ్రాజ్ఞి రాణి రుద్రమదేవి. ఆవిడ తల్లిగా, కూతురిగా, భార్యగా, మహారాణిగా, వీర వనితగా, సైన్యాన్ని ముం దుకు నడిపించిన శక్తి స్వరూపిణిగా ఎన్నో బాధ్యతలు వహించింది. ఆమె మరణించే సమయానికి 80 ఏళ్ల వయసు దాటినట్లు తెలుస్తున్నది. ఒకప్పుడు ఆమెకు విధేయుడైన జన్నిగదేవుడు, అతని తమ్ముడు త్రిపురాంతకుడు ఆమెకు ఎంతో సహాయం చేసేవారు. కానీ క్రీ.శ.1272 తరువాత త్రిపురాంతకుని తమ్ముడు అంబదేవుడు పాలకుడయ్యాడు. స్వతంత్ర రాజ్యం కోసం శత్రువులతో స్నేహం చేశాడు. అంబదేవుడికీ, రుద్రమకూ జరిగిన పోరాటంలో క్రీ.శ.1289లో రుద్రమ మరణించింది. ఆ పోరాటంలోనే ఆమె సేనాని మల్లికార్జునుడు కూడా మరణించాడు. తాను రుద్రమదేవిని చంపినట్లు అంబదేవుడు తన శాసనాల్లో ఎక్కడా చెప్పుకోలేదు. ఒక వృద్ధ స్ర్తిని చంపడం తనంతటి యోధుడికి అవమానమనేమో! రుద్రమ మరణం చందుపట్ల శాసనం ద్వారా తెలుస్తున్నది.
చందుపట్ల నేటి తెలంగాణలో నల్గొండ జిల్లాకు దగ్గరి గ్రామం. ఈ శిలాశాసనాన్ని పుష్పాల ముమ్మడి, సర్వసేనాని మల్లికార్జున నాయుడి (అభిమాన) పుత్రుడు వేయించాడు. శాలివాహన శక వర్షము 1211 విరోధి నామ సంవత్సర మార్గశిర శుద్ధ ద్వాదశి క్రీ.శ.1289 నవంబర్ 29వ తేదీ అవుతుంది. ఈ శాసనంలో చెప్పిన తేదీ నాడు రుద్రమ మరణించి ఉంటే, శాసనాన్ని 12 రోజుల తరువాత వేసి ఉండాలి. ఎందుకంటే దానాలు 12వ రోజున చేస్తారు. అలా కాకుండా శాసనాన్ని చెక్కించిన రోజు క్రీ.శ.1289 నవంబర్ 29 అయితే, రుద్రమ మరణించిన తేదీ క్రీ.శ.1289 నవంబర్ అవుతుంది. ఈ శాసనంలో శాసన నిర్మాణ తిథి వేశారా? లేక రుద్రమ దేవి చనిపోయిన తేదీ వేసారా? నిర్దిష్టంగా తెలియటం లేదు.
పుష్పాల ముమ్మడి ఎవరు?
ఇతను మహాసేనాని. మల్లికార్జున నాయకుని బంటు అని రాసుకున్నాడు. ‘బంటు’ అంటే భృత్యుడు - సైనికుడు అని అర్థం. కానీ అది ప్రేమ, అభిమానం, గౌరవంతో రాసుకుని ఉండవచ్చు. ఇంత పెద్ద దానాన్ని ఆచంద్ర తారార్కం భూదానం చేసిన స్థోమత సైనికుడికి ఉండదు. అందువల్ల అతడు ఉన్నతాధికారి అయి ఉండవచ్చు. అలాగే ‘నాయనగారు’ అన్నాడు. అంటే మల్లికార్జున నాయకుని స్వంత కుమారుడా? అభిమాన పుత్రుడా? ఏకలవ్య శిష్యుడా? లేక స్వయంగా తీర్చిదిద్దాడా? ప్రేమతో, గౌరవంతో, రాజును లేదా సైన్యాధ్యక్షుని తండ్రికిచ్చిన గౌరవం ఇవ్వడం సహజమే కదా! ఓగిరము అంటే ఆహారము! ఈ శిలాశాసనం ప్రకారం అన్నదాన సత్రం కోసం దానం చేసిన విధానం తెలుపబడింది. ఇది సోమనాథ దేవుని ఆలయానికి భూదానంగా ఇవ్వబడింది.

చందుపట్ల శాసనము

1.స్వస్తిశ్రీ, జయా
2.్భ్యదయ శకవషర్
3.0బులు 1211 విరో
4.్ధ సంవత్సర మార్గర్ శిర
5.శు.ద్వాదశి స్వస్తి శ్రీమ
6.న్మహా మండలేశ్వర కా
7.కతీయ్య రుద్ర
8.మహాదేవి దేవలోక
9.నకు విచ్చేస్తిని శివలోక
10.ప్రాప్తిగాను మల్లికాజు
11.నాయునింగారికి శి
12.వలోక ప్రాప్తిగాను వా
13.బ్రిత్యులు పుష్పము
14.(0) మడింగారు చండ్రుపట్ల
15.సోమనాథ దేవరకు - స ఒస
16.గి ఓగి రానకురా సముద్ర
17.టెనుకను బిల్లెరి లోఠెంటి వ్రి
18.త్తి రూపున్ చారియ చల్లమోర
19.తి - గాను అ-ండ-డా
20.రువ (చ)లి కాలమురా
21.....ంయిన
22.దీనిం ఆచంద్రారక్కముగాను
23.్ధరాపూర్వకముగా
24.నిస్తిమి

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి