AADIVAVRAM - Others

కళాసామ్రాజ్యానికి ‘నటరాణి’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమతి దామెర్ల కనక విజయలక్ష్మి ప్రఖ్యాత కూచిపూడి, భరతనాట్య నర్తకి, గురువు. నర్సాపూర్‌లో 20 ఏళ్ల క్రితం నటరాణి కూచిపూడి డాన్స్ అకాడెమీ స్థాపించి ఉత్తమ కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. శ్రీమతి విజయలక్ష్మిగారు ఒకవైపు వ్యక్తిగత బాధ్యతలు నిర్వహిస్తూ, తల్లిగా, గృహిణిగా ఎన్నో కర్తవ్యాలు నెరవేరుస్తున్నారు. మరొకవైపు గురువు, నర్తకి, పరిశోధకురాలిగా దశాబ్దాలుగా కళాసేవ చేస్తున్నారు. వీరు దేశ విదేశాలలో వేల నృత్య ప్రదర్శనలిచ్చి మన కళలకు వనె్న తెస్తున్నారు.
ప్రస్థానం
శ్రీమతి దామెర్ల కనక విజయలక్ష్మిగారి తల్లిదండ్రులు వి.కృష్ణమూర్తి, శ్రీమతి సుందరీదేవి.
ప్రఖ్యాత గురువులు నాట్య విశారద శ్రీమతి కొత్తపల్లి పద్మ, గురువు వేదాంతం రాధేశ్యాం గారి వద్ద కూచిపూడి, శ్రీమతి వాసిరెడ్డి కనకదుర్గ గారి వద్ద భరతనాట్యం నేర్చుకున్నారు. ఎం.ఏ. ఇంగ్లీష్, భరతనాట్యంలో డిప్లొమా చేసి, 1995లో తెలుగు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. కూచిపూడి చేశారు.
గౌరవాలు
1988 నుండి కూచిపూడి, భరతనాట్యం టీవీ గ్రేడ్ ఆర్టిస్టు.
1991 -ఎన్‌సిసి నేషనల్ అవార్డు గోల్డ్ మెడల్
1992 - సంగీత నృత్య మహోత్సవంలో ప్రథమ స్థానం, సౌత్ సెంట్రల్ జోన్ - నాగ్‌పూర్‌లో.
1993 - హెచ్‌ఆర్‌డి - మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ స్కాలర్‌షిప్ -రూ.24000
ఐసిసిఆర్ - 1995
సింగారమణి - సురసింగార సంసద్ - బాంబే 1997
ఉగాది పురస్కారం - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం -2018
ఉగాది పురస్కారం - 2019 - అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి
శ్రీరామ నవమి అంటే ఏప్రిల్ 14 నుండి ప్రతి నెల, నర్సాపూర్‌లో ఒక దేవాలయంలో నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇది భగవంతుని పూజా విధిలో, సేవలలో భాగంగా మేం చేస్తున్న నృత్యాంజలి అంటారీమె.
1998లో దామెర్ల రాంబాబుగారితో విజయలక్ష్మికి వివాహం జరిగింది. 1999లో ‘నటరాణి కూచిపూడి డాన్స్ అకాడెమీ’ స్థాపించి నృత్యం నేర్పిస్తున్నారు. ఆ రోజుల్లో ఇక్కడ మా అత్తామామగార్లు నాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారంటారు. విజయలక్ష్మి గారికి ఈ రోజుకి 65 మంది శిష్యులున్నారు.
గురువులు
నాల్గవ క్లాస్ చదువుతున్న రోజుల్లో, స్కూల్లో ‘విన్నావా యశోదమ్మా’ నేర్చుకున్నారు. ఒక పెళ్లిలో రాధగా, కృష్ణుడిగా రెండు పాత్రలూ చేస్తూ నృత్యం చేశారు. అప్పుడు ఆమె పిన్నిగారు కొత్తపల్లి పద్మగారు చూసి, మద్రాసు తీసుకెళ్లి తన దగ్గరుంచుకుని నృత్యం నేర్పించటం మొదలుపెట్టారు.
అభ్యాసం
రోజూ పొద్దున్న విజయవాడ మ్యూజిక్ కాలేజీలో శ్రీమతి వాసిరెడ్డి కనకదుర్గ గారి వద్ద భరతనాట్యం నేర్చుకున్నారు.
సందేశం
ఏదో ఒక కళ నేర్చుకోవాలి, నేర్పించాలి. అదే ప్రొఫెషన్‌గా కాకపోయినా హాబీగా ఒక కళైనా నేర్చుకోవాలి. అప్పుడే మన సంస్కృతిని కాపాడుకోగలమంటారు.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి