AADIVAVRAM - Others

సరస మధురకవి సారంగపాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(గత సంచిక తరువాయ)
సారంగపాణి - సామాజిక పరిస్థితులు
సారంగపాణి వేణుగోపాలునికి తన పదములు అంకితం ఇచ్చినా, అందులో వేశ్యా శృంగారాన్ని వర్ణించాడు. ఈ విధంగా స్వామిని ఒక విటుని స్థాయికి దిగజార్చాడు. తన పాటలలో తిరునాళ్లు, తెప్పోత్సవం, గరుడోత్సవం, సంత, గినె్నలు, వాద్యాలు మొదలగునవి వర్ణించాడు.
పదము తన తెలుగులో, కూచిపూడి నృత్యంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. పదకర్తలలో అన్నమయ్య పద కవితా పితామహుడు, పున్నమి చంద్రుడు. సారంగపాణి పద కర్తలలో ధృవతార.
సారంగపాణిపై ప్రభావం చూపిన కొందరు వాగ్గేయకారులు
ఆండాళ్ - 9వ శతాబ్దం
జయదేవుడు - క్రీ.శ.1090-1153
బసవన్న - 12వ శతాబ్దం
అక్కమహాదేవి - 12వ శతాబ్దం
అల్లమ ప్రభువు - 12వ శతాబ్దం
లీలాశుకుడు - 13వ శతాబ్దం
కృష్ణమాచార్యుడు - క్రీ.శ.1268-1323
చైతన్య మహాప్రభు - క్రీ.శ.1486-1534
ప్రోలుగంటి చెన్నశౌరి - 15వ శతాబ్దం
అన్నమాచార్యుడు - క్రీ.శ.1408-1503
పెదతిరుమలయ్య (అన్నమయ్య కొడుకు) - 1568-1554
చినతిరుమలయ్య (అన్నమయ్య మనుమడు) - 1488-1562
చిన్నన్న (అన్నమయ్య మనుమడు)
పురందరదాసు - క్రీ.శ.1484-1564
కందుకూరి రుద్రకవి - 16వ శతాబ్ది ఆరంభంలో
రాఘవేంద్ర స్వామి - క్రీ.శ.1595-1671
రఘునాథ నాయకుడు - క్రీ.శ.1600-1631
విజయ రఘునాథ నాయకుడు - క్రీ.శ.1600-1631
విజయ రాఘవ నాయకుడు - క్రీ.శ.1633-1673
పసుపులేటి రంగాజమ్మ - క్రీ.శ.1633-1673
నారాయణతీర్థులు - క్రీ.శ.1650-1750
సిద్దేంద్రయోగి - క్రీ.శ.1600-1700
క్షేత్రయ్య - క్రీ.శ.1600-1660
కంచర్ల గోపన్న (్భక్త రామదాసు) - క్రీ.శ.1620-1680
పోతులూరి వీరబ్రహ్మం - 17వ శతాబ్దం
శహాజీ - క్రీ.శ.1684-1712
గిరిరాజ కవి (త్యాగయ్య తాత) - క్రీ.శ.1684-1728
తుళజాజి - క్రీ.శ.1728-1736
మేలట్టూరు వీరభద్రయ్య - క్రీ.శ.1740-1752
మునిపల్లె సుబ్రహ్మణ్య కవి - క్రీ.శ.1730-1780
త్యాగయ్య - క్రీ.శ.1750-1850
సారంగపాణి ప్రభావితం చేసిన కొందరు కవులు
తూము నరసింహదాసు (త్యాగయ్య సమకాలికుడు)
మాతృ భూతయ్య - క్రీ.శ.1740-1827
శ్యామశాస్ర్తీ - క్రీ.శ.1762-1827
ముత్తుస్వామి దీక్షితులు - క్రీ.శ.1776-1835
శరభోజి 2 - క్రీ.శ.1798-1855
మేలట్టూరి వేంకట రామశాస్ర్తీ - పై కాలమే
మువ్వలూరి సభాపతయ్య
స్వామి తిరునాళ్ - క్రీ.శ.1813-1847
తంజావూరు చతుష్టయం - పొన్నయ్య, వడివేలు, శివానందం, చిన్నయ్య - క్రీ.శ.1829-1900
బాలాంత్రపు రజనీకాంతరావు
మంగళంపల్లి బాలమురళీకృష్ణ - 1930-2016
సారంగపాణిపై ఎందరో ప్రబంధ కవుల ప్రభావం పడింది.
సారంగపాణి కేవలం శృంగార పదములేకాక, భక్తి, వైరాగ్య పదములు కూడా రచించాడు. భక్తిలో ఇతడు అన్నమయ్య, రామదాసు, త్యాగయ్యలను జ్ఞప్తికి తెస్తాడు.
నారాయణతీర్థులు
నారాయణతీర్థులు రుక్మిణి ముగ్ధ ప్రేమని గానం చేసి తరించాడు. సారంగపాణి నాయికలు కొంతమంది వేశ్యలు కూడా ఉన్నారు. నారాయణ తీర్థులు విప్రలంబ శృంగారం వర్ణించాడు. సారంగపాణి సంభోగ శృంగారం కూడా వర్ణించాడు. ఇద్దరూ శ్రీకృష్ణుడు భక్తులే. ఇద్దరూ సమకాలికులే అయి ఉండవచ్చు. ఎవరు ఎవరిని ప్రభావితం చేశారో చెప్పడం కష్టం.
నారాయణతీర్థులు తన పేరుని తన రచనలలో రాసుకున్నాడు. సారంగపాణి కేవలం వేణుగోపాలునికే తన పదములని అంకితం చేసి, తన పేరు ఎక్కడా రాసుకోలేదు.
నారాయణతీర్థులు ఈ విధంగా రాశాడు-
‘నందన నందన గోపాల జయ
నవనీత చోర గోపాల
కందర్ప శతకోటి సుందర సుఖతర
మందహాస శ్రీ గోపాల..’
ఇది సారంగపాణి కింది జయమంగళమునకు ఎంతో దగ్గరగా ఉంది-
జయ మంగళం నిత్య శుభ మంగళం
ఇందిరా రమణునకు ఇభరాజ వరదునకు
మందరోద్ధారునకు మాధవునకూ
నందనందనుడైన నవనీత చోరునకు
కందర్ప శతకోటి నందునకూ
త్యాగయ్య -క్రీ.శ. 1767 - 1847
త్యాగయ్య సారంగపాణికి సమకాలీనుడేమో! త్యాగయ్య నారదుని అవతారమే! కేవలం భక్తి కోసమే త్యాగయ్య పుట్టాడు. సారంగపాణి కొన్ని శృంగార, జాతీయ పదములు రాసినా, భక్తిలో ఏ విధంగాను త్యాగయ్యకు తక్కువ కాదు. త్యాగయ్య తన పేరుని తన కృతులలో రాసుకున్నాడు. సారంగపాణి తన పేరు రాసుకోకుండా, కేవలం వేణుగోపాల ముద్ర వాడాడు. త్యాగరాజు రామభక్తికే ప్రసిద్ధి, అయినా కొన్ని నృత్య రూపకాలు రాశాడు. ఉదా.నౌకాచరితము. సారంగపాణి ఎంతో వైవిధ్యంతో రాశాడు. సాంఘిక పరిస్థితులను కూడా తన పదములలో ప్రతిబింబించాడు. అది త్యాగయ్యలో మనకు కన్పించడంలేదు.
త్యాగయ్య: ‘తెలియలేరు రామభక్తి మార్గమును
వేగలేచి నీట మునిగి భూతి బూసి..’
ఇది సారంగపాణి పదమునకు ఎంతో దగ్గరగా ఉంది.
సారంగపాణి: భక్తి లేని వ్రతములెన్ని చేసిన ఫలము లేదు సుమీ.. (పదము 183)
అన్నమయ్య - క్రీ.శ.1408-1503
కేవలం వేంకటేశ్వర స్వామి అలిమేలు మంగల దివ్య అలౌకిక శృంగారాన్ని వర్ణించాడు అన్నమయ్య. కాని సారంగపాణి మనుషుల ప్రేమ, వేశ్యల శృంగారాన్ని వర్ణించి వేణుగోపాలునికి అంకితం చేశాడు. అన్నమయ్య, సారంగపాణి ఇద్దరూ తమ పేరు వాడకుండా, భగవంతునికి తమ పదములను అంకితం చేశారు. అయినా, మూడు పదములు సారంగపాణి రాజాంకితం చేశాడు. అన్నమయ్య ఒక్కటి కూడా మనుషులకి అంకితం చేయలేదు. అన్నమయ్య పదములు ఒక సముద్రం. 32 వేలు రాశాడు కదూ! సారంగపాణి ఒక తియ్యని నీరు ఊరే దొరువు. అన్నమయ్య ఆరువందల ఏళ్ల క్రితం రాసిన అచతెలుగు పదాలు కొన్ని మనకు అర్థంకావు. సారంగపాణి భాష ఈనాటి తెలుగుకు ఎంతో దగ్గరగా ఉంది. ఇద్దరూ ఎంతో వైవిధ్యంతో రాశారు. అన్నమయ్యది ఆదర్శవాదం, సారంగపాణిది యథార్థవాదం. ఏ కళ అయినా కళాకారుడికి బహిఃప్రాణమూ, అంతఃప్రాణం కూడా. ఇద్దరి పదములూ వారి జీవన శైలిని ప్రతిబింబిస్తున్నాయి.
అన్నమయ్య పద కవితా పితామహుడు రాసిన ఒక ఊరేగింపు సంకీర్తన ఈ విధముగా ఉంది.
తిరువీధుల మెరసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారముల తోడను
ఇది సారంగపాణి 169వ పదమునకు ఎంతో దగ్గరగా ఉంది.
సారంగపాణి: ‘కదలి వచ్చెను జూడరే - వేణుగోపాలుడు కనుల పండుగగాను’
‘పదిలుడై గరుడునిపైనెక్కి భక్తుల
ముదమందజేయుచు ఇదిగో రాజమార్గమున’
అన్నమయ్య: ‘నానాటి బ్రతుకు నాటకము’
సారంగపాణి: ‘మనుషానొమ్మబాకే - రుూద్రేగాము కళేభారం’
(మిగతా వచ్చే సంచికలో)

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి