మెయిన్ ఫీచర్

ప్రాచీన క్రీడతో పడతులకు రక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు మన దేశం అరుదైన కళలకు,క్రీడలకు కాణాచిగా వెలుగొందింది. అయితే, సుదీర్ఘకాలం పాటు పరాయి పాలనలోమన దేశం మగ్గడంతో ఎన్నో కళలు,క్రీడలు నిరాదరణకు గురయ్యాయి. వీటిలో కొన్ని ఇప్పటికే అంతరించిపోగా, మరికొన్నికనుమరుగయ్యే దశలో ఉన్నాయి. పదమూడో శతాబ్దానికి చెందిన ‘కలరిపయట్టు’ క్రీడ ఎంతో భిన్నమైనది. ఈ క్రీడ అప్పుడప్పుడూ కొన్ని మలయాళ సినిమాల్లో కనిపిస్తూ వుంటుంది. కొచ్చిలోని రోటరీ బాలభవన్‌లో శివన్ కుట్టి అసాన్ అనే శిక్షకుడు ఇపుడు ఈ క్రీడను నేర్పుతున్నారు.

===============

తగినంత ప్రోత్సాహం, ఆదరణ లేక అంతరించిపోయే దశలో ఉన్న ఓ పురాతన క్రీడను పదిలపరచేందుకు ఇద్దరు మహిళలు నడుం బిగించారు. వారి నిరంతర కృషి ఫలితంగా నేడు కేరళ ప్రజలందరికీ ‘కలరిపయట్టు’ అనే భిన్నమైన సంప్రదాయ క్రీడపై ఆసక్తి పెరుగుతోంది. వయోభేదం లేకుండా ముఖ్యంగా మహిళలు ఈ క్రీడను నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికే కాదు.. ఆత్మరక్షణకు సైతం దోహదపడడంతో ఈ క్రీడకు ఇపుడు ఆదరణ పెరిగింది. ఒకప్పుడు మన దేశం అరుదైన కళలకు, క్రీడలకు కాణాచిగా వెలుగొందింది. అయితే, సుదీర్ఘకాలం పాటు పరాయి పాలనలో మన దేశం మగ్గడంతో ఎన్నో కళలు,క్రీడలు నిరాదరణకు గురయ్యాయి. వీటిలో కొన్ని ఇప్పటికే అంతరించిపోగా, మరికొన్ని కనుమరుగయ్యే దశలో ఉన్నాయి. పదమూడో శతాబ్దానికి చెందిన ‘కలరిపయట్టు’ క్రీడ ఎంతో భిన్నమైనది. ఈ క్రీడ అప్పుడప్పుడూ కొన్ని మలయాళ సినిమాల్లో కనిపిస్తూ వుంటుంది. కొచ్చిలోని రోటరీ బాలభవన్‌లో శివన్ కుట్టి అసాన్ అనే శిక్షకుడు ఇపుడు ఈ క్రీడను నేర్పుతున్నారు.
రోస్ వర్గీస్ అనే మహిళ తన ఇద్దరు కుమార్తెలు వర్కి, అన్నాలకు మంచి వ్యాయామం అందించే క్రీడను నేర్పించాలని కొన్నాళ్లుగా ప్రయత్నించారు. అదే సమయంలో ‘కలరిపయట్టు’ గురించి తెలియడంతో, తన కుమార్తెలతోపాటు రోస్ కూడా ఆ క్రీడను నేర్చుకోవడం ప్రారంభించారు. శారీరక దారుఢ్యం, మానసిక ధైర్యం పెరగడం, బరువుతగ్గడం వంటి ఫలితాలు కనిపించడంతో ఈ క్రీడను పరిరక్షించాలని రోస్ సంకల్పించారు. ఒకరోజు ఆమె తన కుమార్తెలతో కలిసి బజారుకు వెళ్తుండగా- ఆకస్మికం గా ఇద్దరు చైన్ స్నాచర్లు బైక్‌పై వచ్చి ఆమె మెడలో ఉన్న చైన్ తెంపు కుని పోయేందుకు విఫలయత్నం చేశారు. వెంటనే ఆమె ఒక ఆగంతకుడి ని పట్టుకుని బైక్‌పై నుంచి కిందకు లాగింది. అదే సమయంలో రోడ్డుపై ఉన్నవారు చైన్ స్నాచర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కలరిపయట్టు నేర్చుకోవడం వల్లనే తాను చైన్ స్నాచర్‌ను పట్టుకోగలిగానని వర్గీస్ చెబుతుంటారు. ఈ క్రీడను మరింత మంది నేర్చుకునేలా ప్రచారం చేయాలని ఆమె తన స్నేహితురాలు సజీతా మీనన్‌ను ఒప్పించారు. ఇలా ఈ ఇద్దరూ కలిసి ఈ పురాతన క్రీడకు ప్రాణప్రతిష్ఠ చేశారు.
కలరిపయట్టు అనగానే కత్తులతో చేసే యుద్ధంగా, హింసతో కూడినదిగా సినిమాల్లో చూపిస్తారు. ఇందులో హింసకు ఎటువంటి అవకాశం లేదంటున్నారు వర్గీస్, సజీతా చెబుతున్నారు. ఇది ఒక విధమైన మార్షల్ ఆర్ట్ అని, దీన్ని నేర్చుకుంటే మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని వారు ప్రచారం చేస్తున్నారు. కొచ్చిలోని సెయింట్ థెరిస్సా కాలేజీలో ఇటీవల 20 రోజులపాటు వీరు నిర్వహించిన శిక్షణ శిబిరం విజయవంతమైంది. కొద్దిరోజుల క్రితం జరిగిన కలరిపయట్టు జాతీయ స్థాయి పోటీల్లో 46 కిలోల విభాగంలో సజీతా మీనన్ ప్రథమ స్థానాన్ని, 52 కిలోల విభాగంలో వర్గీస్ తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రేడియో, టీవీ కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ ఈ క్రీడ పట్ల ఆసక్తి కలిగించేందుకు వీరు కృషి చేస్తున్నారు.

-పి.హైమావతి