రాష్ట్రీయం

అంగరంగ వైభవంగా కలశ జ్యోతుల ఊరేగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ , డిసెంబర్ 24: అమ్మవారి భవానీదీక్షల విరమణ ముందు జరిగే అమ్మవారి కలశజ్యోతుల ఊరేగింపు మహోత్సవం గురువారం సాయంత్రం శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సత్యనారాయణపురం శివరామకృష్ణ క్షేత్రం వద్ద నుండి ఊరేగింపు బయలుదేరింది. వివిధ రకాలైన పుప్పాలతో ప్రత్యేకంగా ఒక వాహనాన్ని అందంగా అలకరించి వివిధ రకాలైన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసారు. ప్రత్యేకంగా ఒక సింహ వాహనాన్ని తయారు చేయించి ఉంచారు. సింహవాహనాన్ని అధిరోహించిన కనకదుర్గమ్మకు దేవస్థానం ఇవో సిహెచ్ నరసింగరావుదంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి వాహనం ముందు వందలాది భవానీలు కలశజ్యోతులు పట్టుకొని జై దుర్గా భవానీకి జై అంటూ భక్తి నినాదాలు చేస్తుండగా ఊరేగింపు బయలుదేరింది. వేలాది మంది భక్తులు కలశజ్యోతులు చేతపట్టి ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మకు సమర్పించారు. గురువారం అర్ధరాత్రివరకు ఈ కలశజ్యోతులను భవానీలు తీసుకురావటం విశేషం.