అక్షర

ఇతివృత్తాల్లో వైవిధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలికి కథలు
వెంపటి హేమ
వెల: రు.300/-
ప్రచురణ:- వంగూరి
ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హైదరాబాద్)
సత్యసాయిపురం,
కుంట్లూరు విలేజ్
హైదరాబాద్- 501 505
సెల్:9849023852

‘కలికి’ కలం పేరుతో వెంపటి హేమ రాసిన 50 కథలతో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికావారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. పత్రికలలో ఇంతకుముందు వచ్చిన కథలకుతోడుగా వెబ్ మ్యాగజైన్లలో వచ్చిన కథలు కూడ ఇందులో ఉన్నాయి.
కథలలో అధిక భాగం పెద్దకథలు. అయితే కథలు చదువుతున్నప్పుడు ఎక్కడా విసుగుపుట్టించదు.
‘విరిసిన హృదయం’ కథ నక్సలైట్లలో చేరిన ఒక యువతి గురించి వివరిస్తుంది. అడవుల్లో జనజీవనం ఇందులో వర్ణించబడింది. మానవత్వాన్ని కొత్తకోణంలో ఆవిష్కరించటం సహజత్వానికి దగ్గరగా ఉంది. పాఠకుడిని ఆలోచింపజేసే మంచి కథ.
‘ప్రతిఘటన’ కథలో కాబోయే భర్తకూ, భార్యకూ మధ్య ఉండే అంతరాన్ని విశే్లషించటం బాగుంది. కేవలం హోదా, సంపాదన మాత్రమేగాదు, మనిషి స్వభావం ముఖ్యం అనే సంగతిని ఈ కథ సూచిస్తుంది.
పొలంలో బావి తవ్వించుకోవటంకోసం ఒక రైతు పడిన కష్టాలు ‘బంగారు కల’ కథలో కన్పిస్తాయి. సహజత్వం ఉట్టిపడే మంచికథగా దీనిని చెప్పవచ్చు. కథ ముగింపు బాగుంది.
‘బతుకుబండి’ కథ మధ్యతరగతి జీవితాలలో సామాన్యంగా ఉండే ఆలోచనలను ప్రతిబింబిస్తుంది.
వక్రమార్గంలో ఆలోచించటంవల్ల కలిగే అనర్ధాలను ‘అమ్మమనసు’ కథలో చూడవచ్చు.
తెలుగు సంవత్సరాలలో 25 ఖర, 26వది నందన. ఈ రెండిటినీ కలిపి 25-26ను ఒక తిట్టుపదంగా మార్చటంలో ఉన్న చమత్కారం ‘రిడిల్’ కథలో ఉంది.
తన కొడుకును పెద్ద చదువులు చదివించటంకోసం ఒక సాధారణ స్ర్తిపడిన తపన ‘పరిగ పంట’ కథలో ఉంది. ఆర్ట్ స్కూల్‌లో పనిచేసే మోడల్స్‌లో కలిగే స్పందనను ఇందులో తెలిపారు.
సమాజంలో గౌరవంగా బతుకుతున్నవాళ్లకు సంబంధించిన ఏదయినా చిన్న చెడువార్త బయటికి రాగానే, దానిని చిలవలు పలవలుచేసి ప్రచారంచేసే టి.వి.్ఛనల్స్ కొన్ని ఉంటాయి. వార్త ఎంతవరకు నిజం అనే సంగతి నిర్ధారించుకోవాలన్న ఆలోచన కూడ వాళ్లకు ఉండదు. తాము నమ్మిందే సత్యమని ప్రచారం చెయ్యటం కోసం వాళ్లుపడే కష్టాలను ‘అనూహ్య ప్రేమకథ’లో ఆసక్తికరంగా వివరించారు. కథ బాగుంది.
వైవిధ్యభరితమైన కథలతో ఉన్న ఈ సంకలనం సమాజంలోని భిన్న పార్శ్వాలను శక్తివంతంగా దర్శింపజేస్తుంది.
‘తెలుగువాడి ఇంట్లో తెలుగు డిక్షనరీ లేకపోవటం గొప్ప వెలితి’ అని పుస్తకానికి రాసిన పరిచయ వాక్యాలలో రచయిత్రి తెలిపారు. ఇదొక మంచి సూచన.

-మార్తి వెంకటేశ్వరశాస్త్రి