ఉత్తరాయణం

కళ్లున్నా చూడలేని సమాజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్ళున్నా చూడలేని ఓ కబోది సమాజమా!
మానవత్వం మంటగలిపిన ఓ మానవ సమూహమా!
సమాజాన్ని కాపాడేది చట్టం కాదు, సంస్కారం సుమా!
సంస్కారాన్ని సమాథి చేసి చట్టాన్ని నిందిస్తున్నావు
అత్యాచారాలు, హత్యాచారాలని, అఘోరిస్తూ అరుస్తున్నావు
అన్ని అనర్థాలకు, అఘాయత్యాలకు, కారణం నీవు
ఔను. నీవే! కాసులకోసం రాకాసి వైపోతున్నావు
మానవత్వాన్ని మంటగలుపుతూ మరెవ్వరిని నిందిస్తున్నావు
కళామతల్లి పేరుతో కామకకళను ప్రదర్శిస్తున్నావు
హింసను విచ్చలవిడిగా పెచ్చరిస్తున్నావు
పాపాలకు ప్రతి రూపాలైన రూపాజీవులకు పట్టంగడుతున్నావు
అపంక్తేయులు సహపంక్తిలో ఉంటే సంబరపడిపోతున్నావు
‘డర్టీ ఉమెన్’ పేరుతో తల్లి తనాన్ని తల్లడిల్ల జేస్తున్నావు
మనిషి మనిషికీ మనసు, మనసుకూ పసివానికీ పండు ముదుసలికీ
మదనజ్వరమనే అంటు వ్యాధిని అంటగడుతున్నావు
‘కామాతురాణాం నభయం న లజ్జా’ అనే మాటనే నీతిగా మార్చుకున్నావు
ఇంటా బయటా! వాణిజ్య ప్రకటనల్లో వార్తల చానళ్లలో
సర్వే సర్వత్రా సరస సల్లాప కలాపాలేనడిపిస్తున్నావు
పవిత్రమైన స్ర్తీ సాంగత్యాన్ని వాణిజ్య ప్రకటనగా మార్చావు
వీధి పోరాటాలూ-విశృంఖల హత్యా దృశ్యాలు
పడకటింటి రహస్యాలు బజారు పాల్జేశావు
అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు, తండ్రీ కొడుకులు
చూడరాని దృశ్యాలను భూతద్దంలో చూపిస్తున్నావు
చౌరాస్తాలలో వివస్తల్ర దృశ్యాలు
కాదంటే కామ ప్రకోప నృత్యాలు
కళల పేరుతో కాట్రేగి పోతున్నావు
మానవుని మృగాన్ని చేస్తూ ఆడిస్తున్నావు ఆనందిస్తున్నావు
ఆ తరువాత ఏదో జరిగితే ఆర్భాటం చేస్తున్నావు
దేవాలయాలలో నగ్న దృశ్యాలను చూచినా
దేవునిపైనే మనసు నిలిపే మహోన్నత సంస్కృతి మనది
అటువంటి సంస్కృతిని సర్వనాశనం చేస్తున్నావు
రేపులనూ, కిడ్నాపులనూ, విఫల ప్రేమల విషాన్ని
ఆసిడ్ దాడుల్ని, ఆత్మహత్యల పర్వాన్ని
పసిపిల్లల మీద కామాంధుల కసితనాన్ని
అన్నింటినీ నీవే పెంచి పోషిస్తున్నావు
కళ్లున్నా కానలేని, మనసున్నా మానవత్వం లేని
ధనమున్నా గుణం లేని మదోన్మత్త సమాజమా
పూర్తిగా పతనం కాకముందే, వర్తమానాన్ని దిద్దుకో
సరి నర్తన తెచ్చుకో బాధ్యతగా మసలుకో
కాదంటే ఒకనాడు ప్రతి మనిషి పిశాచమవుతాడు
మానవ సమాజం మరుభూమిగా మారుతుంది
అప్పుడు-నీవూ, నేనూ- ఎవ్వరం మిగలం
అందుకే జాగ్రత్త మరి
-ఉమాతి బి. శర్మ, సికిందరాబాదు
కొరవడిన శాంతి భద్రతలు
ఒకప్పుడు గుంటూరు నగరం ప్రశాంత జీవనానికి మారుపేరు. నూతన రాజధాని నిర్మాణం, వాణిజ్య సంస్థల అభివృద్ధి కారణంగా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. జనాభా పెరుగుదల కారణంగా ఉత్పన్నమైన అనేక సమస్యలలో ముఖ్యమైది శాంతి భద్రతలు. పట్టణంలో ఇటీవల దొంగలు, ఆకతాయల బెడద బాగా ఎక్కువైంది. స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, షాపింగ్ సెంటర్లు, చివరకు దేవాలయాల వద్ద కూడా మాటు వేసి బ్యాగులు, ఛైన్లు లాక్కుపోవడం చేస్తున్నారు. సెకండ్ షో తర్వాత తిరిగి ఇళ్లకు వెళ్ళేవారిపై దొంగల దాడులు పెరిగాయ. నగర శివారు ప్రాంతాల్లో మాటు వేసి ఇంటి యజ మానులు ఇంట్లో లేని సమయం కనిపెట్టి పట్టపగలే తలు పులు బద్దలు కొట్టి దోచుకుపోతున్నారు. ఇక పోకిరీలు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు. పోలీసు శాఖ నగరంలో ముఖ్యంగా రాత్రిళ్లు గస్తీ ముమ్మరం చేయాలి.
- ఎం. కనకదుర్గ, ముత్యంశెట్టి పాలెం, గుంటూరు
సమాచారం అర్థమయ్యేలా ఉంచాలి
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన ప్రాంగణం (హైదరాబాద్)లో సమాచార హక్కు చట్టాన్ని అనుసరించి విశ్వవిద్యాలయ సమాచార అధికారుల వివరాలను కేవలం ఎ4 సైజ్ కాగితాలతో నోటీసు బోర్డులో ప్రధాన ప్రవేశ ద్వారానికి చాలా దూరంలో ప్రదర్శించడం ఎంతమాత్రం సహేతుకం కాదు. వాస్తవానికి అది సమాచార హక్కు చట్టం బోర్డులా కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం నోటీసు బోర్డుగా చూపరులకు కనిపిస్తుంది. దీనివల్ల సమస్త ప్రజానీకం తెలుగు విశ్వవిద్యాలయం వారి సమాచార అధికారుల వివరాలను తెలుసుకోవడంలోను మరియు విశిష్ట సమాచారాన్ని పొందడంలోను అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. సమాచార హక్కు చట్టం ఆదేశానుసారం విశ్వవిద్యాలయం అధికారుల వివరాలను నిర్దేశిత నమూనాలో ప్రదర్శించకపోవడం ఏమాత్రం సమంజసం కాదు.
ఇప్పటికైనా అధికార్లు సమాచార హక్కు చట్టం-2005 నిర్దేశానుసారం విశ్వవిద్యాలయం వారి సమాచారం,అధికారుల వివరాలను మొబైల్, లాండ్ నంబర్లతో సహా నిర్దేశిత నమూనాలో పెద్దపెయింట్ అక్షరాలతో ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద మాత్రమే ప్రదర్శించాలి.
-జె.జె.సి.పి.బాబురావు, పెద్దకొత్తపల్లి, మహబూబ్‌నగర్