కడప

వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామికల్యాణోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మంగారిమఠం, మార్చి 7: జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠంలో స్వాములవారి మహాశివరాత్రి కల్యాణ మహోత్సవాలలో భాగంగా రెండవరోజైన సోమవారం రాత్రి వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల కళ్యాణం తాడిగొట్ల సూరమ్మ నిర్మించిన కళ్యాణ మండపం నందు అత్యంత వైభవోపేతంగా జరిగినది. వేదపండితులు వేదమంత్రాలు చదువుతూ, ప్రత్యేక పూజలు చేస్తూ స్వామివారి మంగళసూత్రాన్ని ప్రజలందరికీ చూపించి మాంగల్యధారణ చేయడం, ముత్యాల తలంబ్రాలు తదితర కార్యక్రమాలు భక్తులు కన్నులపండువగా ఆనందంతో తిలకించారు. అంతకుముందు ఉదయం 5గంటలకు స్వామివారి సుప్రభాతం, నామసంకీర్తనం, ఉపనిషత్తు పారాయణంతో మొదలై మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్ర నామార్చన మొదలగు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సింహాసనాశీనులైన మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంత వేంకటేశ్వరస్వాములవారికి శిష్యులు గురుపూజోత్సవం నిర్వహించారు. అనంతరం ఉత్సవాలకు తరలి వచ్చిన భక్తాదులకు ఆయన ఆశీర్వచనాలు అందజేశారు. సాయంత్రం గుడి ఉత్సవాన్ని ఎంతో వైభవంగా వేలాదిమంది భక్తుల సమక్షంలో జరిగింది. స్థానిక ఆస్థాన కవి నిగమాగమ కళాకోవిధ మహామహోపాధ్యాయ డాక్టర్ పెదపాటి నాగేశ్వరరావు భక్తులనుద్దేశించి వీరబ్రహ్మేంద్రస్వామి రచించిన భూతభవిష్యత్ వర్ధమాన కాలజ్ఞానములోని అనేక అంశాలకు సంబంధించిన పద్యాలను చదువుతూ అర్థ్భావాలను, స్వామివారి చరిత్రను భక్తులకు తెలియజేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని జిల్లా నలుమూలల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో దేవాలయాలు ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడాయి. తరలి వచ్చిన భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలో గంటలతరబడి నిలబడి స్వామి, అమ్మవార్లను దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. భక్తుల కోసం మఠంలోనున్న అన్ని కులాలకు చెందిన అన్నదాన సత్రాలలో ఏర్పాటుచేసిన అన్నదానమే కాకుండా వివిధ ప్రాంతాలకు చెందిన అనేకమంది దాతలు ముందుకు వచ్చి తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసి భక్తులకు అన్నప్రసాదాలను పెద్ద ఎత్తున ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో అన్ని రకాల వంటలను అందజేశారు. భక్తులకు త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర మొదలైనవి భక్తాదులు పురవీధుల్లో భక్తులకు పంపిణీ చేశారు. ఉత్సవాలకు అటు మైదుకూరు, ఇటు బద్వేలు డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడిపారు. పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా బ్రహ్మంగారిమఠానికి మూడువైపులా ఊరికి చివరిభాగంలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను ఆపి భక్తులను మాత్రమే మఠంలోకి అనుమతించడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సవ్యంగా కొనసాగింది.