జాతీయ వార్తలు

కమల్‌నాథ్ ప్రభుత్వానికి ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ ప్రభుత్వానికి ఊరట లభించింది. శాసనసభ సమావేశాలు వాయిదా పడటంతో నేడు ప్రభుత్వం బల పరీక్షను ఎదుర్కోవటం లేదు. మధ్యప్రదేశ్‌లో సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ లాల్జీ టాండర్ గత శనివారం ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఈరోజు కమల్‌నాథ్ బల పరీక్షకు సిద్ధమవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలంతా బెంగుళూరులో నిర్బంధంలో ఉన్నారని, ఇటువంటి సమయంలో విశ్వాస పరీక్ష నిర్వహించటం సాధ్యం కాదని, అది ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. ఎమ్మెల్యేలు వచ్చిన తరువాత బలపరీక్ష నిర్వహించాలని సీఎం కమల్‌నాథ్ స్పీకర్‌ను కోరారు. శాసనసభ సమావేశాలు ప్రారంభంకాగానే గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం స్పీకర్ ఒక నిముషం పాటు మాట్లాడి సమావేశాలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శాసనసభ్యులు ప్రజాస్వామ్య, శాసనసభ మర్యాదలను కాపాడాలని కోరుతూ ఈనెల 26వరకు సమావేశాలను వాయిదావేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు.