రాష్ట్రీయం

హైందవ సంస్కృతి ప్రపంచానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వామి కమలానంద భారతి ఉద్ఘాటన

శ్రీకాకుళం, నవంబర్ 22: సర్వోత్తమ భారతీయ హైందవ సంస్కృతి సాంప్రదాయాలు భూ మండలానికే ఆదర్శవంతమైనవని హిందూదేవాలయ ప్రతిష్ఠాన పీతాధిపతి, పరివ్రాజకాచార్య కమలానంద భారతీ స్వామీజీ స్పష్టం చేశారు. జిల్లాలోని పొందూరు మండలం కృష్ణాపురం ఆనందాశ్రమం వేదికగా ఆశ్రమ వ్యవస్థాపకులు స్వామి శ్రీనివాసానంద సరస్వతీ అధ్యక్షతన ఆదివారం జరిగిన అఖిలాంధ్ర హిందూ మహాసమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి నడుం బిగించాలని, అన్యమత ప్రచారాలను, గోవధను అడ్డుకోవడంలో సైనికులుగా హిందువులంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. హిందూ సమాజంలోచొరబడి మతమార్పిడులకు పాల్పడిన ఎంతటి శక్తినైనా అడ్డుకోవడంలో ఆశ్రమాలు, సాధువులు, ధార్మిక , పీఠాధిపతులు ప్రజలను చైతన్యం పరుస్తూ తిప్పి కొడతామని హెచ్చరించారు. సిరియా, లెబనాన్, ఇరాక్ తదితర దేశాలకు ముస్లింలు క్రైస్తవులను తరలిస్తూ మూకుమ్మడి హత్యలు చేస్తున్న ప్రదేశాలకు వెళ్లి అక్కడ ప్రచారాలు చేయాలని క్రైస్తవులను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. హిందువులకు జాతి పరిరక్షణకు బాధ్యత వహించడంలో నిర్లక్ష్యత తగదన్నారు. దైవాన్ని దైవంగానే చూడాలి తప్ప వికృత రూపాల్లో చూపడం దైవ కార్యాలయాల్లో రికార్డింగ్ డాన్సులు, అశ్లీల ప్రదర్శనలు సరికాదన్నారు. భగవంతునికి దగ్గరగా ఉండాలని, వృత్తిని దైవంగా చూడాలని పలు చారిత్రక ఆధారాలతో వృత్తిలో గత దైవం ఏ విధంగా ఉండేదో విశే్లషించారు.
హిందూ ధర్మరక్ష సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ గవరయ్య, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రప్రతినిధి కంధత్వ వాసులు ప్రసంగిస్తూ హిందువులంతా సమన్వయంగా వ్యవహరించాలని హైందవ ధర్మానికి విఘాతం కలిగించిన ఎలాంటి శక్తినైనా తిప్పికొట్టడంలో వెనుకంజ వేయరాదన్నారు. భారతీయ రాజ్యాంగంలో హిందూ ధర్మపరిరక్షణకు ప్రత్యేక చట్టాలను రూపొందించినప్పటికీ అవి పటిష్టంగా అమలు కాకపోవడంతో హిందూ వ్యతిరేకశక్తులు పెచ్చుమీరుతున్నాయన్నారు. హైందవ విలువలు, సంఘటితాన్ని చాటిచెప్పే ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తిరుపతికి చెందిన స్వరూపానందస్వామి, అమరావతికి చెందిన స్కంద దేవానంద స్వామిజీ, ఉత్తరాంధ్ర సాధు పరిషత్ గౌరవాధ్యక్షులు సమతానందస్వామి, ఒడిశాకు చెందిన రామానందభారతీ, రుషీకేష్ పరమేశ్వరానందస్వామి, నిరంజనానంద గిరిబాబా, ఆబేదానందస్వామీజీ, సర్వేశ్వరానంద ఉదాసీన స్వామిజీ, యోగానందభారతి స్వామీజీ తదితర స్వామీజీలు పీఠాధిపతులు, ధార్మిక పరిషత్ సంస్థల ప్రతినిధులు తమ ప్రసంగాలు గీతాల ద్వారా భక్తులను ఉత్తేజపరిచి వారి మనస్సులో హైందవ ధర్మ బాధ్యతలను నింపారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఉత్తరాంధ్ర సాధు పరిషత్, భారత స్వాభిమాన్ ట్రస్ట్, పతాంజలి యోగ పీఠ్, కృష్ణంవందే జగద్గురుమ్, ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి, బ్రహ్మకుమారీస్, ధర్మ ప్రచార మండలి తదితర ఆధ్యాత్మిక, ధార్మిక సంఘ ప్రతినిధులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. (చిత్రం) అఖిలాంధ్ర హిందూ మహా సమ్మేళనంలో ప్రసంగిస్తున్న కమలానంద భారతీ స్వామిజీ, హాజరైన భక్తులు