రాష్ట్రీయం

పరిశీలనలో ఆర్‌ఎంపిలకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఏపి మంత్రి కామినేని వెల్లడి
* అధిక వర్షాల వల్ల రూ.3759.97 కోట్ల నష్టం: చిన రాజప్ప

హైదరాబాద్, డిసెంబర్ 21: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోవైద్య సేవలు అందిస్తున్న ఆర్‌ఎంపి డాక్టర్లకు ఇస్తున్న శిక్షణ ఆపివేయలేదని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ శాసనసభకు తెలిపారు. సోమవారం ఆయన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సభ్యులు జివి ఆంజనేయులు, డాక్టర్ అప్పలనాయుడు, డాక్టర్ నిమ్మల రామానాయుడు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, ఆర్‌ఎంపి డాక్టర్లు వైద్య సేవలు అందించేందుకు వీలుగా ధృవపత్రాలు జారీ చేసే విషయం నిబంధనల మేరకు పరిశీలనలో ఉన్నదన్నారు. వైద్య వృత్తిలో ఐదు బోర్డులు ఉన్నాయని, ఈ ఐదు బోర్డుల పరిధిలో ఆర్‌ఎంపిలు లేరన్నారు. వీరికి వైద్య శిక్షణ ఇవ్వడంపై చట్టపరమైన ఇబ్బందులు ఉన్నాయని, గతంలో శిక్షణ ఇచ్చిన సంగతి వాస్తవమేనన్నారు. బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ ఎంబిబిఎస్ కోర్సు చదవని ఆర్‌ఎంపిలకు ఏ ప్రాతిపదిక మీద శిక్షణ ఇచ్చి సర్ట్ఫికేట్లు ఇస్తారని, దీనిని చట్టం అంగీకరించదన్నారు.
రాష్ట్రంలో అధిక వర్షాల వల్ల రూ.3797 కోట్ల నష్టం సంభవించిందని, ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శాసనసభలో ఆయన బదులిస్తూ, రాష్ట్రంలో 9 జిల్లాల్లో 3.53 లక్షల రైతులకు రూ.42694.45 లక్షల మేర వ్యవసాయ పంటల్లో నష్టం సంభవించిందన్నారు. ఉద్యానవన పంటలకు సంబంధించి 24904 మంది రైతులకు రూ.33526.92 లక్షల నష్టం వచ్చిందన్నారు. 2 నుంచి 8 రోజుల పాటు 317 సహాయ శిబిరాలను నిర్వహించి 125020 మంది ప్రజలకు వసతి కల్పించామన్నారు.