కృష్ణ

ఆధునిక సాంకేతికతతో వడి వడిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* జోరుగాసాగుతున్న కనకదుర్గ బ్రిడ్జి నిర్మాణ పనులు
విజయవాడ , నవంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నగరంలో నిర్మిస్తున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు వడి వడిగా సాగుతున్నాయి. నగర అవసరాలు, రాష్ట్భ్రావృద్ధిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 286 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న దుర్గా ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ఇటీవల కొద్ది రోజుల క్రితం ఎంతో నిడారంబరంగా ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చేపడుతున్న పనులలో ప్రపంచ శ్రేణి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వివిధ రకాల యంత్ర సామగ్రిని వినియోగిస్తుండటంతో పనులు చక చకా జరిగిపోతున్నాయి. బ్రిడ్జి పనులకు అవరోధంగా ఉన్న వాటర్ పైప్‌లైన్లు, చరిత్రాత్మకమైన కట్టడం అశోక్ స్థూపం, జాతి నేతల విగ్రహాలతోపాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలను తొలగించిన విఎంసి పనుల ప్రారంభానికి పూర్తికి సహకరిస్తోందనే చెప్పచ్చు. బ్రిడ్జి నిర్మాణంలో అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులతోపాటు విఎంసి కమిషనర్ వీరపాండియన్ కూడా ఈపనులను ప్రతి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఇదిలావుండగా బ్రిడ్జి నిర్మాణం కోసం అవసరమైన పిల్లర్ల ఆగర్ల తవ్వకాలను చేపట్టిన నిర్మాణ కాంట్రాక్టర్ ఒక్కరోజులోనే పలు ఆగర్లను తీసి తదుపరి చర్యలకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే పిల్లర్లకు ఐరెన్ ఛానల్స్‌లను కూడా సిద్ధం చేస్తూ కాంక్రీట్ పనుల నిర్వహణకు సిద్ధం చేస్తున్నారు. పిల్లర్ల ఆగర్ల తవ్వకాల్లో భూమిలోపల కొండ రాయి తగిలితే దానిని కూడా సాంకేతిక యంత్రాలతో తొలగిస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతమంతా ఒకసారి పరిశీలిస్తే పదుల సంఖ్యలో పనివారలు ఎవరి పనుల్లో వారు నిమగ్నమై కనిపిస్తున్నారు. ముందుగా ప్రకటించిన విధంగా కృష్ణా పుష్కరాల నాటికల్లా ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను పూర్తిచేసి ప్రజల వినియోగంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో నిర్మాణ పనులను సాగిస్తున్నారు. 24 నుంచి 27వ డివిజన్లను కలుపుతూ నిర్మితమవుతున్న బ్రిడ్జి పనులతో కనకదుర్గ గుడి మీదుగా రాకపోకలు సాగించే హైదరాబాద్ జాతీయ రహదారి వాహనాల ట్రాఫిక్‌ను మళ్లించిన విషయం విధితమే. బ్రిడ్జి మంజూరు, పనుల ప్రారంభం వెనుక విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని కృషి నిరుపమానమనే చెప్పాలి. అలాగే బ్రిడ్జి పనులు వడివడిగా జరుగుతుండటం పట్ల కొద్ది పాటి అసౌకర్యం కలుగుతున్నా ఎట్టకేలకు నిర్మాణం జరుగుతున్న తీరుపై నగర ప్రజల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న బ్రిడ్జి పనులు పూర్తిస్థాయిలో చేపట్టితే మరిన్ని సాంకేతిక యంత్రాలు, కాంక్రీట్ మిషన్లు, సాంకేతిక నిపుణులు, పనివారలు తదితరుల విరిగా తరలివచ్చే అవకాశం లేకపోలేదు. అయితే మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయి యంత్రాలు వస్తాయని నిర్మాణ పనుల పర్యవేక్షకులు చెబుతున్నారు.