జాతీయ వార్తలు

జయలలిత పాత్రలో కంగనారనౌత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉమెన్ ఓరియంటెడ్ పాత్రల్లో తనదైన ముద్ర వేసుకున్న బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ మరో బయోపిక్‌లో నటించబోతున్నారు. ఇప్పటికే మణికర్ణికలో ఝాన్సీలక్ష్మీబాయ్‌గా నటించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న కంగనా తమిళనాడు ప్రజలతో అమ్మ, పురుచ్చతరైవిగా నోరారా పిలిపించుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్ర పోషించనున్నారు. ‘తలైవి’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు. వైబ్రి మీడియా, విష్ణు ఇందూరు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. భారత రాజకీయాలలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న జయలలితపై తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో బయోపిక్‌ను తీస్తున్నారు. ఈ చిత్రంలో జయలలిత పాత్రను నిత్యామీనన్ పోషిస్తున్నారు.