ఆంధ్రప్రదేశ్‌

బీజేపీ అధ్యక్షుడు కన్నా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. గురజాలలో పార్టీ నిర్వహించే బహిరంగ సభకు వెళ్లేందుకు బయలుదేరిన ఆయనను శివారు ప్రాంతంలో అరెస్టు చేశారు. అక్కడ 144 సెక్షన్ అమలు, శాంతిభద్రతల దృష్ట్యా అక్కడ సభకు అనుమతిని పోలీసులు నిరాకరించారు. ఈ ఉదయం ఆయన్ను నిలువరించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలంకాగా, తన వాహనంలో, కార్యకర్తలు వెంటరాగా, శివార్ల వరకూ కన్నా చేరుకున్నారు. పోలీసులు, కన్నాను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి, తిరిగి నగరంలోకి తీసుకెళ్లారు. తమ నాయకుడి అరెస్ట్ అప్రజాస్వామికమంటూ, బీజేపీ శ్రేణులు ఘటనా స్థలిలోనే నిరసనకు దిగగా, పోలీసులు వారిని చెదరగొట్టారు.