ఆంధ్రప్రదేశ్‌

ముద్రగడ తీరు అభ్యంతరకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:కాపు సామాజికవ వర్గానికి బిసి రిజర్వేషన్ల వ్యవహారంపై ప్రభుత్వం కృతనిశ్చయంతో చర్యలు తీసుకుంటున్నా, గడువులోగానే స్పందిస్తున్నా ముద్రగడ మళ్లీ ఉద్యమానికి సిద్ధపడతామనడం, చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని మంత్రులు తప్పుబట్టారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ముద్రగడ వ్యవహారశైలి వైకాపాకు అనుకూలంగా ఉందంటూ వారు బాబుకు చెప్పారు. దీనిపై స్పందించిన చంద్రబాబు ముద్రగడ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. తమ హామీ మేరకు గడువులోగా పని జరగకపోతే స్పందించవచ్చునని, ఈలోగానే మళ్లీ ఉద్యమం అనడం సరికాదని ఆయన అన్నారు. దీనిపై మంత్రులు దీటుగానే స్పందించి వాస్తవాలు ప్రజలకు తెలియచెప్పాలని సూచించినట్లు తెలిసింది.