ఆంధ్రప్రదేశ్‌

పరిహారం ఇచ్చాకే పనులు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిపిఎం నేత ప్రకాష్ కారత్ డిమాండ్

అనంతపురం, డిసెంబర్ 17: అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలంలో సోలార్ పార్క్ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని, లేకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ప్రకాష్ కారత్ హెచ్చరించారు. గురువారం ఆయన నంబులపూలకుంట మండలంలో సోలార్ భూములను పరిశీలించారు. అనంతరం భూములు కోల్పోయిన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగసభలో కారత్ ప్రసంగిస్తూ దేశం మొత్తం మీద ప్రభుత్వాలు జంగిల్, జమీన్, జల్‌ను పూర్తిగా లూటీ చేస్తున్నాయన్నారు. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న సోలార్ పార్క్ వల్ల రైతులు, సాగుదారులకు పూర్తి అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.10 లక్షల వంతున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్‌టిపిఎస్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అని, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్‌టిపిసి కలిసి భూసేకరణ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే భూముల్లో పనులు మొదలు పెట్టాలన్నారు.‘ మీరు మా వెంట ఉంటే మీ ఉద్యమాన్ని రాష్ట్రం, దేశవ్యాప్తంగా ఉద్ధృతం చేస్తామని భూములు కోల్పోయిన రైతులు, సాగుదారులకు భరోసా ఇచ్చారు. తాను ఢిల్లీ నుండి బెంగళూరు రావడానికి ఎంత సమయం పట్టిందో బెంగళూరు నుండి నంబులపూలకుంటకు రావడానికి అంతే సమయం పట్టిందన్నారు. ఎక్కడైనా భూములు కోల్పోయిన రైతులు, సాగుదారులు నిరసనలు వ్యక్తం చేస్తారని, అయితే ఇక్కడ మాత్రం ఆశ్చర్యకరంగా పోలీసులు రాస్తారోకో చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పరిహారం చెల్లించేంతవరకు ఉద్యమాన్ని ఆపబోమని, బాధితుల తరపున పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఆయన సోలార్ భూముల్లో సుమారు అరగంట పాటు పర్యటించారు.