డైలీ సీరియల్

త్రిలింగ ధరిత్రి - 5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

7
గణపయామాత్యుడు ఆంతరంగిక వ్యవహారాల మంత్రిగా రాజప్రాసాదంలో అత్యంత కీలక స్థానంలో మెలగుతున్నాడు.
గణపతిదేవుడు రాజకుమారుడుగా నవనవోనే్వషంగా రూపుదిద్దుకున్నాడు.
మహారాజు గణపతిదేవుని తరచు కలుస్తూ క్షేమసమాచారాలు తెలుసుకుంటూ అతని చూని ఆనందపరవశుడౌతూ వుంటాడు.
గణపయామాత్యులవారు ప్రభువులు ఏకాంతంగా ఉన్నపుడు కలిశారు, ఒకసారి.
‘‘ప్రభూ! గణపతి దేవులవారి గురించి మీ అభిప్రాయం’’
‘‘ఏముంది? చాలా మంచివాడు, యోగ్యుడు. వినయ విధేయతలు కలవాడు. రాజకుమారుడికి ఉండవలసిన అన్ని లక్షణాలు అతనిలో పుష్కలంగా ఉన్నాయి’’.
‘‘మరి! ఒక విన్నపం చేయనా?’’
‘‘ఆదేశించండి అమాత్యా!’’
‘‘మన యువరాణికి అనువైనవాడేమో యోచిస్తారా?’’
మహారాజు చిరునవ్వు నవ్వాడు.
‘‘ప్రభూ! నేనేమైనా తప్పు మాట్లాడానా?’’
‘‘అసలైన మాట మాట్లాడారు. నేను ఆ రోజు మొదట చూచినపుడే నాకా విషయం మనసులో మెదిలింది. కన్యాదానం చేసి వారి రాజ్యాన్ని వారికిద్దామని’’
‘‘ప్రభువులకు హృదయపూర్వక కృతజ్ఞతలు’’
‘‘అది నేను చెప్పాలి. నా కళ్లు తెరిపించిన బ్రహ్మజ్ఞానమూర్తులు. మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేనిది’’
గణపయామాత్యులు చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కరించాడు.
‘‘అమాత్యా! మంచిరోజు చూడమనండి. అనుకున్నది నెరవేరుద్దాం’’.
‘‘సెలవు’’
గణపయామాత్యులు నమస్కరిస్తూ వెళ్లిపోయాడు. లోపలినుంచి యువరాణి సోమలదేవి, మహారాణి వచ్చారు చెలికత్తెలతో.
మహారాజు సోమలదేవిని దగ్గరకు తీసుకుని శిరోజాలు సవరించాడు ఆప్యాయంగా. చిరంజీవి ఆనందంతో శిరస్సును అతని హృదయానికి ఆనించింది. మహారాణి ఎంతో ఆనందంగా ఉంది.
గణపతి దేవుడు లోపలి నుంచి రాబోయి వీళ్ళను చూసి ఆగిపోయాడు.
చెలికత్తెల వెంట ఆ తల్లీ కూతుళ్లు లోపలికి వెళ్లారు. అది చూసి గణపతి దేవుడు మహారాజు వైపు నడిచాడు.
మహారాజు ‘‘కుమారా!’’ అన్నాడు.
గణపతిదేవుడు వచ్చి మహారాజుకు పాదాభివందనం చేశాడు. జయతుంగుడి ఆనందం వెల్లువలై పారింది. వెంటనే అతన్ని లేవదీసి గాఢంగా కౌగిలించుకున్నాడు. అతని కంటి వెంట ఆనంద బాష్పాలు రాలాయి. అది చూచి గణపతి దేవుడు చలించిపోయాడు.
8
మరునాడు చెన్నాప్రగడ గణపయామాత్యులు విశే్వశ్వర దీక్షితులవారిని వెంట బెట్టుకుని వచ్చారు.
ఇరువురికీ మహారాజు సాదరంగా ఆహ్వానం అందించారు.
దీక్షితులవారు అన్నీ లెక్కలు కట్టి నాటికి నెల రోజులలో మంచి ముహూర్తం ఉంది అని ప్రభువులకు విన్నవించారు.
‘‘అమాత్యావర్యా! ఈ విధంగా చేద్దామంటారా?’’
‘‘ఇది అన్ని విధాలా బాగుంది ప్రభూ’’ దీక్షితులవారన్నారు కల్పించుకుని. అమాత్యులు కూడా అదే అన్నారు.
మహారాజు దీక్షితులవారిని ఘనంగా సన్మానించారు. ఆయన ప్రభువుల వద్ద సెలవు తీసుకొని వెళ్లిపోయారు.
మహారాజు గణపయామాత్యులు ఆయనకు వీడ్కోలు పలికారు.
మహారాజు ఏదో ఆలోచిస్తున్నారు. గణపయామాత్యులవారు ప్రభువువైపే చూస్తున్నారు చేతులు కట్టుకుని.
మహారాణిని యువరాణిని రమ్మని మహారాజు వర్తమానం పంపారు. మహారాణి కుమార్తె సోమలదేవితో వచ్చింది. మహారాజు వారికి గణపయామాత్యులవారిని పరిచయం చేశారు. ఇరువురు అభినందనం చేశారు. గణపయామాత్యులు మహారాణిని ‘దీర్ఘసుమంగళీభవ!’ అని యువరాణిని శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారు. యువరాణికి ఏమీ అంతగా అర్థం కాలేదు గాని మహారాణి ఆశ్చర్యపోయి చూసింది.
ప్రభువులు గణపతిదేవులను రావలసిందిగా వర్తమానం పంపారు. కోట వెలుపలనున్న ఆయన హుటాహుటిన వచ్చి వాలాడు. ప్రభువులకు గణపయామాత్యులవారికి సాదరంగా నమస్కరించాడు. అవనత వదనుడై చేతులు కట్టుకుని నిల్చున్నాడు.
‘‘కుమారా! ఆశీనులుకండి’’ అన్నాడు ప్రభువు.
గణపయామాత్యులవారిని ఆసనం అలంకరించమన్నాడు ప్రభువు. మహారాణిని కూర్చోమన్నాడు. మహారాణి కూర్చున్నది. ఆమె ప్రక్కనే సోమలదేవి నిలబడ్డది. గణపతిదేవుడు మహారాజు ప్రక్కనే నిలబడ్డాడు. ప్రభువు గణపతి దేవుని కూడా కూర్చోమన్నాడు. కాని ఆయన కూచోలేదు.
మహారాజు చాలా సంతోషించి యిట్లా అన్నాడు.
‘‘మహారాణీ! మీకో విషయం చెబుతున్నాను. ఈ చిరంజీవి గణపతి దేవుడు. మహాదేవుని కుమారుడు. ఈ కాకతీయ రాజ్యానికి వారసుడు. ఇతనికి మన యువరాణి సోమలదేవిని ఇచ్చి పాణిగ్రహణం చేయడానికి దైవజ్ఞులు ముహూర్తం నిర్ణయించారు. వారి రాజ్యాన్ని వారికి ఒప్ప చెప్పి గణపతి ద ఏవుని ఒక ఇంటివాడిని చేసి చిరాయువుగా, సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించమని ఆశీర్వదించటానికి నిర్ణయించుకున్నాము. దీనికి మీ అందరూ ఆమోదిస్తారని ఆశిస్తాము’’.
మహారాజు మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. మహారాణి కిమ్మనలేదు. గణపతి దేవుడు ప్రభువుల వైపు చూస్తున్నాడస సోమలదేవి మధ్య వౌనం రాజ్యం చేసింది.
గణపయామాత్యుడు గణపతి దేవుడి భుజంపై చేయి వేశాడు, వచ్చి అతని ప్రక్కన నిలుచుని. మహారాజు వారివైపే చూస్తున్నాడు.
‘‘కుమారా! నీ అభిప్రాయం చెప్పలేదు’’ అన్నాడు ప్రభువు.
‘‘మీ ఆశీస్సులు శిరోధార్యం’’ అన్నాడు గణపతి దేవుడు.
‘‘అమ్మా! నీ అభిప్రాయం’’ అన్నాడు ప్రభువు యువరాణి వైపు చూస్తూ.
ఆమె తల్లి చాటుకు చేరింది నునుసిగ్గు మొగ్గలేయగా.
‘‘చిన్నపిల్ల. దానికేం తెలుసు. మీ మాటే మా అందరి మాట’’ అన్నది మహారాణి.
గణపతిదేవుడు, సోమలదేవి ప్రభువులకు, మహారాణికి గణపయామాత్యులవారికి పాదాభివందనం చేశాడు.
గణపతి దేవుడు సోమలదేవిని, సోమలదేవి గణపతి దేవుని కడగంట చూసుకున్నారు వౌనంగా హృదయాలు స్పందించగా.
వారి హృదయాలు ఆనంద డోలికలలో తూగులాడాయి.
9
మహారాజు జయతుంగుడు గణపమాత్యుడు ఆశీనులై ఏవో రాజకీయ వ్యవహారాలు మాట్లాడుతున్నారు. మహారాజు ఆగి, ‘‘అమాత్యా! మీకు ఒక విషయం చెప్పటం మరచిపోయాను. పది రోజులలో ప్రతి సంవత్సరం మనం జరిపించే వీరోత్సవాలు జరిపించండి. ఈసారి ఈ ఉత్సవాలు మీ ఆధ్వర్యంలో జరిపించాలి’’
‘‘చిత్తం’’
‘‘మన సామంత దేశాలవారికి, పొరుగుదేశాలవారికి ఆహ్వానాలు పంపించండి. ఉత్సవాలకు నాలుగు రోజులు ముందుగా వారి నామధేయాలు తెలియాలని, విలువిద్య, కత్తియుద్ధం, అశ్వసాహిణుల ఎన్నిక అంశాలని ఒక రోజు ముందుగా వారి వారి ప్రతినిధులు రావాలని తెలియజేయండి.
(సశేషం)

-అయ్యదేవర పురుషోత్తమరావు