నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ స్తంభమందుదయించి దానవేంద్రునిఁ ద్రుంచి
కరుణతోఁ బ్రహ్లాదుఁ గాచినావు
మకరిచేఁజిక్కి సామజము దుఃఖింపంగఁ
గృపయుంచి వేగ రక్షించినావు
శరణంచు నా విభీషణుఁడు నీ చాటుకు
వచ్చినప్పుడె లంకనిచ్చినావు
ఆ కుచేలుఁడు చేరెడడుకుల ర్పించిన
బహుసంపదలనిచ్చి పంపినావు
తే॥ వారివలె నన్నుఁ బోషింప వశముగాదె
ఇంతవలపక్షమేల శ్రీకాంత! నీకు?
భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
భావం: కంబాన పుట్టి దుర్మార్గుడైన హిరణ్యకశ్యపుని చంపి ప్రహ్లాదుణ్ణి కాపాడావు. మొసలికి చిక్కి అలమటించిన గజేంద్రుణ్ణి కాచావు. శరణని దగ్గర చేరిన రావణ సోదరుణ్ణి విభీషణుణ్ణి రక్షించి లంకా రాజ్యం కట్టబెట్టావు. ఆ కుచేలుడు చేరెడడుకులు తెస్తే వాటి నారగించి అపార సంపదలతనికిచ్చావు. నేనూ వారివంటి వాణ్ణే గదా! పక్షపాతమేల? ఓ లక్ష్మీమాధవా! నన్ను కూడ ఏలుకో!