Others

నేను మళ్లీ పుడతాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుపాకీ భుజానే్నసుకొని
రేయింబవళ్లు
సరిహద్దుల్లో పహారా కాస్తున్నా,
ప్రకృతి విపత్తుల్లో చిక్కి
సాయం కోసం
అల్లాడే వారికి చేయూతనౌతున్నా,
ఉగ్రవాదుల దాడుల్లో
గుండు గుండెల్లోకి దూసుకుపోతున్నా,
ఉత్కంఠ సమర విజయంలో
ఎన్ని అనుకోని అవాంతరాలు ఎదురైనా,
శరీరంలోని సత్తువంతటిని కూడగట్టి
చివరి శ్వాస వరకు
దేశాన్ని కాపాడగలుగుతున్నాననే గర్వరేఖ
నా కళ్లలో మెరుస్తుంది
దేశ జాతీయ పతాక
నా భుజాన్ని చరుస్తుంది
దేశ ఔన్నత్యాన్ని కాపాడటం కోసం
ఎన్నిసార్లయినా
ప్రాణ త్యాగానికి సిద్ధపడతాను
జన్మభూమి రుణం తీర్చుకోవడం కోసం
వీర సైనికునిగా
నేను మళ్లీ పుడతాను!
*

-గగనం శ్రీనుకుమార్ 8008 262514