Others

మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యావినయ సంపనే్న బ్రాహ్మణీ గవి హస్తిని
శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః (్భగవద్గీత 5-12)
పండితుడంటే ఆత్మజ్ఞాన విశారదుడు. అందరినీ ఆత్మస్వరూపంగా, సమానంగా చూసేవాడు. శ్రీకృష్ణుడు చెప్పిన పండితుడు వ్యాకరణ, శాస్త్ర పండితుడు కాడు. విద్యతో వినయంతో కూడిన నిర్గుణ ప్రకాశకుడయిన బ్రహ్మజ్ఞానం కలిగినవాడు. ఇటువంటి బ్రహ్మజ్ఞానికి శుద్ధసాత్విక సంపన్నులైన ‘‘ఆవు’’లాంటి వారయినా, సాత్విక గుణప్రధానమైన ఏనుగులాంటి వారయినా, రజోగుణం కల్గిన పులిలాంటి వారైనా, కుక్క మాంసం వండుకు తినే ఛండాలుడైనా సమానమే! అదే విధంగా మనిషినైనా, జంతువునైనా కూడా సమదృష్టితో చూడగలిగేవాడు విద్య, వినయం ఉన్న గుణ సంపన్నుడైన బ్రహ్మజ్ఞాని.
ఇలా అహింసతో జీవించాలి! విద్యతో, వినయంతో రాణించాలి!
చేతలోని న్యాయమూ (అహింస) చేతలోని వినయమూ దాని పేరు ధర్మము!
‘‘ఆత్మలోని శాంతమూ- ఆత్మలోని అభయమూ దాని పేరు మోక్షము!’’
శాంతి- అభయం మోక్షమనబడతాయి. మోక్షమంటే ఎవ్వరూ ఇచ్చేవరం కాదు. అది స్వయం సిద్ధి.
శాంతి- ఎలా వస్తుంది శాంతి? కష్టసుఖాలలో కరిగి కరిగి, బాధా సౌఖ్యాలలో మునిగి మునిగి మానమూ అవమానమూ ఒకటిగా జీర్ణించుకుని, కలిమిల్లో లేమిల్లో ధర్మబుద్ధి వీడక, పదవి ఉన్నపుడూ, పదవి పోయినపుడు కూడా సహనంతో ఉండి జననాన్ని మరణాన్ని ఒకటిగా చూసినపుడు ‘‘సమత్వం’’ వస్తుంది.
‘సమత్వం యోగ ఉచ్చతే’
యోగ స్థితిలో ఉంటూనే ప్రాపంచిక కర్మలన్నీ చేయాలి. ఆసక్తి రహితుడిగానే ఉండి కర్మలను చేయాలి. ఫలితం పట్ల సమభావన ఉండాలి. జీవితంలోని సకల ఆటుపోట్లపట్ల ఉదాసీనంగా వ్యవహరించే మానసిక సమత్వం నిరంతర ధ్యానయోగ సాధనవల్ల అలవడుతుంది. అపుడు అనుక్షణం యోగస్థితిలోనే ఉండడం జరుగుతుంది.
‘‘ఇదే సమత్వస్థితి’’! ఈ స్థితిని పొందినపుడే ‘‘శాంతి’’ కలుగుతుంది. భయం తొలగుతుంది. శాంతి పూర్ణమయినపుడు, భయ రాహిత్య స్థితి ‘‘అభయస్థితి’’గా అవుతుంది. ఇదే మోక్షం.
‘‘ఆత్మయని శాంతము- ఆత్మయని అభయమూ దాని పేరు మోక్షము’’
పుట్టిన ప్రతి ఒక్కరూ ఎనె్నన్ని వందల జన్మలెత్తినా పొందవలసింది, పొందేది ఇదే! ఇదే మోక్షం- ముక్తి- స్వర్గం- విడుదల అన్నీ అన్నీ అన్నీ!
సమస్త ప్రాణికోటితో మిత్రుత్వమే దివ్యత్వం-
చేయవలసింది ధ్యానం- చేయించవలసింది ధ్యానం!
పొందవలసింది జ్ఞానం- బోధించవలసింది జ్ఞానం!
ఆచరించవలసింది ధర్మం- ఆచరింపజేయవలసింది ధర్మం!
దానికదే వస్తుందపుడు శాంతి-అభయస్థితి!
మనుషుల్లోని క్రౌర్యం తొలగి, ఉపకారబుద్ధి పెరిగి, సర్వమత సహనం కలిగి అందరూ అహింసతో, ధ్యానంతో జీవింతురుగాక!
సమస్త వృక్ష సామ్రాజ్యమూ వృద్ధినొందుగాక!
సమస్త జంతు సామ్రాజ్యమూ పరిరక్షింపబడుగాక!
సర్వేజనాస్సుఖినోభవంతు లోకాస్సమస్తా సుఖినోభవంతు! ఓం శాంతిః శాంతిః శాంతిః!
ఓం తత్సత్

-మారం శివప్రసాద్ 9618306173, 8309912908