పఠనీయం

జిజ్ఞాసువులకు ఉపయుక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహమ్
(4 భాగాలు)
హిందీ మూల రచయిత - స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం - డా.పాలకోడేటి జగన్నాధరావు
వెల ఒక్కొక్క భాగం - రూ.80/-,మొత్తం రూ.320/-
ప్రతులకు: డా.బాలకోడేటి
జగన్నాధరావు, శ్రీరామకృష్ణ వానప్రస్థ ఆశ్రమం,
పర్వతాపురం, శారదానగర్, కీసర రామలింగంపల్లి పోస్ట్, బొమ్మల రామారం మండలం, యాదాద్రి జిల్లా, పిన్-508126
ఫోన్:9490620512

ఈ గ్రంథాన్ని మొదట హిందీలో స్వామీ వేదానంద తీర్థ రచించారు. తెలుగులో డా.పాలకోడేటి జగన్నాధరావు అనువదించారు. ఋగ్యజుస్సామాధర్వణ వేదాలనుంచి నేటి మానవ సమాజానికి ఉపయోగించే సందేశాత్మకమైన 366 వేదమంత్రాలు ఎంపిక చేసి, వాటికి వేద, శాస్త్ర ఉపనిషదాది ప్రామాణికంగా వ్యాఖ్యానం చేయబడ్డాయని, నిత్య జీవితంలో రోజుకొక మంత్రం చదివినా సంవత్సర కాలంలో పూర్తికాగలదని, అది భగవద్గీత చెప్పిన ద్రవ్య, తపోయోగ, స్వాధ్యాయమనే (్భ.గీ. అధ్యాయం 4, శ్లోకం 28) చతుర్విధ యజ్ఞాలలో స్వాధ్యాయ (వేదాధ్యాయనం) కాగలదని అనువాదకులు ఈ గ్రంథం గురించి ప్రతి భాగం చివరి (అనగా అట్టమీద వెనుక) పేజీలో వివరించారు. ఇది నాలుగు భాగాలుగా విడివిడిగా ప్రచురించారు. గాయత్రీ మంత్రార్థ వివరణతో మొదటి భాగం ప్రారంభం చేసి కర్మ ప్రాముఖ్యంతో చివరి వివరణతో ఈ ప్రథమ భాగం 75 మంత్రాల వివరణతో పూర్తి అవుతుంది. రెండవ భాగం అగ్నితో ప్రారంభం చేసి ఆత్మ వివరణలో 99 మంత్రాలతో పూర్తి అవుతుంది. మూడవ భాగం ఋగ్వేదం 8-1-5తో ప్రారంభం చేసి, సత్కర్మానుష్ఠానంతో పవిత్రుడౌతాడు అని 99 మంత్రాల వివరణతో పూర్తి అవుతుంది. ఇక నాల్గవ భాగం సప్తమర్యాదలతో ప్రారంభించి చివరగా ‘మనిషివి కమ్ము’ అని చెప్పే ఋగ్వేదఋక్కు (10-53-6)తో 97 మంత్రాల వివరణతో సమాప్తమవుతుంది.
చతుర్వేదాలను అధ్యయనం చేయడం ఈ కాలంలో అసాధ్యం. దాంట్లోంచి సమాజం కోసం బాగా ఉపయోగపడే మంత్రాలను కూర్చిన హిందీ మూల రచయిత స్వామీ వేదానందతీర్థ అభినందనీయుడు. తెలుగు అనువాదంలో వివరించిన డా.పాలకోడేటి జగన్నాధరావు అభినందనీయుడు. మూలంలో ఉండే అర్థాలనే తెలుగు భాషలో అనువదించారని అనుకోవచ్చు. ఇది ఆర్య సమాజపు ఆశయాలకు అనుగుణంగానే ఉన్నాయి. చాలా వాటి అర్థాలను సంప్రదాయజ్ఞులు అంగీకరింపకపోవచ్చు. ఉదా:125వ మంత్రము బ్రహ్మవాహనే- జ్ఞానస్వరూపుడు, వేద పారాయణుడు, బ్రహ్మనిష్ఠుడు మొదలైన అర్థాలిచ్చి వేదం అందరికోసమనే అందరూ చదవవచ్చని, అధ్యయనం చేయవచ్చని అనడం దుస్సాహసమే అవుతుంది. నేడు సమాజంలో ఏ కోర్సు చదవాలన్నా ప్రవేశపరీక్షలు పెడుతున్నారు. కావాల్సిన వాళ్ళందరికీ ఆయా విద్యా కోర్సులలో ప్రవేశమివ్వవచ్చుగదా. అందరూ సమానమే కదా!
స్వాధ్యాయనం చెయ్యకపోయినా ఈ గ్రంథం (అర్థాలు) చదువుతే ఎన్నో విషయాలు, భారతీయ సనాతన ధర్మాలు తెలుస్తాయి. అలాగే ముందుమాటలో అనువాదకుడు 12 సదాచారాలు తెలిపారు. ఇది జిజ్ఞాసులకు ఉపయోగపడే గ్రంథం అనటానికి అభ్యంతరం లేదు. అనువాదకుని కృషి ప్రశంసనీయము.

-నోరి నరసింహశాస్ర్తి