జాతీయ వార్తలు

విశ్వాస పరీక్షపై రెండోరోజు చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటక రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. విశ్వాస తీర్మానంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం జరగటం, గందరగోళ పరిస్థితులు తలెత్తటంతో సభ నేటికి వాయిదా పడింది. సభ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వెంటనే సీఎం కుమారస్వామి మాట్లాడారు. కాగా రాత్రి నుంచి బీజేపీ సభ్యులు అసెంబ్లీలోనే ఉన్నారు. వీరికి ప్రభుత్వం అల్పాహారం సదుపాయం కల్పించింది. బీజేపీ సభ్యులను ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర కలిసి వారితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. సభ ప్రారంభానికి ముందు స్పీకర్ మాట్లాడుతూ ఎవరి ఒత్తిడి వల్ల నిర్ణయాలు తీసుకోనని, నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకుంటానని, అందుకు కొంత సమయం పడుతుందని అన్నారు. ఇదిలావుండగా ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకల్లా విశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని గవర్నర్ సీఎంకు సూచించారు.