జాతీయ వార్తలు

సభ్యుల గైర్హాజరుపై స్పీకర్ అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటక రాజకీయ సంక్షోభం ఈరోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ మేరకు స్పీకర్ రమేశ్ కుమార్ సైతం ఈ విషయాన్ని కోర్టుకు సైతం నివేదించారు. సోమవారం నాటకీయ పరిణామాల మధ్య విశ్వాస పరీక్ష వాయిదా పడగా ఈరోజు సమావేశమైనా అసెంబ్లీలో సభ్యుల స్థానాలు ఖాళీగా ఉండటంతో స్పీకర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. సీఎం కుమారస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షపై చర్చ జరుగుతున్న వేళ సభ్యులు కూర్చునే చాలా స్థానాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. దీంతో ఇంత కీలక తరుణంలో సభ్యులు సభకు హాజరుకాకపోవడం, హాజరైన సభ్యులు బయటకు వెళ్లిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత గురువారం నుంచి కుమారస్వామి విశ్వాస పరీక్ష వ్యవహారం కర్నాటక రాజకీయ సంక్షోభాన్ని మరింత ముదరపెడుతూనే వచ్చింది. 13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీ(ఎస్) సభ్యులు రాజీనామా చేయడంతో కుమారస్వామి ప్రభుత్వం సంక్షోభంలో పడింది. మరోపక్క ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఇద్దరు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వ భవిత ఢోలాయమానంగా మారింది. అసెంబ్లీలో అధికార కూటమికి 117 మంది సభ్యులు ఉన్నారు. ఇద్దరు ఇండిపెండెంట్ సభ్యుల మద్దతుతో బీజేపీ సభ్యుల సంఖ్య 107 అవుతుంది. 15 మంది ఎమ్మెల్యేల (12 కాంగ్రెస్, ముగ్గురు జేడీ-ఎస్) రాజీనామాలను స్పీకర్ ఆమోదించినా, ఓటింగ్‌లో వీరు పాల్గొనకపోయినా అధికార కూటమి బలం 101కి పడిపోతుంది.