జాతీయ వార్తలు

థేశంలో కరోనా బాధితుల సంఖ్య 147

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితుల సంఖ్య 147కు చేరుకుంది. తాజాగా పశ్చిమబెంగాల్‌లో ఒక వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. అలాగే ఈ కరోనా మహారాష్టల్రో తీవ్రస్థాయిలో ఉంది. పూణెలో 28 సంవత్సరాల యువతికి కరోనా నిర్థారణ అయినట్లు కలెక్టర్ నావెల్ కిశోర్ వెల్లడించారు. మహారాష్టల్రో 49 మందికి కోవిడ్-19 పాజిటివ్ కేసులు ఉన్నాయి. కరోనా సోకిన 147మందిలో ముగ్గురు మరణించగా, 14 మంది కోలుకున్నారు. మిగిలినవారు చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ కట్టడికి కేంద్రం నివారణ చర్యలు పెద్దఎత్తున తీసుకుంటుంది. ఆఫ్ఘనిస్థాన్, ఫిలిఫ్పైన్స్, యూరోపియన్ యూనియన్‌ల నుంచి వచ్చే విదేశీ ప్రయాణీకులను నిషేధించింది. అలాగే భారత ఆరోగ్య పరిశోధన మండలి సైతం కరోనా వ్యాప్తిపై నిరంతరం పర్యవేక్షణా చర్యలు తీసుకుంటుంది.ప్రయాణాలు చేయనివారు కూడా దీనిబారిన పడుతున్నారా అని నిర్థారించే పరీక్షలు చేస్తుంది.