భక్తి కథలు

కాశీఖండం 144

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాశ్మశానం అనే నామాంతరం కల కాశీపురంలో చర్మముండాదేవి సంతతమూ విహరిస్తూ వుంటుంది. ప్రసిద్ధికెక్కిన రుండ మహాదేవి చర్మముండవలెనే వుంటుంది. ఈ రుండ మహాదేవి కపాల మాల భూషణం అలంకరించుకొంటుంది.
లోపాముద్రా ప్రాణనాయకా! కాశీపుర మధ్యభాగంలో ఆ చర్మ ముండా మహారుండా శక్తి దేవతలిద్దరూ మత్తిల్లి కంకేళీ నృత్తం ఆడతారు. కందుకకేళి, గూఢమణి క్రీడ (ఇసుకలో మణిని దాచి, పట్టుకొను ఆట) ఆదిగా గల క్రీడలతో విలాసాలతో, హాస్య ప్రసంగాలతో సర్వకాల సర్వావస్థలందున్ను సంచరిస్తూ వుంటారు.
హయగ్రీవ తీర్థంలోనే ఆకాశగంగా నదీ ప్రవాహము ప్రక్షాళనం చేసే తన పాదద్వయ పీఠం కలదిన్ని, తాళవృక్షం అంత పొడవు కలదిన్నీ, భయాలను నశింపచేసేదిన్నీ అయిన ఆ మహారుండాదేవిని ఆర్యులు కొలుస్తారు.
అగస్త్య మునీశ్వరా! ఏకాగ్రచిత్తంతో ఆలకించు. ఈ మహారుండకి పశ్చిమ భాగంలో స్వప్నేశ్వరీదేవి వుంది. ఆ స్వప్నేశ్వరి తనున భజించే వారికి స్వప్నంలో భూత, భవిష్యత్ శుభశుభాలను తెలుపుతూ నవమి, అష్టమి, చతుర్దశీ తిథుల్లో పూజలు అందుకొంటుంది. ఆ స్వప్నేశ్వరీదేవికి పడమటి దిక్కున (వరుణుడి దిక్కున) దుర్గాదేవి వెలిసింది. ఆ దుర్గాదేవి కాశీ క్షేత్ర దక్షిణ ద్వార ప్రాంతాన్ని రక్షిస్తూ వుంటుంది’’ అని కుమారస్వామి వాక్రుచ్చాడు. అనంతరం అగస్తి మునిచంద్రుడు కార్తికేయుడితో ఈ విధంగా పలికాడు.
‘‘మంచుకొండ దొరవారి కూర్మి తనయ పార్వతి ‘దుర్గ’ కావడానికి కారణం ఏమిటి? ఆనతీయవలసింది’’. అప్పుడు శంభు సంభవుడు కలశ సంభవుడితో ఈ గతి సవిస్తరంగా చెప్పదొరకొన్నాడు.
దుర్గా మహాత్మ్యము
వెనుక దుర్గుడనే రాక్షసుడు ఒకడు ఉండేవాడు. వాడు రురుడి కొడుకు. తపం సల్పి పొందిన తపోబలం వల్ల పురుషులకి సంహరింప అలవికాని వాడయి భూలోక, భువర్లోక, సువర్లోకాలని బాధించడం ప్రారంభించాడు. ఆ దుర్గుడి బాధపడలేక దేవతలు మహేశ్వరుడిని అభయాన్ని వేడుకొన్నారు. మహేశ్వరుడు వారి మొర ఆలించి ఆ దుర్గాసురుణ్ణి సంహరించడానికి దక్షాయణిని నియోగించాడు.
అంత గౌరి వింధ్యాచలానికి ఏతెంచింది. దుర్గాసురుణ్ణి బంధించి తెమ్మని కాళరాత్రి నియోగించింది. గౌరి ఆ కాళరాత్రికి రాక్షసుణ్ణి హతమార్చడానికి పాతాళానికి పంపడానికి సామర్థ్యాన్ని నేర్పుని ఒసగి తన నియామక శక్తిని తెల్లం చేసింది.
అనంతరం కాళరాత్రి రుద్రాణి ఆజ్ఞ శిరసావహించి ఆ దుర్గాసురుడి దగ్గరికి ఏగి ఈ విధంగా పలికింది. ‘‘రాక్షసరాజా! పార్వతీ దేవి ఆజ్ఞాపించగా వింధ్వగిరి నుంచి రాయబారం సలుపవచ్చాను. నువ్వు బుద్ధిమంతుడివి అయితే నిష్పాపుడివయి భువనాలకు బాధ కలిగింపకుండా వుండు.
భవాని వేద ప్రతిపాదితాలైన సర్వక్రియా కలాపాలని ప్రతిష్ఠింపగోరి బాధ్యత గైకొన్నది. ఆ మహాదేవి ఆన తలదాల్చి చిరకాలం జీవించు. ఆ విధంగా కాకుంటే మొక్కవోని విక్రమంతో ఆ సింహవాహనతో సమరం సలుపు. మేలు చెప్పాను. విననేర్చిన వాడివి అయితే లెస్స. లోకాన్ని నువ్వు బాధింపక వుండడమే మాకు చాలు. మంచుకొండ అనుగు కూతురు ఆజ్ఞ త్రోసిపుచ్చితే నీ కేశాలు ఇరికించి పట్టుకొని ఆమె చెంతకి ఈడ్చుకొనిపోతాను అని గర్వంతో పలికిన కాళరాత్రిని కాంచి, రాత్రించర నాయకుడు క్రుద్దుడు అయాడు. అట్టహాసం కావించాడు. ఆడుదానికి ప్రతాపోక్తులా? ఇంతులకి యింతటి అదిరిపాటు తగదు. నీ దొరసాని ఏమయినా అననీ. నువ్వు వచ్చావు. మాకు అదే పదివేలు.

-ఇంకాఉంది