బాల భూమి

పరీక్ష( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవళ రాజ్యాన్ని శతనందనుడు అనే రాజు పరిపాలించేవాడు. ప్రదీపుడు అతని మంత్రి. ఎప్పటికప్పుడు ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూ వారికి కావలసిన సదుపాయాలు సమకూర్చడానికై తన దగ్గర వున్న రాజోద్యోగులకు ఆదేశాలు జారీచేసేవాడు మహారాజు. ప్రజలకు కూడా రాజు అన్నా, మంత్రి అన్నా చాలా గౌరవం వుండేది. ప్రదీపుడు పెద్దవాడు కావడంతో మరొక యువకుడిని మంత్రి పదవికి ఎంపిక చేయాలని సంకల్పించారు. దాని కోసం అర్హత ఉన్నవారికి పరీక్షలు నిర్వహించారు. మంత్రి పదవి కోసం చాలామంది పోటీ పడ్డారు. పోటీలో గెలిచిన వారు కూడా ఎక్కువే. అంత మందిలో ఎవరిని మంత్రిగా చెయ్యాలనేది ప్రశ్నార్థకం అయింది. శతనందనుడు మహామంత్రిని పిలిచి ‘వీరిలో ఎవరిని మంత్రిగా ఎంపిక చేస్తారు?’ అని కోరాడు. దానికి ప్రదీపుడు మహారాజుతో మాట్లాడి, గెలిచిన యువకుల నుద్దేశించి ‘ఓ యువకులారా! మీరంతా మేము పెట్టిన పరీక్షలో గెలిచినందుకు సంతోషం. కానీ మంత్రిగా నియమింపబడే వారు ఎవరైనా ఒక్క తప్పు చేసినా వారికి తలతీయబడుతుందని మహారాజు తెలిపారు. అందుకు కూడా సిద్ధమైన వారు ఎవరయినా మంత్రి పదవి కోసం ముందుకు రావచ్చు’ అన్నాడు. ప్రదీపుని మాటలకు ఆశ్చర్యపోయాడు మహారాజు. కానీ జరుగుతున్న దానిని గమనిస్తూ వౌనంగా ఉండిపోయాడు.
సభలో గుసగుసలు మొదలయ్యాయి.
మహామంత్రి మాటలు వినగానే కొంతమంది యువకులు వెనకకు తప్పుకోగా విజయుడు, జయుడు అనే ఇద్దరు మాత్రం ఆ పదవి కోసం ముందుకు వచ్చారు.
ముందుగా మహామంత్రి - జయుని పిలిచి ‘నీకు ప్రాణం మీద తీపి లేదా? ఒక్క తప్పు చేసినా ప్రాణాలు పోతాయి తెలుసా?’ అన్నాడు. దానికి జయుడు ‘తెలుసు మహామంత్రి! నేను ఒక్క తప్పు కూడా చేయకుండా మంత్రిగా నా బాధ్యతలు నిర్వహిస్తాననే నమ్మకం ఉంది. అందుకే నేను వెనుకంజ వేయలేదు’ అన్నాడు.
తరువాత విజయుని పిలిచాడు ప్రదీపుడు. ‘ప్రాణాల మీద ఆశ లేదా?’ అన్నాడు. ‘ఎందుకు లేదూ! ఎవరికైనా ప్రాణాలంటే తీపే. కానీ మన మహారాజుగారు గురించి తెలిసిన వారు ఎవరైనా ఒక్క తప్పుకే ప్రాణం తీస్తారని అనుకోరు. గతంలో వారు ఇచ్చిన తీర్పులు, అమలుచేసిన శిక్షలు గమనించిన వాడిని. మహారాజు ఒక్క తప్పుకు ఇంత శిక్ష వేస్తారని అనుకోను. అయినా బాధ్యతగా, సమిష్టిగా తీసుకునే నిర్ణయాలలో తప్పు ఒక్కరిదే అవుతుందని అనుకోను. ముఖ్యమైన నిర్ణయాలు మంత్రిగా, మహారాజుతో సంప్రదించి అటుపై నిర్ణయం తీసుకుంటాను. కనుక తప్పు జరగడమనే ప్రసక్తే రాదని నా అభిప్రాయం’ అన్నాడు. ‘శెహభాష్’ ఇద్దరూ ఇద్దరే. ముందుగా మీ ఇద్దరికీ మన రాజ్యం మీద, మహారాజు మీద, మీపై మీ నమ్మకం నాకు సంతోషాన్ని కలిగించింది. ఒక్క తప్పు కూడా చేయనని ఖరాఖండిగా చెప్పిన జయుడు మీకు అంగరక్షకుడిగా, ముఖ్యమైన విషయాలలో అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటానని తెలిపిన విజయుడు మంత్రి పదవికి ఎంపిక చేయవలసిందిగా కోరుతున్నాను’ అని మహారాజుకి విన్నవించుకున్నాడు. మహామంత్రి నిశిత పరిశీలనకు, యువకుల తెలివితేటలకు సంతోషించిన రాజు విజయుని మంత్రిగా, జయుని అంగరక్షకునిగా ఎంపిక చేశాడు.

-కూచిమంచి నాగేంద్ర