కథ

వేటగాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వేట, వేటకాని యొక్క ఘనతను గురించిన ఆఫ్రికన్ సామెత నొకదానిని తెలుసుకున్నాక, వేట, వేటకాని యొక్క గుణగణాలను గురించిన కథనొకటి చెబుతున్నాను. వినండి’ అన్నారు రుష్యో.
-‘వేట ఎన్ని విధాలుగా సాగుతుందో? దాని వలన ప్రయోజనం పొందుతున్నది ఎవరెవరో? అది వారికి ఏ విధమైన ప్రయోజనం కలిగిస్తుందో, అనే విషయం బోధపడటం కొంచెం కష్టమే అనిపించినా! వేట అనే ఈ కథను మీ ముందుకు నడిపిస్తున్నది మాత్రం ఆ ఆఫ్రికన్ సామెతే కావడం విశేషం. అది ఎలాగా అని అడిగితే? వేటను ప్రస్తుత గిరిజన తెగలలో షికారు అను మాటతో పిలువడాన్ని వినే ఉంటారు. ఆ ప్రకారం, వేట అనేది కాలక్షేపం కొరకు అనే ఒక భావనగా ఉందే తప్పా! -‘కాలక్షేపం అనేది, ఊరికే ఏదో టైంపాస్ కోసం’ అని కాకుండా అది కూడా బ్రతుకుతెరువులో ఒక భాగమేనని గుర్తించక తప్పదు. గనుక, -‘వేట ఒకరికి ప్రాణం అయితే, ఇంకొకరికి అలవాటు. మరొకరికి అదొక సరదా. చూసే వాళ్లకి మాత్రం అది నిజంగా ఒక వినోదమే. ఆదిమ జాతులకు వృత్తిగా ఉంటూ వచ్చిన బ్రతుకు పోరాట యాత్ర ఒక నిజమైన ‘వేట’. ఆదిలో రాతి పనిముట్లతో వేటాడే నేర్పరులు మన పూర్వులు అన్నారు.
ఇంకా వివరంగా చెప్పాలంటే, ‘నేటి గిరిజనులకు వేట ఒక సంప్రదాయబద్ధమే అయినందున, వేటకు విల్లు, అంబు, కత్తి, కర్ర, గొడ్డలి మొదలైనవి సంప్రదాయ ఆయుధాలు. మైదాన ప్రాంతాల్లో చేపల వేట ఒక దినసరి వృత్తి. దీనికి పనిముట్టు వల. ఇవన్నీ సంప్రదాయ బద్ధమైన వేటను గురించిన కొన్ని వాస్తవాలు.
-‘ఊహించిన ప్రకారం, ఒక రోజు మాంసం దుకాణానికి వెళ్లిన సుబ్బయ్య వేటనేసావా భాయ్ అని దుకాణదారుడ్ని అడుగుతాడు.’.. ఎందుకంటే, గొర్రె కసాయివాడి చుట్టం గనుక. అందుకని, మేకను ఉద్దేశించి సుబ్బయ్య వేటనేసావా భాయ్ అని అడిగాడు.’.. ఇదిగో, ఇలా చూడు భాయ్, మీరు సందేహిస్తారనే, వేటతోపాటు తోకను కూడా అలాగే ఉంచాను, చూడండి ఎంత నల్లగా ఉందో అంటాడు దుకాణం వాడు. ఎందుకంటే, కోసింది గొర్రె అని తెలియకుండా’.. వేటాడుకొచ్చాను గనుక అది మేక అని తెలియడానికి.’
..‘మనం ముందే అనుకున్నట్లు జీవితాలను కాలక్షేపం చెయ్యాలి. కాబట్టి, వేటను నిర్దేశించుకోవాలి. అది అన్వయించుకున్న విధానాన్నిబట్టి వేట యొక్క స్వభావం ఆధారపడి ఉంటుంది.
-‘వేటను ఘనతగా ఎంచుకోవడమనేది నేటి వేటగాడి దిగజారుడు తనానికి ఒక నిదర్శనం. కాబట్టి, ఇప్పటివరకు సంప్రదాయబద్ధమైన వేటను గురించి విని వినోదిస్తున్న మీరు’... దొరల వేట కూడా ఒకటుందని మరిచిపోకండి. ఎందుకంటే, అది అమాయకుల ధన, మాన, ప్రాణాలను తీయజూచువేట. గనకనే, అది ఘనతను కోరుకుంటుంది’.. ఎలాగూ అనగా, దర్జాగా ఇతరుల ధనం గురించి వేట సాగిస్తుంటుంది. విచ్చలవిడి శృంగార వాంఛలతో అమాయక స్ర్తిల గురించి వేటాడుతుంటుంది. కిరాయికి లంచం పుచ్చుకొని ఇతరుల ప్రాణాల కోసం ఉచ్చులొడ్డుతున్న వేట కూడా అందులో ఒక భాగమై ఉంటుంది. ఎందుకంటే, ఖ్యాతి కోసం ఓటు గడించాలనీ, ఓటు కోసం ఒక చేత ప్రలోభం, ఇంకో చేత లంచం పట్టుకొని ఇప్పుడిప్పుడే షికారుగా సాగే ఒక ఖరీదైన వేట కూడా మొదలయ్యింది. ఇది ప్రజాస్వామ్యానే్న వేటాడాలని చూస్తున్న నియంతల వేట. రేపో.. మాపో ఆ వేటగాళ్లు మీ వాళ్లనీ వేటాడటానికి మీ ఇంటి గుమ్మం ముందు తచ్చాడొచ్చు. కాబట్టి, ‘ఇందులో మీ వాళ్లని వేటాడటానికి ముగ్గురు పోటీ పడుతున్నారని గుర్తుంచుకోండి. వాళ్లల్లో, ఒకరు రాజకీయం, ఇంకొకరు రౌడీయిజం, మూడోవాడు ప్రలోభం’ - ఈ ముగ్గురూ నియంతల దగ్గర ఊడిగం చేసే బానిసలు’ - వాళ్లు బానిసలుగా మారింది చాలక’, మిమ్మల్నీ బానిసలుగా మార్చడానికి నియంతల పంచన చేరారని గ్రహించకపోతే’... చివరకు మిగిలేది మోసమే’..
కాబట్టి, - ముమ్మాటికీ, ‘ఇది నీచాతి నీచమైన వేట’.. ఈ ముగ్గురిదీ ఒకే వాంఛ. ఘనం - ఘనత - గగనవిహారం. వీళ్లని చూసి సింహాసనం అయ్యో పాపం అని జాలి పడుతుంటే... ప్రజాస్వామ్యం మాత్రం బాధపడక ఏమి చేస్తుంది... అన్నట్టు, మయూర సింహాసనం అంటూ మునుపటికి ఒకటి ఉండేదని మరువకండి. అంటే అది ఏమిటీ అని సందేహం వెలిబుచ్చారు కథను వింటున్న వాళ్లు. ఔను.. అది మన దేశానికి ఎంతో గర్వకారణమైన సింహాసనం, అది ఒక వెల కట్టలేనిది. ఈ రోజు మన దేశం సంపద మొత్తం కలిపినా ఆ మయూర సింహాసనం ముందు ఎందుకూ పనిచేయదు.
-‘ఇది తెలిసి సింహాసనాలు తయారుచేసే బ్రహ్మయ్య బోరున విలపిస్తుండగా.. అదేమని అడగబోతే, ఏమని చెప్పను బాబూ’.. మయూర సింహాసనం మన దేశం విడిచి వెళ్లిపోవడానికి కారణం ఈ వేటగాళ్లేనని చెప్పలేక ఇలా.. అన్నాడు’...
-‘ఇక సామాజిక చింతనా వ్యవస్థలో మరో ఘాతుకమైన వేట ఒకటి కొనసాగుతున్నది. అది మనిషిని మనిషి మనిషిగా గుర్తించుకోకుండా సాగిస్తున్న పాశవికమైన వేట. ఇది తుపాకుల మోతలతో గర్జిస్తున్న వేట. శబ్దం వచ్చిందో, నేల కొరగవలసిందే ఒక వేట, అది ఆరడుగుల నిలువెత్తు పార్ధీవ దేహంతో కూడుకున్న ఒక మానవ రూపం. అది నిశ్శబ్దాన్ని సైతం గంభీరంగా మార్చగలిగే వేట. అన్నాదమ్ముల నడుమన సాగుతున్న కురు, పాండవ పోరు వేట. దీనిని అన్న ఎన్‌‘కౌంటర్’ అంటే’? తమ్ముడు, -‘కాదు, కూంబింగ్ అని ముద్దుగా పిలుస్తున్నాడు. వేటలో ఎదురయితే, తలకాయలు లేచిపోతాయని విషణ్ణ వదనంతో తల్లడిల్లిపోతున్నారు మానవతావాదులు. -‘జరగకనే జరిగింది ఓ ఎన్‌‘కౌంటర్. నేలకొరిగిన దేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. అధికారిక హోదాలో దూర ప్రాంతం నుండి తిరిగొచ్చిన ఉన్నతాధికారి విచారణ నిమిత్తం మార్చురీకి వెళ్లి, ఎన్‌‘కౌంటర్’లో నేలకొరిగిన ఆ కన్న రూపాన్ని చూసి తట్టుకోలేక పోయారు. జరగరాని ఘోరం జరిగిపోయాక ఇంకేమి చేయగలనని నిట్టూర్చారు.
-‘వేట యొక్క స్వభావాన్ని ఏ విధంగా నిర్దేశించుకున్నా, వేటకు వెళ్లిన వాళ్లు తిరిగి ఇంటికొచ్చేంత వరకు బేజారే’-
-‘వేటకు వెళ్లినవాడు కాలక్షేపం అంటే? వేటను కనిపెట్టినవాడు కడుపు నింపుకోడానికి అంటాడు. అలాంటప్పుడు, వేటను కొనసాగిస్తున్న వాడిది కాలనిక్షేపం కాక మరేమవుతుంది. అంటే, వీళ్లందరి ఉద్దేశం నిక్షేపంగా కాలాన్ని అనుభవించడమే.
-‘వేట గిరిజన సంస్కృతిలో ఒక భాగం. సంవత్సరం పొడవునా ప్రకృతిలో లభించే ప్రతిదానిని పండుగ చేయనిదే తినడానికి వీల్లేదని ఆంక్షలు విధించి, పండుగల ద్వారా వినోదించడం ఒక ఆనవాయితీ. సంస్కృతిలోని ఆనవాయితీని పాటించనిదే పండించిన పంటయినా, కొమ్మమీది తేనె పట్టయినా తినరు. తిననియ్యరు. ఇంకొకళ్లకు పెట్ట, పెట్టనియ్యరు. అలా చేస్తే, దానిని పాపం కింద జమకట్టి, తప్పేస్తారు. తిరిగి తప్పునకు ఒప్పు సొమ్ము వసూలు చేసి, ఆ తప్పుడు సొమ్ముతో మళ్లీ.. పండుగ చేసుకుంటారు. ఆ సొమ్ముతో అందరూ ఆనందంగా గడుపుతారు’...
-‘కొన్నింటిని ప్రధాన పండుగలుగానూ ఆచరిస్తుంటారు. అలాంటప్పుడు, అడవిలో షికారు చేస్తూ వేటకు వెళ్లడం ఒక సమిష్టి ఆచారంగా పాటించడం ప్రధాన పండుగ ఆనవాయితీ.
-‘కొత్తల పండుగ మొదలైంది. గూడెం అంతా ఒకటే సందడి’.. స్ర్తిలు గూడెం దేవర దగ్గర సందడి మొదలెట్టారు. గుబ్బేట్ల ఆటలు, గిరిజన నృత్యాలు దేవర దగ్గర హోరెత్తుతున్నాయి.
-‘స్ర్తిలంతా కలిసి సందడి చేస్తూ’.. మగవారి నందరినీ షికారు చేసి వేటను తెమ్మని అడవికి వేటకు సాగనంపే కార్యక్రమం ఆరంభించారు. ఒకటే సందడి’.. మగవాళ్లంతా రెడీ అవుతున్నారు’.. కత్తులు, గొడ్డళ్లు, అమ్ములు, విల్లులుతో’, -‘డోకుబుర్రల్లో కల్లు, కొందరు మంచినీళ్లు, ఇంకొందరు సంప్రదాయమైన విప్పసారాయిని డోకుల్లో నింపుకొని గూడెం నుండి త్రాగుతూ, జోగుతూ, ఊగుతూ బయలుదేరారు. ఆడవాళ్లు పేడ కలిపిన నీళ్లబిందెలతో వేటకు వెళుతున్న తమ మగవాళ్లకు ఎదురు రావడం’.. సంప్రదాయంగా జరిగిస్తున్నారు. వెళుతున్న వాళ్లని ఆనందంతో సాగనంపడం కోసం, తప్పుల దరువులు కొమ్ముడాన్సులు’.. అదే సమయంలో అటుగా వెళుతున్న కొందరు పర్యాటకులు ఆ సన్నివేశాన్ని చూసి, -‘ఆ.. కోలాహలాన్ని డాక్యుమెంటరీ తీస్తే ఎంత బాగుణ్ణో అనుకున్నారు’..
-‘ఇదేంటి? ఏ పాలో, నీళ్లో పట్టుకొని ఎదురు రావాలి గానీ! పేడ కలిపిన నీళ్లతో ఎదురు రావడమేంటి? అనే సందేహం వాళ్లకే కాదు, మీకూ ఆశ్చర్యం కలిగించక మానదు’..
-‘వేటకు వెళ్లిన పురుషులు దొంగచాటుగా, నక్కీ నక్కీ’.. ఒకళ్లకు తెలియకుండా ఒకళ్లు, ఎవరిండ్లలో వాళ్లు చప్పుడు చేయకుండా దూరుతున్నారు’.. ‘ఎవరికంటా పడకుండా’...
-‘స్ర్తిలంతా తమ తమ మగాళ్లు వేటలతో అడవి నుండి తిరిగొస్తారని వేడుకగా రెండు రోజులు నుండి దేవర దగ్గర సందడి చేస్తూ ఆశతో ఎదురుచూస్తున్నారు.
-‘పండుగ సందడి లేకుండా’.. జిహ్వకు చియ్యలు తీసుకురాకుండా’.. అడవిలో వేటాడినవన్నీ కాల్చుకొని మొత్తం తిని తాగి, షికారు చేసుకొని ఉత్త చేతులతో వత్తుర, హమ్మా! మీ సంగతి ఇలా.. కాదు, అనుకొంటూ’.. స్ర్తిలు రెచ్చిపోయి’.. వెళ్లేటప్పుడు పేడ కలిపిన నీళ్ల బిందెలను అలాగే దాచి ఉంచిన సంగతిని’.. చటుక్కున గుర్తు చేసుకున్నారు.
-‘పేడ నీళ్లతో ఆ స్ర్తిలు వాళ్ల, వాళ్ల మగవాళ్లకి కంపు స్నానం చేయిస్తూ, ఆట పట్టిస్తున్నారు. హోళీ పండుగ నాడు రంగుల నీళ్లు చల్లుకున్నట్లు. వరసైన వాళ్లు దీన్ని ఆసరాగా చేసుకొని బావా మరదళ్ల ఆటకు తెరదీస్తున్నారు. ఈ సన్నివేశం చూసేవాళ్లకు మరీ వింతైన అనుభూతిని కలిగిస్తున్నది. ఇది ఆదిమ సంస్కృతిలో ఒక భాగమే కాకుండా, నిష్కల్మషమైన ఆచార వ్యవహారం. ఇందులో ఆనందమే తప్ప అరమరికలుండవ్! కుట్రలూ, కుతంత్రాలకు కించిత్తు కూడా తావుండదు.
-‘ప్రకృతి ఒడిలోని వేటకీ, వేట నేర్చిన వేటకీ ఎంత తేడాయో తెలుసా! ప్రకృతి ఒడిలోని వేట స్వార్థమెరుగనిది. వేట నేర్చిన వేట స్వార్థమెరిగినది, బహు ప్రమాదకారి..
-‘వేట నేర్చిన వేటగానితో జతకట్టిన కొందరిలో ఓ తొమ్మండుగురు అతనితో కలిసి ఓ రోజు సరదాగా వేటకు బయల్దేరారు. షరతేమంటే? పది మందిలోని ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ఇండ్లలో వేట కెళుతున్నట్లు చెప్పి వెళ్లడం.
..‘ఆ విధంగా తమ తమ ఇండ్లలో చెప్పి, వేటగాడితో కలిసి వేటకు వెళ్లిన మొత్తం పది మందిలో, వేటగాడితో కలిపి తొమ్మండుగురు మాత్రమే ఒట్టి చేతులతో ఊళ్లోకి తిరిగొచ్చారు. మరి పదోవాడి సంగతి ఏంటని ఊళ్లో వాళ్లు ఆరా తీయగా’.. వేటకు బలైపోయాడని బదులిచ్చారు. మరి వాడి శవమైనా’.. ఎందుకు తేలేదు అని అడిగితే? పెద్ద మెకం తన నోట గరిచి ఎత్తుకెళ్లిపోయిందనీ, తాము మాత్రం ప్రాణాలరచేత పట్టుకొని పారిపోయి వచ్చామన్నారు. పోనీలెండి. మీలోనైనా మా వాడి ముఖం చూసుకొని బ్రతుకుతామని సరిపెట్టుకున్నారు. పదోవాడి తల్లి, తండ్రి. ఎందుకంటే, వాడు వేట నేర్చిన వేటగాడు గనుక’. వాడితో జత చెయ్యకురా అంటే, విన్నాడు గనుక వీడు మాత్రం.
..‘ఈసారి సింహాల నుండి ఒక వేటగాడొచ్చాడు. వేట నేర్చిన వేటగాని యొక్క ఘనతను గురించి విని, నాతో వస్తావా వేటకెళ్దాము అన్నాడు. సింహాల నుండి వచ్చిన వేటగాడు. -‘సరేనన్నాడు, వేట నేర్చిన వేటగాడు, కసిగా’ - మిగతా తన ఎనమండుగురు జతగాళ్లతో కలిసి పది మందీ వేటకెళ్లారు అడవికి. వేట మొదలైంది. తొమ్మండుగురినీ చెట్లకు వ్రేలాడదీశాడు తలక్రిందులుగా, సింహాల నుండి వచ్చిన వేటగాడు. ఎందుకు మమ్మల్ని వ్రేలాడదీసావు, అని అడిగారు వ్రేలాడుతున్న తొమ్మండుగురూ. మీరు వేటాడడంలో సాధించిన ఘనతను గురించి విన్నాను. విని వచ్చాను అన్నాడు. సింహాల నుంచి వచ్చిన వేటగాడు. అవును మేం వేటలో ఘనత సాధించిన వాళ్లమే. ఎవరు కాదన్నారు, అని వ్రేలాడుతూ అడిగారు.
ఏమిటీ మీ ఘనత? మోసం నేర్చి వేట అనే నెపంతో అమాయకులను కిరాయి పుచ్చుకొని అడవికి తీసుకొచ్చి చంపడమా? ఆ విధంగా చంపి, గిరిజన సంస్కృతికి వారధి అయిన వేట అనే పేరును మీరు వాడుకోవడమా? దీన్నా వేట అంటారు, అని గర్జించాడు సింహాల నుండి వచ్చిన వేటగాడు.
-‘ఇంతలో ఓ సింహం అటుగా రావడాన్ని చూశారు, వ్రేలాడుతున్న తొమ్మండుగురు పై నుండి. తాము వ్రేలాడుతున్న సంగతిని మరిచి, హమ్మయ్య తాము మాత్రము బ్రతికిపోయాము దేవుడో అనుకొంటూ’.. సింహాల నుండి వచ్చిన వేటగాడి పని ఖతం అనుకొంటూ, అతని వంక చూస్తూ ఎగతాళిగా నవ్వడం ఆరంభించారు.
...‘కానీ, వస్తున్న ఆ.. సింహం మాత్రం కింద ఉన్న వేటగాడిని గుర్తుపట్టింది. నిన్ను, నేనేమీ చేయలేను. నీవూ, ననే్నమీ చేయవద్దు అన్నట్టుగా ఫీలింగ్ పెట్టింది.
సింహాల నుండి వచ్చిన వేటగాడికి, సింహం మనసులోని ఆవేదన అర్థమయ్యి, ఏమిటీ అన్నట్టు సింహం వంక చూడసాగాడు. అప్పుడు ఆ... సింహం వేటగాడితో ఏమని మనవి చేసుకుందంటే? -‘ఆ వ్రేలాడుతున్న వేటగాళ్లలో, వేట నేర్చిన వేటగాడు మాత్రమే తనకు ఆహారంగా కావాలి అని, అందుకు సింహాల నుండి వచ్చిన వేటగాడు కూడా సరే నన్నాడు.
-‘ఈసారి కూడా వేట నుండి మళ్లీ తొమ్మండుగురే తిరిగొచ్చారు. కానీ, వేటనేర్చిన వేటగాడు తిరిగి రాకపోయేసరికి ఊళ్లో వాళ్లకు ఆశ్చర్యంగా అనిపించి, మిగతా ఎనమండుగురినీ అడగగా, వాడు వేట నేర్చిన వేటగాడు కాదు, మోసం నేర్చిన దగాకోరు. తనకు వేట బాగా తెలుసునని మమ్మల్ని నమ్మించి తన ఘనతను తానే చాటుకుంటూ, కిరాయికి ఒప్పుకొని మనుషుల్ని చంపుతూ అమాయకమైన జంతువుల మీద ఆ.. నెపం మోపేవాడు. ఇదిగో, ఇతను నిజమైన వేటగాడు. మమ్మల్ని సింహం బారి నుండి రక్షించి, వేట నెపంతో ఘనతను చాటుకునే వాడిని, సింహానికి ఆహారంగా అర్పించి మమ్మల్ని కాపాడి తీసుకొచ్చాడు. వేటలో ఆరితేరిన నిజమైన చరిత్రకారుడు, అంటూ...
సింహాల నుండి ఒక చరిత్రకారుడు ఉద్భవించే వరకు వేట, వేటకాని యొక్క ఘనత గొప్పగా చాటుకుంటూనే ఉంటారు, వేటగాళ్లు అని వివరించి ముగించారు రుష్యో.

కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-పోలుమాటి రాంబాబు.. 8897372121