కథ

తెగిన బంగారు గొలుసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘హాయ్ అంకుల్, రేపు మీరు వూళ్లోనే ఉంటారా?’
‘ఎవరూ మాట్లాడుతోంది’ రాజశేఖర్, చంద్రశేఖర్‌కు ఫోన్ ఇస్తూ.
‘నేనే ప్రసన్న అంకుల్, గుర్తు పట్టలేదా?’
ఈ మధ్య ఇదొకటి ఎవడో సెల్‌ఫోన్ చేయడం, ‘హాయ్’ అనడం ‘గుర్తు పట్టలేదా’ అని ఒక ఐ.క్యూ. విసుక్కున్నాడు చంద్రశేఖర్ అప్పుడే ఆఫీస్‌కి వెళ్లే తొందరలో తయారవుతూ ఫోన్ కట్ చేశాడు.
మళ్లీ ల్యాండ్ ఫోన్ రింగైంది. ‘హలో ఆంటీ నేను ప్రసన్నను మాట్లాడుతున్నాను. రేపు గానీ, ఎల్లుండిగానీ ఇంటి వద్దనే ఉంటున్నారా?’ ప్రసూన విసుగ్గానే ఫోన్లో ‘అంకుల్ ఆఫీసుకెళ్లే తొందరలో ఉన్నారు. ఐదు పది నిమిషాల తరువాత మళ్లీ చేయి’ అంటూ ఫోన్ పెట్టేసింది.
ప్రసన్న తన ఆడపడుచు కూతురు. తనతో ఏం పనో? తన వయసు కూడా కాదు చాలా ఆక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ ఏదో బిజీ బిజీగా తిరుగుతూంది. భర్త పెద్ద ఉద్యోగస్థుడు. డబ్బుకేం కొరత లేదు. అయినా ఇంట్లో కూర్చుని తింటే గుట్టలైనా అరుగుతాయంటూంది.
డబ్బు జబ్బు పట్టుకుందేమో, ఎప్పుడో ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలనే తపన, ఆశ. క్లబ్బు క్కూడా వెళుతోంది. అదీ కూడా బిజినెస్‌గా మార్చుకునే తెలివితేటలు గల చలాకీ అమ్మాయి.
‘ఏం ఆంటీ? ఏదో ఆలోచిస్తూ కూర్చున్నారు’ పక్కింటి కామాక్షమ్మ కూతురు పంజకం అప్పుడే లోపలికొస్తూ.
ఇక ప్రసన్న, పంకజం కలిస్తే అంతా వ్యాపార సంబంధమైన భాష. తనకి కొంత అర్థమై కొంత అర్థం కాకున్నా లేచి వెళితే బావుండదు అని అలాగే కూర్చుండిపోతూంది. ఎప్పుడైనా తన ఇంట్లో ఆ ఇద్దరు కలుసుకున్నప్పుడు అంతా కమర్షియల్ వాతావరణం.
మళ్లీ టెలిఫోన్ మోగింది. ‘హలో నేను ప్రసన్నను మాట్లాడుతున్నా. ‘పంకజం’ వచ్చిందా ఆంటీ?’ అవతల వైపు ప్రసన్న.
‘ఆఁ వున్నది. ఫోన్ ఇస్తాను’ పంకజానికి ఫోన్ అందించి, తాను దూరంగా జరిగింది.
‘ఆఁ చెప్పవే ప్రసన్నా ఏంటీ విశేషాలు?’
‘శని, ఆదివారాలు సెలవుల్లో మీ ఇంట్లో లేదా ప్రసూనాంటీ ఇంట్లో కలుసుకుందాం. వీలవుతుందా కనుక్కో ప్లీజ్’
‘ఎందుకంట. ఆ రోజు మీ అంకుల్ ఇంట్లోనే ఉంటారు’ అంది ప్రసూన. ‘మద్రాసు నుండి ప్రముఖ సినిమా యాక్టర్లు, మరి స్నేహితులు వస్తున్నారు. మన వాళ్లను కొంతమంది కలుస్తారంట’ ఆవలి వైపు నుండి ప్రసన్న సినీ యాక్టర్లనగానే ప్రసూన రెండవ కూతురు శిరీష ‘అమ్మా అందర్నీ రమ్మని చెప్పమ్మా ఎంచక్కా ఇంటి పట్టునే ఉండి సినిమా యాక్టర్లను చూడవచ్చు. ఇంకా మా స్నేహితులను తీసుకొస్తాను’ హుషారు నిండిన కంఠంతో శిరీష.
‘ఇంకా మన వూరి వారందర్నీ రమ్మనలేదు’ వెటకారంగా ప్రసూన.
‘సరే ప్రసన్నను రమ్మను’ అంది అయిష్టంగానే, ఆడపడుచు ఏమన్నా అనుకుంటుందేమో అన్న భయంతో ఒప్పుకోకపోతే అదొక తంటా.
‘హాయ్ ప్రసన్న ఆంటీ ఒప్పుకుంది. ఎంతమంది వస్తారో తెలిపితే కాఫీ, టీ, వగైరాలు నేను ఏర్పాటు చేయిస్తా’ పంకజం.
‘ఓకే ఐదారుగురుంటారు. లాప్‌టాప్ కూడా తీసుకొని వస్తున్నారు. డివిడి కెమెరాలు వగైరా.’
‘ఏంటీ ఏదైనా కమర్షియల్ విజిటా’ అంది పంకజం.
‘అంతా సర్‌ప్రైజ్. ఇక ఉంటాను బైబై’
‘ఏంటీ పంకజం! ప్రసన్న, నీవు కల్సి ఏదో గూడుపుఠాణి చేస్తున్నారా?’ అప్పుడే లోపలికి వస్తూ ప్రసూన పెద్దబ్బాయి సుధీర్ పంకజంతో.
‘వస్తాను ఆంటీ’ అంటూ పంకజం వెళ్లింది వౌనంగా.
‘అన్నయ్యా మన ఇంటికి ఈ శని ఆదివారాలు విఐపి గెస్ట్‌లొస్తారట. అందులో ప్రముఖ సినిమా వాళ్లు మద్రాసు నుండి హైదరాబాద్ నుండి కొందరు వస్తారని ప్రసన్న పంకజంతో ఫోన్‌లో చెబుతూంటే విన్నాను.’
‘ఎందుకో మరి. ఏదో పెద్ద విశేషమున్నట్టే. ఏదైనా కొత్త ప్రాజెక్టా?’
‘ఏమో మరి చూద్దాం’ అంది ప్రసూన నిర్లిప్తంగా. మొదటి నుండి తను మంచి గృహిణిగ, తల్లిగ, ఇల్లాలుగ ఉండి ఏ బాదరాబందీ లేక భేషజాలకు పోక ఉన్నదాంట్లోనే ఇల్లు దిద్దుకోవాలనే తత్వం గలది. అనుకోకుండా చంద్రశేఖర్‌గారు శని, ఆది, సోమవారాలు ఇన్‌స్పెక్షన్ డ్యూటీ పడి కరీంనగర్‌కు వెళ్లారు.
శుక్రవారం సాయంత్రం నుండే శిరీష హడావిడిగ తిరుగుతూనే రేపు ఏం డ్రెస్ వేసుకోవాలా, తనక్కూండా సినిమా ఛాన్స్ వస్తే బావుండు ఈ మధ్యే ‘పాడాలని ఉంది’ ప్రోగ్రాంలో పాల్గొంది. మళ్లీ ‘ఐడియా సరిగమప’లో అవకాశం కొరకు ప్రయత్నం చేస్తోంది. తన స్నేహితుల ప్రోత్సాహం కూడా. ‘నువ్వు శ్రీదేవిలాగ ఉంటావే, అచ్చం జానకిలా పాడుతావే’ అంటూ ఐస్‌క్రీంలు, టీ, టిఫిన్లు లాగిస్తుంటారు.
శనివారం పది గంటలకే చంద్రశేఖర్ గారింటి ముందు మూడు ఇన్నొవా కార్లు వచ్చి ఆగీ ఆగగానే పంకజం, వాళ్లమ్మ కామాక్షమ్మ బయటకొచ్చి ‘హాయ్ ప్రసన్నా’ అంటూ మాటలు కలుపుతూ ‘ప్రసన్న ఆంటీ గెస్ట్‌లొచ్చారు’ పెద్ద గొంతుకతో. శిరీష వెంటనే బయటకొచ్చి ‘వెల్‌కమ్ రండి! ప్రసన్నా బావున్నావా?’ ప్రశ్నలతో అతిథులను ఇంట్లోకి ఆహ్వానించింది. ముఖంలో ఆనందం తాండవిస్తుండగా.
ఇంట్లో భారీగా ఏర్పాట్లు చేసినట్టూంది. వచ్చిన అతిథులకు సకల మర్యాదలు చేసిన తరువాత ‘ఈవిడగారు ప్రముఖ సినీ డైరెక్టర్ రమేష్‌గారి సతీమణి -రమణి. వీరు ప్రఖ్యాత సినిమా నాయకుని కూతురు సువర్ణ. ఇక వీరున్నారా అందరికీ తెలిసిన నాట్యాచారిణి సువర్చల. నా పక్కన కూర్చున్నవారు అందరి నాల్కలో ప్రతిరోజూ మనం పాడుకునే నేపథ్య గాయకులైన సుబ్రహ్మణ్యంగారి పుత్రుడు సుమన్‌గారు. నువ్వు ఇటురా. ఇతను ఒకప్పుడు మామూలు ఆటో డ్రైవర్. ఇప్పుడు కోటీశ్వరుడై నాలుగు ఇన్నోవాలు స్వంతంగా కొని టాక్సీ నడిపిస్తున్నాడు. రథసారధి పార్థసారథి.’
ఇంకొకతను టిప్‌టాప్‌గా ఐదేళ్లకు ఐదు ఉంగరాలు.. జరీ పంచె కండువాతో గంభీరంగా కనిపిస్తున్నాడు. ‘వీరే చౌదరిగారు మా టీం లీడర్’ ఇంతలో క్లిక్‌మంటూ కెమెరాలు తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. ‘మరిచానే వీరు ప్రముఖ కెమెరామన్ యోగిగారు.’ అందరికీ పరిచయం చేశారు.
‘ఇక మొదలు పెడదామా’ అంది సువర్ణగారు.
‘అలాగే’ అంది ప్రసన్న.
ఎదురుగా కెమెరామన్ ఒకవైపు, మరొకవైపు డైలాగ్ చెప్పించే మరొకరు నిలుచున్నారు.
‘ఏంటీ ఇదేదో సినిమా షూటింగ్‌లా వుందే’ అంటూ లంబోదరం గారు వచ్చారు.
‘అరే బాబాయిగారూ! రండి రండి బావున్నారా?’ ప్రసన్న ప్రసన్న వదనంతో ఆహ్వానించింది. ఆయనొక బంగారు గని.
‘ఈ రోజు మన ప్రసూన ఆంటీ ఇంట్లో ‘సువర్ణ దాహం’ షూటింగ్ ఏర్పాటు చేశాం బాబాయిగారు. మీరు కూడా మెంబరే కదా’ అర్థవంతంగా అంది ప్రసన్న.
‘మరీ మంచిది ప్రసూన ఇంట్లో జరగటం. ఇక్కడి వారికి మన స్కీం గురించి, ఈ షూటింగ్ ద్వారా తెలియజేయడమే గాక వారిని కూడా మన మెంబర్లుగా చేర్చుకోవచ్చు’ లంబోదరంగారు కండువా సవరించుకుంటూ. ఇంతలో రమణి ‘యాక్షన్’ అనగానే ముందుకు వచ్చింది ప్రసన్న.
‘ఆగండి ఒక్క నిమిషం’ సువర్ణ అనడంతో అక్కడే ఆగిపోయింది ప్రసన్న.
‘మన సువర్ణ దాహం, ఇంతకు ముందు జరిగిన ఎపిసోడ్‌లను వీళ్లకు చూపిద్దాం’ అంటూ వీడియో ఆన్ చేసింది సువర్ణ. వీడియోలో బ్యాంకాక్, హాంకాంగ్, అమెరికా, యూరోప్, బెర్లిన్, జర్మనీ, జపాన్, బ్రెజిల్, ఏథెన్స్ ఇతర విదేశాల ఆఫీసులు, వ్యాపార స్థలాలు చూపించారు వీక్షకులకు. ముఖ్యంగా హాంకాంగ్ పట్టణం మళ్లీ చూపిస్తూ అక్కడ ఒక్క క్షణం బ్రేక్ ఇస్తూ రోజురోజుకు ప్రతిదానికి ధరలు పెరుగుతున్నాయి. ఒక్కరి సంపాదనతో ఇల్లు గడపటంలో ఇబ్బంది పడాల్సి వస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీకులు ఆర్థిక ఇబ్బందులకు గురి కావడం వల్ల కుటుంబంలో ఒత్తిళ్లు ఎక్కువై పోతున్నాయి. దీనికి తోడు కొంతమంది మహిళలు తమ భర్తలు ఆఫీసులకో మరే ఇతర వృత్తులకో హాజరవుతూంటారు. ఆ సమయంలో మహిళలు ఇరుగింటి పొరుగింటి ఆడవారితో కాలక్షేపం కోసం కబుర్లు చెప్పుకుంటూ తమ సమయం వృథా చేయడంవల్ల ఆర్థిక ఒత్తిళ్లు తగ్గిపోతాయనే భ్రమలో ఉంటారు. కానీ ఇలాంటి కబుర్ల వల్ల వచ్చే లాభమేముండదు. తమ భర్తకు చేదోడువాదోడుగా తమ ఖాళీ సమయంలో తమ వంతు తమ ఆర్థిక పరిస్థితి మెరుగు పరచుకోవడం కోసమే ఈనాడు మన ప్రసూన గారింట్లో సమావేశమయ్యాం’ అంది సువర్చలగారు గొంతు సవరించుకుంటూండగా,
‘మనం మహిళలం సమిష్టిగా మన కుటుంబాల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం కోసం హాంకాంగ్‌లో ‘గోల్డ్ క్వెస్ట్’ అంటే సువర్ణ దాహం స్కీం స్థాపించి అరవై ఆరు కంపెనీల ద్వారా విరామ సమయాలలో విదేశీయానం, టెలికాం, ఫైనాన్స్, జ్యువెలరీ, టీ మరియు ఇతర మాధ్యమాలలో పెట్టుబడులు పెట్టి తమ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే విధానాలలో ‘గోల్డ్‌క్వెస్ట్’ ఒకటి. ‘కాంతా కనకం’ అంటే ఇష్టముండని వారుంటారా? ‘మీ ఇల్లు బంగారంకాను’ అంటూ దీవిస్తారే అదే విధంగా ఈ గోల్డ్‌క్వెస్ట్ సంస్థలో సభ్యులుగా చేరి అంచెలంచెలుగా వారం రోజులలో రూ.5,75,000 సంపాదించే స్కీం తెలియజేసేందుకై మద్రాసు నుండి క్వెస్ట్ ఇండియా బృందం ఇక్కడికి రావటం జరిగింది’ అంటూ సుదీర్ఘంగా ఆకర్షణీయంగా శ్రోతలను ఆకట్టుకునే విధంగా తన అభినయంతో తన ప్రాజెక్ట్ వివరాలు తెలుపసాగింది.
‘ప్రసన్నా! మీకెన్ని గోల్డ్ కాయిన్స్ వచ్చాయి. ఇంతవరకు ఎన్ని వేల రూపాయల చెక్కులొచ్చాయి. మీకు వచ్చిన గోల్డ్ కాయిన్స్ ఇంకా సిల్వర్ కాయిన్స్ కూడా వచ్చి ఉండవచ్చు కదా. చెక్కులు వీళ్లందరికీ చూపించండి’
‘అబ్బా! శ్రీ గణేష్ ఎంత ముద్దుగా ఉన్నాడు. అరె! వెంకటేశ్వర స్వామి భలే బాగుందే. అబ్బో! అష్టలక్ష్మి ఎంతందంగా ఉందో, మా ఇష్టదైవం షిర్డీసాయిబాబా గోల్డ్ కాయిన్స్ పచ్చగా మిలమిల మెరిసిపోతున్నాయి. పూరీ జగన్నాథుడు బలభద్రుడు, మహాత్మాగాంధీ, ఆదిశంకరాచార్యులు సిల్వర్ కాయిన్లు ముచ్చట గొలుపుతున్నాయి. ఇంకా దాదాపు తన పెట్టుబడి ముప్పై రెండు వేలు పోగా ఏభై వేలు అదనంగా చెక్కులు వచ్చినట్లు జిరాక్స్ కాపీలు చూపించింది. ఇవన్నీ ఒక ఆరు నెలల్లో ఏభై వేల రూపాయలు ఆడుతూ పాడుతూ సంపాదించినై. దేవుడు మేలు చేస్తే ఇంకా రెండు నెలల్లో మరి ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయి’ ధీమాగా చెప్పింది ప్రసన్న అందరితో.
‘ఏమే ప్రసన్నా! నాతో ఒక్క మాటైనా చెప్పలేదే గోల్డ్‌క్వెస్ట్ గురించి’ నిష్ఠూరంగా అంది పంకజం.
‘నీకు ఈ స్కీం మీద ఇంటరెస్ట్ ఉందో లేదో అదీగాక నీవేమో ‘ఆంవే’ నైస్ ఇండియా ఆఫ్ కోర్స్ ఈ మధ్య జనాలకు కుచ్చుటోపీ పెట్టిపోయిందిలే. నీకు ఇంకా బిజీబిజీగా ఉండే బిజినెస్‌లు వున్నాయి కదా. అందులో మునిగి తేలుతున్నావని చెప్పలేదే ప్రసన్నా’ సారీ చెబుతూ ‘అంతేనా లేక ఎనీప్రాబ్లం. ప్రొఫెషనల్..’ అంటూ ఆగింది పంకజం.
‘అది నీ స్కిల్ మీద ఆధారపడి ఉంది నీ విజయం. ఇది నా ప్రతిభ మీద ఉన్నది. నీకుగానీ, మన వాళ్లెవరైనా ఈ గోల్డ్‌క్వెస్ట్‌లో చేరితే మన మేడం సువర్చల మరి పుష్పగారు వివరిస్తారు.’
‘ఓకే ఇక శ్రద్ధగా వినండి’ అంది పుష్ప. ‘మీరు చెప్పండి’ అంది సువర్చల మేడం వైపు చూస్తూ.
‘మనం గృహిణులం చదువుకున్న వాళ్లం. అవకాశాలను చక్కగా వినియోగించుకోవాలి. అనవసరంగా సమయం వృథా చేయకుండా సమర్థవంతంగా ఎదుటి వాళ్లను కన్విన్స్ చేయడమే దీని ముఖ్యోద్దేశం. ఇది వ్యాపారం కాదు. పాడైపోయే సరుకు కాదు. చట్టవిరుద్ధమైనది కూడా కాదు. దీనికి అంతర్జాతీయ మార్కెట్ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్‌కాం క్వెస్ట్ ఇండియా ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు.
ఇకపోతే మీరు చేయవలసినదంతా - మీకు నచ్చిన గోల్డ్‌కాయిన్ గానీ లేదా ఐదు సిల్వర్ కాయిన్స్, తొంభై తొమ్మిది ప్యూర్ గోల్డ్ లేదా ప్యూర్ వెండి కాయిన్స్ ఖరీదు చేసుకోవాలి. ముందుగా మీరు ముప్పది రెండు వేల రూపాయలు జమకడ్తే పది రోజుల తరువాత మీకు కొరియర్ ద్వారా మీరు కోరుకున్న బంగారుది ఒక కాయిన్, ఒక వెండి కాయిన్ లేదా ఐదు వెండి కాయిన్స్ దాదాపు పది వేలు విలువ చేసేవి వస్తవి. ఆ తరువాత మీరు ఒక యూనిట్ సభ్యులవుతారు. తదుపరి మీరు ఇద్దర్ని ఎన్నుకొని వారిని కూడా మన ప్రొడక్ట్స్ కొనుగోలుదార్లుగా ఈ విధంగా మీరు ఆరుగుర్ని కొనుగోలుదార్లుగా చేర్పిస్తే మీకు పదకొండు వేల రెండు వందలు. ఆ విధంగా వారు ఆరూ ఆరు ముప్పది ఆరు మందిని చేర్పిస్తే మీరు కట్టిన బంగారు వెండి మరియు చెక్కు రూపేణా ముడుతుంది. ఈ విధంగా గొలుసు ఒకరినొకరు లింక్ చేసుకుంటూ ఎంత త్వరలో

బంగారు గొలుసు (7వ పేజీ తరువాయ)
చేసుకుంటూ పోతూంటే కమీషన్ రూపేణా మీ కృషి ఫలితంగా చేరుతుంది.’
‘అప్పలస్వామి అప్పలస్వామి’ అని పిలిచింది సువర్చల.
‘ఎస్ మేడం!’ అంటూ వినయంగా వచ్చాడు.
‘నీ గురించి వీళ్లకు చెప్పు’
‘అమ్మగార్లూ నేనొక ఆటో డ్రైవర్ని. ఈ అమ్మగార్ని మైలాపూర్ నుండి అన్నాసలై మరో మేడం గారింటికి తీసుకుపోయిన ఆడ రెండు గంటలు ఉన్న వారు మాట్లాడుకున్నదాన్ని బట్టి నేను కూడా మీ స్కీంలో చేరుతా అమ్మగారన్నా. కొంచెం రిస్కుతో పని బాబూ, నీకు ఇష్టంగా ఉన్నా మీ వాళ్లు కూడా నీకు సహకారం చేస్తే మరి నీవు కూడా మెంబర్లను చేర్పిస్తే లాభసాటిగా ఉంటుంది. ఒకవేళ ఒకరిద్దరు అయిన మేము కూడా నీకు తోడుగా ఉండి ఒక యూనిట్‌గా అందరం కల్సి ఈ బిజినెస్ చేద్దాం. మరి నీకిష్టమైన దేవుడి పేరు చెప్పు. తిరుపతి వెంకన్నసామి. అయితే నీకు ముప్పైరెండు వేలు ముందుగా పెట్టుబడితో ఈ బంగారు గొలుసులో చేరాలి. అంతేగాదు లింకె తెగిపోకుండా గొలుసు ఎంత పెద్దగా అవుతుందో అంత లాభం ఉంటూంది. ఆలోచించు మీ వాళ్లతో తరువాత మళ్లీ మనం తాంబళం వెళ్లాలి వస్తారా. ఆ తరువాత జెమినీ సర్కిల్ వెళ్లాలి. సరే మేడం! ఆ విధంగా ఈ అమ్మగారితో వారం రోజులు ఆటోలో తిప్పుతూ ఈ స్కీం చేరిన ఆరు నెలలకే స్వంత బండి కొని ఈ అమ్మగారికి నడుపుతున్న. మరి ఈ మధ్యనే టాటా సుమో ఒకటి కొని మా అల్లుడికిచ్చిన. మరి నేనేమో ఇన్నొవా తీసుకొని మీ మేడమ్‌లకు నడిపిస్తున్న. చూశారా! స్వయంకృషితో మామూలు ఆటోడ్రైవర్ ఎంత ఎదిగిపోయాడో మీరే ఆలోచించండి.’
ఆవిడ మాటలకు శ్రోతలు కన్విన్స్ అయినట్టుగా మేడం మరి మేము ఎవరినీ చేర్పించకపోతే మాకు నష్టం కదా మా వాళ్లు ఊరుకుంటారు’ అంది పంకజం.
‘చూడమ్మా మీరు చేస్తున్న వ్యాపారంతో పెట్టుబడి పెట్టిన ఎన్ని నెలలకు సంవత్సరాలకు మీకు లాభం వస్తూంది. అది కూడా పోటీ ఈ మధ్య ప్రతి వృత్తిలో, వ్యాపారంలో పోటీ ఉంది. పోటీ లేకుంటే ముందంజ ఉండదు. మేము ఎవరు బిజినెస్ చేయడం లేదో వారిని మా యూనిట్‌లో తీసుకొని మేము కూడా మా ప్రయత్నం చేసి వారిని ముందుకు తీసుకువెళతాం’.
‘ఇంకా ఎవరికైనా సందేహాలున్నాయా?’ సువర్చల అడిగింది.
‘మా డబ్బులకు గ్యారంటీ ఏంటి మేడం! మా పెట్టుబడి మాకు తిరిగొస్తుందా? మీరు చేసే వ్యాపారం మాకు తెలుసు. ఇంకా షేర్ మార్కెట్ గురించి కూడా తెలుసు. ప్రతి దాంట్లో రిస్క్ ఉంటూనే ఉంటుంది. పడిపోతామని నడవకుండా ఉంటామా?’
అందరూ వౌనంగా ఉండిపోయారు.
ఆ రోజు ప్రోగ్రాం తిరిగి వీడియో అందరికీ చూపించారు. ‘ఈ ఎపిసోడ్ వేరే వారికి చూపిస్తాం. మీలో ఇంటరెస్ట్ ఉన్న వాళ్లు ప్రసన్న గారికి చెప్పండి. బలవంతం లేదు. రేపు మళ్లీ సుమలత గారింట్లో ప్రోగ్రామున్నది. అక్కడికి కూడా మీరు రావచ్చు. శ్రమ ఇచ్చినందుకు మన్నించండి’ అంటూ ప్రసూనగారి చేతులు పట్టుకుంటూ.
‘లాస్ట్ క్వశ్చన్ మేడం శిరీషా.. మీ గ్రూపులో చేరితే ఎకనామికల్ కాకుండా మరేమైనా లాభమున్నదా?’ అడిగింది.
‘ఓ అదా! సొసైటీలో స్టేటస్ సింబల్ పెరుగుతుంది. మంత్రిగారి భార్యలు, సినిమా యాక్టర్ల కుటుంబాలు, ఇంకా కంపెనీ డైరెక్టర్లు, డాక్టర్లు సమాజంలో హైక్లాస్ వారితో మూవ్ కావచ్చు.’
‘అయితే నేను మీ గ్రూప్‌లో చేరుతా. ఈ రోజే’ అంటూ ముప్పది రెండు వేల రెండొందల రూపాయల సువర్చల గారికి ఇవ్వగానే ఆమె రసీదు రాస్తూ ఒక వారం రోజులలో నీవు నాకు చెప్పిన దేవత గోల్డ్ కాయిన్ మరి సిల్వర్ కాయిన్ పంపిస్తాను. ఇంతకీ నీ ఇష్టదేవత ఎవరు?’
‘అష్టలక్ష్మి మేడం’ అంది.
‘అయితే మళ్లీ శుక్రవారం వరకు మీ ఇష్టదేవత మీ గృహలక్ష్మిగా చేరుతుంది. యూ ఆర్ వెరీ లక్కీ. ఒకటే ఈ కాయిన్ మిగిలింది. ఈ కాయిన్ అయిపోతే నెల రోజుల వరకు వేరే ప్రొడక్ట్ వస్తూంది’
‘అయితే ఇంకొక డౌట్ మేడం. ఇవి ప్యూర్ గోల్డ్ కదా?’
‘నో డౌట్.’
‘మరి మాకు అక్కర్లేనిది ఇంకేదైనా వస్తే...’
‘ఆన్‌లైన్‌లో మీరు చూసుకుంటూ మీ దగ్గర ఉన్న దానికి వాళ్లు డబుల్ లేదా త్రిబుల్ రేటు ఇచ్చి కొంటారు. ఈ మధ్యనే క్రాస్ ఉన్నది లక్ష రూపాయలకు మా కస్టమర్ దగ్గర నుండి వేరే వాళ్లు కొనేశారు’
‘్థంక్యూ వెరీమచ్. మీ అమూల్యమైన సమయం, అతిథి సత్కారంతోపాటు మీ కుటుంబంలో ఒకరు క్వెస్ట్ మెంబర్‌గా చేరినందుకు చాలాచాలా థాంక్స్’ అంది సువర్చల మేడంతో పాటు మిగతా వాళ్లు.
‘మీలాంటి పెద్దవాళ్లతో కలియడమే థ్రిల్. మా ఇంటికి మీలాంటి వారెందుకు వస్తారు?’ అంటూ సంతోషంగా శిరీష అందరి దగ్గర ఆటోగ్రాఫ్‌లు తీసుకుంది.
‘ఓకే థాంక్యూ వన్స్ ఎగెయిన్’ అంటూ ఆ ఇంటి నుండి బయటకొచ్చారు, వారితో ఇంటిల్లిపాది వారు సాగనంపేందుకు. అందరికి టాటా బైబై చెప్పారు.
వారం రోజులు గిర్రున తిరిగాయి. శుక్రవారం పూట అప్పుడే లక్ష్మీపూజ చేసుకొని ప్రసూన తులసి చెట్టుకు ప్రదక్షిణ చేస్తుండగా ‘కొరియర్’ అంటూ కేక వినబడటంతో-
‘శిరీషా ఎవరో వచ్చారమ్మా కాస్త చూడమ్మా’ కేకేసింది ప్రసూన.
‘అమ్మా నాకే కొరియర్’ అంటూ గబగబ సంతకం చేసి కవరు అందుకొని, చూడగానే అందమైన పసిడి రంగుతో మిలమిల మెరుస్తూ అష్టలక్ష్మి మరియు రజిత కాంతులతో విరాజిల్లుతున్న లక్ష్మీ కాయిన్స్ కవరు తెరవగానే బాక్స్‌లో నుండి దర్శనమిచ్చాయి.
‘అమ్మా అష్టలక్ష్మి మన ఇంటికి వచ్చిందే’ అంటూ సంతోషంతో పూజా మందిరం నుంచి వచ్చిన ప్రసూన ఆ గోల్డ్ మరియు సిల్వర్ కాయిన్స్‌కి హారతి కర్పూరం ఇచ్చి కళ్లకద్దుకుంది. ప్రసూన కూడా చేతులు జోడించుకుంది.
మూడు నెలలు ముచ్చటగ గడిచాయి. శిరీష ఎంత ప్రయత్నించినా మెంబర్లు కావడం లేదు. అబ్బో కరువు కాలంలో ముప్పైమూడు వేలు పెట్టి తులం బంగారం ఎవరు కొంటారు. అందులో నేను మరొక ఆరుగుర్ని చేర్పిస్తే గదా నా డబ్బులో సగమొస్తాయి అంటూ మొహం చాటేస్తున్నానరు. ఇక స్నేహితులు ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటున్నారు.
వారం రోజులు గడిచాయి.
మామూలుగానే ఉదయం టీవీ ఆన్ చేసి వార్తలు ఛానల్ చూస్తుండగానే గోల్డ్ క్వెస్ట్ గోల్‌మాల్.. గోల్డ్‌క్వెస్ వేసిన కుచ్చుటోపి, బాధితుల మొరతో పోలీసులు రంగప్రవేశం.. దోషుల కోసం అనే్వషణ.. అంటూ ఛానెల్స్ ఇదే చూపిస్తున్నాయి. ‘అరె రాండి.. ఇది విన్నారా మీ గోల్డ్‌క్వెస్ట్ బాగోతం’ అంటూ చంద్రశేఖర్ కుటుంబ సభ్యులందరినీ పిలిపిచి అన్నీ ఛానెల్స్ చూపించాడు.
శిరీష వెంటనే ప్రసన్నకు ఫోన్ చేస్తే సివ్చ్ ఆఫ్ అని వస్తూంది. పంకజం వాళ్ల ఇంటికి పరుగెత్తింది కంగారుగా. ‘పంకజం చూశావా? ఎంత మోసం జరిగిందో’ దాదాపు కన్నీళ్లు నిండిన కళ్లతో.
‘నాకు చెప్పకుండా ఈ బిజినెస్‌లో దిగితే అప్పుడే అనుకున్నా ఏదో గోల్‌మాల్ ఉంద’ని అక్కసుతో అంది.
‘ఇప్పుడేం చేద్దాం. మద్రాస్‌కు ఫోన్ చేద్దాం సువర్చలా.. ఇంకా సువర్ణలకు ఫోన్ చేద్దాం. పద మీ ఇంటికి’ అంటూ పంకజం కూడా ప్రసూన వాళ్లింటికి వచ్చి తనకు తెలిసిన వాళ్లందరికీ ఫోన్లు చేసినా ఫలితం శూన్యం. అంతా అయోమయంగా ఉంది. మరుసటి రోజు అన్ని పత్రికల్లో అన్ని ఛానల్స్‌లో గోల్డ్‌క్వెస్ట్ దోషుల అరెస్టు. బాధితులకు నష్టపరిహారం చెల్లించేటందుకు యత్నం.
‘ఏ వ్యాపారం మోసం చేయడం లేదూ. అన్నీ దగాచేసే బిజినెస్‌లే. మేం ఎవర్ని మోసం చేయలేదు. పర్‌ఫెక్ట్‌గా చట్టపరంగా ఉంది. ఏ ఫీల్డ్‌లో లేదు మోసం ఒక సినీ ప్రముఖుడు విరుచుకు పడి, మరుసటి రోజు కాళ్ల బేరానికి వచ్చి బేషరతుగా పత్రికాముఖంగా టీవీల ద్వారా వినయంగా చేతులు జోడిస్తూ క్షమాపణలు కోరుతూ మన్నించమని తమతలో ఒకరికి భావించమని మరీ మరీ తలవంచుకొని మరోసారి వేడుకున్నాడు.
ఈలోగా గోల్డ్‌క్వెస్ట్ వారు ‘బాధితులను అన్యాయం చేయం. మీకు మా స్కీం నచ్చకుంటే మీకు ఇచ్చిన గోల్డ్ మరియు వెండి కాయిన్స్ విలువ తీసి మిగతా డబ్బులు సెటిల్ చేస్తాం’ అతి వినయంతో తాటికాయలంత అక్షరాలతో ప్రతి పత్రికలలో ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు.
పోలీసు వారు అన్ని పట్టణాల గోల్డ్‌క్వెస్ట్ ఆఫీసులను సీజ్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది. గోల్డ్‌క్వెస్ట్ ప్రముఖులను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరచగా బెయిల్ నిరాకరించటంతో కటకటాల పాలై అంతా భ్రాంతియేనా అని కొందరు పాడుకుంటూంటే మన దేశంలో ఎన్ని స్కాములు, ఎన్ని స్కీములు రాలేదు. కొన్నాళ్లపాటు పత్రికల వారికి టీవీల వారికి మేత. ఆ తరువాత షరా మామూలే అని ధీమాగా గుట్టుచప్పుడు కాకుండా మరి కొందరు. ఇదండీ ‘లింక్ తెగిన బంగారు గొలుసు’ కథ. కంచికి చేరని ‘సువర్ణదాహం’ కథ.

==============================================================

కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-కొలనుపాక మురళీధరరావు.. 9247159203