కథా సాగరం

రెండు కప్పలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక కప్పల గుంపు చెట్ల గుండా ఎక్కడికో వెళుతోంది. దారిలో ఒక గుంత వుంటే రెండు కప్పలు దాంట్లో జారిపడిపోయాయి.
ఆ రెండు కప్పలూ ఆ గోతి నించి బయటపడడానికి ప్రయత్నించాయి. గట్టు గుండా పాకుతూ పైకి రావడానికి ప్రయత్నించాయి. ప్రతిసారీ జారి మళ్లీ నీళ్లలో పడిపోతున్నాయి.
ఇతర కప్పలు గోతిచుట్టూ చేరి పైకి రావడానికి శ్రమపడకండి, అలసిపోతారు. కష్టమవుతుంది. అక్కడే వుండిపొండి’ అని చెప్పాయి. కాని అవి వినలేదు.
ఒక కప్ప నీటినించి గట్టును పట్టుకుని పైకి పాకుతూ గట్టుకు రావడానికి ప్రయత్నిస్తూ ఎగరడానికి ప్రయత్నించి మళ్లీ నీళ్లలో ధబ్‌మని పడిపోతూ వచ్చింది.
కప్పలన్నీ వద్దు వద్దు అని వారించినా అవి వినలేదు.
చివరికి అట్లా శ్రమపడుకూనే అది చచ్చిపోయి నీళ్లలో తేలింది.
రెండో కప్పను అవి అట్లాగే వద్దు వద్దు అని వారించాయి. కానీ అది గట్టు మీదకు పాకుతూ నీళ్లలో పడుతూ చివరకు ఎట్లాగో గట్టుపైకి చేరుకుంది.
కప్పలన్నీ దాని చుట్టూ చేరి ‘మేము వద్దని వారిస్తూనే ఉన్నాం కదా! ఎందుకు వినలేదు. ఎందుకు శ్రమపడ్డావు’ అన్నాయి.
ఆ కప్ప ‘నాకు చెవుడు’ అంది. అది చివరి దాకా కప్పలన్నీ తనను ఉత్సాహపరుస్తూ ఎగరమని చెబుతున్నాయనుకుంది.
ప్రాణి జీవన్మరణాలు నాలుక మీద ఆధారపడి ఉన్నాయి. అది జీవితమో, మరణమో నాలుకని బట్టి ఉంటుంది. నిరుత్సాహపరిచే మాటల్ని ఆ కప్ప ప్రోత్సహించేవిగా తీసుకుంది.
మరణించిన కప్ప ఉత్సాహాన్ని నీరసపరిచే మాటలు నీరుగార్చాయి. చివరికి దాని మరణానికి కారణమయ్యాయి.
కష్ట సమయంలో ఓదార్పు మాటలు ఆశావహంగా వుండాలి.

- సౌభాగ్య 98481 57909