బాల భూమి

మెలకువ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేద రైతు రాఘవయ్యకు లేకలేక పుట్టాడు సోము. దాంతో గారాబంగా పెంచారేమో, సోముకి బద్దకం ఎక్కువై. ఏ పనీ చేసేవాడు కాదు. బడికి వెళ్లకపోవడంతో చదువు అబ్బలేదు.
రాఘవయ్యకి కొడుకు బెంగ ఎక్కువైంది. తానా పెద్దవాడై పోయాడు. సంపాదించిన ఆస్తులు లేవు. సోము ఎలా బ్రతుకుతాడోనని తనలో తనే మధనపడసాగాడు. ఆ బెంగతోనే మంచం పట్టి కొంతకాలానికి చనిపోయాడు. తండ్రి పోవటంతో తల్లిని పోషించే భారం సోము మీద పడింది. ఏ పని చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలీక తల్లి మీద విసుక్కునేవాడు. ఆ విసుగులోనే తండ్రి ఏమీ ఇవ్వకుండా చనిపోయాడని తిడుతూ ఉండేవాడు. తల్లి అలా అనకూడదని వారించేది. అయినా ఆ కోపంలో సోము తలకి ఎక్కేది కాదు. మరింతగా అరిచేవాడు.
కొడుకు ప్రవర్తనకి సోము తల్లి తనలో తనే కుమిలిపోయేది. కొంతకాలానికి ఆవిడ కూడా మంచం పట్టింది. సంపాదన లేక తల్లికి వైద్యం చేయించటానికి ఊరి వాళ్ల దగ్గర అప్పులు చెయ్యసాగాడు. తీసుకున్న అప్పు తీర్చటం లేదన్న నెపంతో అతనికి అప్పులివ్వటం మానేశారు ఊరి వాళ్లు.
దాంతో ఊరి వాళ్లని తిట్టుకుంటూ అప్పు కోసమని పొరుగూరు బయల్దేరాడు. అలా కొంత దూరం వెళ్లేసరికి సోముకి ఒక కాలు లేని కుంటివాడు అతి కష్టం మీద నడుస్తూ కనిపించాడు.
అతనితో మాటలు కలిపిన సోముకి అతను కూడా తమ ఊరి నుండే వస్తున్నాడని, నాలుగు రోజుల క్రితం బయలుదేరితే ఇప్పటికి ఇంత దూరం రాగలిగాడని అర్థమైంది. తన కాళ్ల వైపు చూసుకున్నాడు సోము.
అతనికి తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారు.
ఊర్లోకి వచ్చేసరికి ఊరి మొదట్లోనే బట్టలు కుడుతున్న దర్జీవాడు కనిపించాడు. అతనికి ఒక్క కనే్న ఉండటం గమనించాడు సోము. ఒక్క కంటితో అలా ఎలా కుట్టగలుగుతున్నాడో అని తన కన్నుల్లో ఒక్క కన్ను మూసేసి చుట్టూ చూశాడు. చాలా అయోమయంగా అనిపించి, ‘అమ్మో...’ అనుకున్నాడు మనసులో.
‘నీ కన్నుకి ఏమయ్యింది?’ అనడిగాడు సోము.
‘నేను పుట్టుగుడ్డిని’ అన్నాడు దర్జీ.
పుట్టినప్పట్నించీ ఒక కన్ను లేకపోయినా కష్టపడి దర్జీ పని నేర్చుకుని మరీ బట్టలు కుడుతున్న అతన్ని చూసి సోముకి జ్ఞానోదయం అయ్యింది.
ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా మంచి జన్మని ఇచ్చిన తల్లిదండ్రులు గుర్తొచ్చారు. దాంతో తానెంత తప్పుగా ప్రవర్తించాడో కూడా తెలిసి వచ్చింది సోముకి.
‘అజ్ఞానంతో, బద్దకంతో ఇప్పటికే తండ్రిని పోగొట్టుకున్నాను. తల్లినీ పోగొట్టుకోలేను’ అనుకుంటూ పశ్చాత్తాపంతో వెనక్కెళ్లి కష్టపడి సంపాదించి తల్లి ఆరోగ్యం బాగుచేయించటమే కాక కొంతకాలానికి పెళ్లి చేసుకుని భార్యా పిల్లలతో, తల్లితో కలిసి సుఖంగా జీవించసాగాడు.

-కనె్నగంటి అనసూయ