బాల భూమి
బిళ్లంగోడు లేక చిర్ర గోనె
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈ ఆటలు మగపిల్లలు ఎక్కువగా ఆడుతుంటారు. ఆడపిల్లలు ఈ ఆటను ఆడడానికి ఇష్టపడరు. ఆటలు ఎవరైనా ఆడుకోవచ్చు.కాని ఎవరికి అనుకూలమైన ఆటలను వాళ్లు తమ మనస్ఫూర్తిగా ఆడుతారు కదా. అందుకేనేమో ఈ ఆటను మగపిల్లలు ఆడడంలో ఆసక్తి చూపుతారు.
ఇందులో రెండు కర్రలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది చిన్న కర్రను బిళ్ల అని లేక చిర్ర అని అంటారు. పెద్దకర్రను కోడు అని గోనె అని అంటారు.
ముందుగా విశాలమైన స్థలంలోకి పిల్లలంతా వెళ్తారు. ఇదుంలో కూడా రెండు జట్లు ఉంటాయి. వీరు టాస్ వేసి ఎవరు ఆడాలో నిర్ణయించుకుంటారు. ఈ ఆట రెండురకాలుగా ఆడుతారు. రెండు ఆటల్లోను ముందుగా ఆట స్థలంలో చిన్న గోతిని తవ్వుతారు. దానిని బద్ధి అంటారు. ఈ బద్దిపైన అడ్డంగా చిన్న కర్రను అంటే చిర్ర నుపెడతారు. ఆడేవాళ్లు ముందుకు వచ్చి ఈ చిర్రను పెద్ద కర్రతో అంటే కోడు లేక గోనెను కొట్టాలి. అయితే ఈ చిర్రను గోతికి అడ్డంగా పెట్తారు కదా. దాని కింద నుంచి ముందు చిర్రను పైకి లేపి మరలా దాన్ని గాలిలోనుంచే గట్టిగా కొడతారు. దానితో అది విసురుగా వెళ్లి దూరంగా పడుతుంది. ఒకవేళ అట్లా గాలిలోకి కొట్టినపుడు అవతల జట్టు వాళ్లు పట్టుకొంటే వెంటనే ఆడేవారి ఆట కట్టు అవుతుంది.
అట్లా కాక పోతే ఆ చిర్రతో పాటు పరుగెత్తి చిర్ర పడిన చోటనుంచి వెనుకకు అంటే బద్ది వేసిన చోటుకు విసురుతారు. ఒకవేళ ఆ విసురుకు బద్దీలో చిర్ర పడిపోతే కూడా ఆడేవారి ఆట కట్టు అవుతుంది. అంతేకాదు ఈ చిర్రను తీసుకొని రావడానికి వెళ్లేవారు ‘గట్టి’అని అరుస్తూ ముందుకు వెళ్లాలి. అపుడు మాత్రమే చిర్రను కొట్టాలి కాని ‘గట్టి’ అని అరవకుండా వెళ్తే లెక్క చేయరు.
మరో ఆట పద్ధతి ప్రకారం చిర్రను కొట్టే ముందే ఇంత దూరంలో పడుతుంది అని కొట్టేవాళ్లు లెక్క చెబుతారు. వారు చెప్పిన దానికి సరిగా ఈ పెద్దకర్రను అంటే గోనెను కొలతబద్ధగా పట్టుకొని కొలుస్తారు. ముందుగా చెప్పిన వారి లెక్క సరిగా ఉంటే మళ్లీ ఆట ఆడే అవకాశం వారికి వస్తుంది. లేకపోతే ఆటకట్టు అవుతుంది.
ఇందులో కూడా కొంతమంది పిల్లలు తప్పు లెక్క చెప్పితే ఆటస్థలం చుట్టూ ఇన్ని సార్లు పరుగెత్తాలి అని ఒక నియమం పెట్టుకొంటారు. దాని ప్రకారం పరుగెత్తుతారు. ఇలా ఈ చిర్ర గోనె ఆటలో చిర్రను గాలిలోకి లేపి తరువాత కొట్టాలి. దీనికి మంచి నేర్పు ఉండాలి. ఒకవేళ ఎవరైనా అట్లా కొట్టలేకపోతే వారికి మూడు సార్లు అవకాశం ఇస్తారు. మూడు సార్లు వాళ్లు విఫలమైతే వారు ఆటలో నుంచి వెళ్లిపోవాలి. సాధారణంగా అందరూ పిల్లలూ కొట్టగలిగిన వాళ్లే ఉంటుంటారు. ఆటస్థలం చుట్టూ పరుగెత్తడంలో ఒకర్ని మించి ఒకరు రెండవ వాళ్లను పరుగెత్తించాలి అనుకొంటారు.
ఈ ఆట ఆడడానికి తగినంత స్థలం మాత్రం ఉండాలి. లేకపోతే ఆ చిర్ర ఎవరికైనా తగలవచ్చు. లేదంటే ఏ ఇంటి కిటికో ద్వారానికో తగిలితే వారు పోట్లాటలకు వస్తారు. కనుక మంచి విశాలమైన ప్రదేశంలోనే ఈ ఆటను పిల్లలను ఆడనివ్వాలి. దీనికి పెద్దలే జాగ్రత్తలు తీసుకోవాలి. చిర్రను కూడా రెండు ప్రక్కలా చివ్వి అంటే కొద్దిగా నునుపు చేసి ఉంటారు. ఇది పిల్లలే చేసుకొంటూ ఉంటారు. గోనెకు కూడా చివర కాస్త పదునుగా పెట్టుకొంటారు. అది చిర్రను కొట్టగానే దూరంగా వెళ్లడానికి అనువుగా చేసుకొంటారు. చిర్రను గోతి లోంచి పైకి లేపడానికి వీలుగా చిర్రను రెండు పక్కలా సన్నగా చివ్వి మధ్యలో లావుగా ఉండేట్లు చేస్తారు.