కథా సాగరం

హైదరాబాద్ జడ్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లో ఒక జడ్జి ఉండేవాడు. ఆయన ఎప్పుడూ న్యాయస్థానానికి అంటిపెట్టుకుని వుండేవాడు. ఒకసారి లంచ్ టైంలో వీధిలో ఒక కుర్రాడు పాట పాడటం వినిపించింది. ఆ కుర్రాడు అసభ్య పదజాలం నిండిన ఆ పాటను పాడుతున్నాడు.
జడ్జి మనిషిని పంపి ఆ కుర్రాణ్ణి పిలిపించి ఆ పాటను పాడమన్నాడు. మళ్లీ పాడమన్నాడు. ఇంకోసారి పాడమన్నాడు. నాలుగోసారి, ఐదోసారి అట్లా చాలాసార్లు పాడించుకుని విన్నాడు.
అది చాలా మామూలు పాట. జనాలు పాడుకునేది. అది కవి రాసిన పాట కాదు, పాటల్లోని మాటల్లో సంస్కారం లేదు. దానికి ఏ సంగీతకారుడూ స్వర రచన చేయలేదు.
ఆ పాట ప్రియురాలిని ఉద్దేశించి పాడే పాట.
‘నువ్వు నన్ను తినేసేటట్లు చూస్తావు’ అన్న మోటు భావం.
జడ్జి ఆ రోజంతా ఆలోచిస్తూ వున్నాడు. ప్రతి మనిషి ఇంకో మనిషిని ఎట్లా ‘తినడానికి’ చూస్తూ వుంటాడు అన్నదాన్ని గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఎక్కడో అతని మనసులోని సున్నిత కోణంలో అతను గాయపడ్డాడు. ఆ పాట అతనిపై ఎంత ప్రభావాన్ని చూపిందంటే ఆ రోజే ఆ జడ్జి తన పదవిని వదులుకున్నాడు. ప్రతిదీ అంటే తన ఆస్తిపాస్తుల్ని పేదలకు పంచి దర్వీష్‌గా మారిపోయాడు.

- సౌభాగ్య, 9848157909