ఈ వారం కథ

అవిటితనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటో తన గమ్యస్థానం చేరుకోగానే అందులోంచి దిగిన చలపతి డ్రైవర్‌కు మీటర్ డబ్బులు ఇవ్వబోయాడు. ఆని ఆ డ్రైవర్ ‘మాస్టారూ! మీరు నన్ను గుర్తు పట్టలేదా? నేను శేఖరిని. చిన్నప్పుడు మీ దగ్గర చదువుకున్నాను ఆరోజుల్లో మీరు డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి మా అందరికీ మీరు పదేపదే చెప్పేవారు’అన్నాడు
గుర్తు వచ్చినట్టు రానట్టుగా ఉంది చలపతికి. అందుకే సాలోచనగా చూస్తున్నాడు.
అంతలో ‘మాస్టారు నేను డిగ్రీ చదివినా నాకు ఉద్యోగం రానప్పుడు నాకు మీ మాటలే గుర్తొచ్చాయి. అందుకే ఇలా ఆటో డ్రైవర్‌గా మీ కళ్లముందు కనపడుతున్నానంటే అది మీ చలువే మాస్టారూ’’ మరి మీరు నాకు ఇప్పుడు డబ్బులు ఇస్తే నేను తీసుకోవడం బాగుంటుందా? అన్నట్టు డ్రైవర్ శేఖరు చిరునవ్వుతో చూస్తున్నాడు.
ఆ మాటలకు చలపతి చాలా ఆశ్చర్యపోయాడు. ‘‘అవునాబాబూ చాలా సంతోషం. కాని ఇప్పుడు నీవు డబ్బులు తీసుకోకపోవడం ఏంబావులేదు’అన్నాడు.
‘అదికాదు మాష్టారు ’ అని ఏదోచెప్పబోతుంటే తన ఇంట్లోకి ఆహ్వానించాడు మాస్టారు శేఖర్‌ని.
‘వద్దులెండి మాస్టారూ, మళ్లీ ఎప్పుడైనా వస్తాను’అన్నాడు శేఖర్
‘్ఫర్వాలేదు. రా.. నిన్ను చూస్తే మా ఆవిడ కూడా సంతోషిస్తుంది’అంటూ శేఖరు చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్లాడు చలపతి.
లోపలికి అడుగుపెట్టగానే ‘వచ్చారా నాన్న ’ అంటూ పలకరిస్తూ ఇతనెవరూ అన్నట్టు చూసింది ఓ అందంగా ఉన్నా కాలు సరిగా కట్టెలతో నడుస్తూ ముందుకు వచ్చిన ఆ అమ్మాయి.
‘అదేనమ్మా. నా దగ్గర చదువుకున్న మా స్టూడెంట్స్‌లో పాఠాలు గుర్తు పెట్టుకోవడమే కాక ఆ పాఠాలను ఆచరణలో పెట్టేవాళ్లల్లో మొట్టమొదటివాడు అని చెప్పవచ్చు’ అన్నాడు చలపతి.
ఎంతోఆశ్చర్యంగా, సంతోషంగా చూస్తూ నమస్కరించింది.
‘నమస్కారం’ అని అంటూ నే ఆ అమ్మాయిగురించి తెలుసుకోవాలని ఉన్నా చిరునవ్వుతో ఆగిపోయాడు శేఖర్.
ఇంతలో చలపతి భార్య విశాలాక్షి హాల్లోకి వచ్చి శేఖర్‌ను చూసి ‘ఎవరండీ ఈ అబ్బాయి’ అని అడిగింది కూతూహలంగా.
విషయం వివరించాడు చలపతి.
‘నీ దెంత మంచి మనసు అబ్బాయి.. మీ గురువుగారిని ఇంతలా గుర్తుపెట్టుకున్నావు. ఈ కాలంలో కూడా నీలాంటి వాళ్లున్నారంటే ఆశ్చర్యంగా ఉంది.’
‘దానిదేముంది అమ్మా జీవితంలో నిలదొక్కుకోవడానికి సార్ మాటలే నాకు వరాలయ్యాయి.అపుడు మీ దగ్గరకు నేను అప్పుడప్పుడు వచ్చే వాడ్ని. మీరు ఇప్పుడు నన్ను గుర్తుపట్టినట్టు లేరు.అపుడు ఈ అమ్మాయి..’
‘అవును శేఖరు.. నిజమే. నాకు గుర్తువస్తోంది. ఈ అమ్మాయి మా అమ్మాయినే. మాకు దేవుడు ఆర్థిక బాధలనేవీ ఇవ్వలేదు. కాని భగవంతుడు మా పై చిన్నచూపు చూశాడు. మాకు లేకలేక పుట్టిన ఈ అమ్మాయి పావని. కాని చిన్నప్పుడే పోలియో సోకింది.’అని కన్నీళ్లు పెట్టుకొంది చలపతి భార్య.
శేఖర్ ఏదో అనబోయేసరికి
‘దేవుణ్ణి అనడం ఎందుకు గాని అదంతా మన అశ్రద్ధే! అందుకు మేము కుమిలిపోనీ క్షణం లేదు. ఏదో మా చేతనయినంతలో దానికి చదువు చెప్పింది దాని కాళ్లమీద అది నలబడేట్టు చేయగలిగామే కానీ,.. ఆడపిల్లలను కన్న ప్రతి తల్లీదండ్రీ కోరుకున్నట్టు పెళ్లే ఇంకా చేయలేకపోతున్నాం. ’ అన్నాడు చలపతి.
‘అవును శేఖర్ బాబూ.. సంబంధాలు వస్తున్నాయి. కానీ వారంతా దీని ఉద్యోగమో . మా తర్వాత దీనికి వచ్చే ఆస్తినో చూస్తున్నారు కాని దీన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడడం లేదు. పావనినేమో మీకెందుకమ్మా కేవలం నా కాలుకి పోలియో కాని నా మనసుకు కాదు కదా. నా మనసును చూసి మెచ్చుకునేవాళ్లు వచ్చినపుడు పెళ్లి అవుతుంది లే అమ్మా’అని అంటుంది శేఖర్ అంది చలపతి భార్య.
శేఖర్ ఎంతో అభినందన పూర్వకంగా పావని వైపు దృష్టి సారించాడు.
అంతలో
‘మీ గురువుగారు ఈ దిగులుతోనే కృంగిపోతున్నారు. నువ్వైనా కాస్త ధైర్యం చెప్పు బాబూ! ఏదో పెద్దదాన్ని నిన్ను చూడగానే నీతో చెప్పుకోవాలన్పించి చెప్పాను. ఏమీ అనుకోకు’అంది చలపతి భార్య విశాలాక్షి.
‘అయ్యో ! ఎంతమాట అమ్మగారు. మీకంటె చిన్నవాణ్ణి మీరలా అనుకోకూడదు. మీ అమ్మాయి పెళ్లి గురించి అమ్మగా మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. మీ అమ్మాయికి పెళ్లి గడియ రాగానే మంచి వరుడు తప్పక దొరుకుతాడు. ’అని ఆ దంపతులకు ధైర్యం చెప్పాడు చలపతి.
అంతలో పావని తెచ్చిన కాఫీ తాగి వెళ్లొస్తాను అని అనుమతి తీసుకొంటున్న చలపతి తో ‘బాబూ అప్పుడప్పుడు వస్తూ ఉండు. ఇది మీ ఇల్లే అనుకోబాబూ’అంది విశాలాక్షి.
‘ఇదిగోండి నా నెంబరు. మీకు ఎప్పుడు నాతో అవసరం ఉన్నా మీరు ఏమీ మొహమాట పడకండి వెంటనే ఫోన్ చేయండి. రెక్కలు గట్టుకొని వాలుతాను. నేను అప్పుడప్పుడూ వస్తూనే ఉంటాను అమ్మా’ అని చెప్పి శేఖర్ వెళ్లిపోయాడు.
***
ఓ రోజు రాత్రి ఏడుగంటల సమయంలో ఓ స్కూల్ దగ్గర బస్‌స్టాప్‌లో చలపతి నిలబడి ఉండడం చూశాడు ఆ వైపునుంచి ఆటోనడుపుకుంటూ వెళ్తున్న శేఖర్.
వెంటనే చలపతి దగ్గర ఆటోను ఆపి ‘రండి మాస్టారూ ఆటో ఎక్కండి. మీరు ఎక్కడికి వెళ్లాల్లో చెప్పండి నేను దింపేస్తాను’అన్నాడు శేఖర్.
‘అబ్బే వద్దుశేఖర్. ఇప్పుడు బస్సు ఉందిలే. నేను ఇంటికే వెళ్తున్నాను. బస్‌లో వెళ్లిపోతాను’ అంటూ మొహమాటపడ్డాడు చలపతి.
‘అట్లాకాదు ముందు మీరు ఎక్కండి దారిలో మాట్లాడుకుందాం’అంటూ బలవంతంగా చలపతిని ఆటోలో కూర్చోబెట్టాడు శేఖర్.
మాటల మధ్యలో రిటైర్ అయిన తర్వాత ఈ స్కూల్‌లో చేరి చలపతి పని చేస్తున్నట్టు శేఖర్ తెలుసుకొన్నాడు. దానితో శేఖరే ప్రతిరోజు వారింట్లో చలపతిని దిగబెట్టే పూచీ తీసుకొన్నాడు.
దానితో చలపతి వారింట్లో శేఖర్ రాకపోకలు ప్రారంభమైనాయి. చలపతి భార్య విశాలాక్షికి శేఖర్ వినయం , నమ్రత, కలుపుగోలు తనం నచ్చాయి. గొప్పలకు పోనీ శేఖర్ తో పావని కూడా మాటలు కలిపిందీ మధ్య.
ఓరోజు విశాలాక్షి‘శేఖర్ ఎప్పుడూ నీవు ఒక్కడివే వస్తావు. ఈసారి వచ్చేటపుడు మీ ఆవిడను, పిల్లలు తీసుకొనిరా.. నీకు ఎంతమంది పిల్లలు ’అని అడిగింది.
అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడిన శేఖర్ మొహం ఒక్కసారి మబ్బులు పట్టిన ఆకాశంలాగా నల్లగా మాడింది.
అయ్యోనేనేమన్నా కాని మాట మాట్లాడానా బాబూ అని బాధతో అడిగింది విశాలాక్షి.
‘అదేం కాదు అమ్మా. మా తల్లి దండ్రులకు నేను ఒక్కణ్ణే సంతానం. ఆమధ్య రోడ్ యాక్సిడెంట్‌లో అనుకోకుండా ఇద్దరూ చనిపోయారు. అప్పటి నుంచి నేను ఒంటరి వాడినైపోయాను.’ అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు శేఖర్
‘అయ్యో ఎంత ఘోరం జరిగింది. మరి ఇప్పుడు మీ బంధువుల దగ్గర ఉంటున్నావా’అని అడిగింది విశాలాక్షి.
‘లేదమ్మా. అప్పటికి డిగ్రీ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్‌రాసి ఉన్నాను. అవి వచ్చాక నేను పాస్ అయ్యానని తెలుసుకొని మా బంధువులంతా ఏదో ఒక ఉద్యోగం చేరి సంపాదన మొదలుపెడితే బాగుంటుంది అని సలహా ఇచ్చేసి అంతా వెళ్లిపోయారు. మళ్లీ ఎవరూ మా ఇంటివైపు తిరిగి కూడా చూడలేదు. అందుకే కేవలం డిగ్రీ చదివిన నాకు ఉద్యోగం రాలేదు. అపుడు మాస్టారు మాటలు గుర్తువచ్చి నేనీ ఆటో నడపడానికి నిర్ణయం తీసుకొన్నాను.’అని చెప్పాడు.
‘మనమంతా విధిచేతిలో కీలుబొమ్మలం. మేమే నీ తల్లిదండ్రులనుకోనాయనా! దిగులు పడకు.’అంది విశాలాక్షి
కాసేపు ఆమాట ఈమాట తర్వాత శేఖర్ వెళ్లిపోయాడు.
***
ఓరోజు శేఖర్ స్వీట్ ప్యాకెట్ తోచలపతి ఇంటికి వచ్చాడు. కాని చలపతి విశాలాక్షి లేరని పావని చెప్పగానే నిరుత్సాహం వచ్చింది శేఖరికి.
‘అరే ఏమిటి ఇంత నిరుత్సాహం. ఏదైనా ప్రత్యేకమైన రోజునా ఇది’అడిగింది పావని.
‘అవునండీ ఈరోజునా పుట్టినరోజు. ఈమధ్య నేను పుట్టినరోజులు జరుపుకోవడం లేదు.కానీ, మీ కుటుంబం దొరికాక నాలో బతుకుపై ఆశ కలిగింది. అందుకే ఈ స్వీట్ తెచ్చాను’అన్నాడు శేఖర్.
‘అయితే ఇంకే కూర్చోండి. ఇపుడే మా అమ్మనాన్న వచ్చేస్తారు. నా పెళ్లి సంబంధం చూసే మధ్యవర్తి రమ్మంటేవెళ్లారు. వద్దన్నా వాళ్లు వినరు. నాకు పెళ్లే వద్దు అంటున్నా వీళ్లు పట్టించుకోవడం లేదు. అదంతాసరే. మీ పుట్టిన రోజుకదా. నేను మంచి వంట చేస్తాను. కూర్చోండి అందరం కలసి భోంచేద్దాం’ అని శేఖర్ జవాబు వినకుండా గబగబా వంటింట్లోకి వెళ్లిపోయింది పావని.
అంతలో ఎంతో దిగులుతో చలపతి దంపతులు వచ్చారు. శేఖర్‌ను చూసి దిగులు మరిచి మాట్లాడుతూ పావని చెప్పినదాన్ని విని మంచిపని చేస్తోంది. కూర్చోబాబు అంటూ విశాలాక్షి కూడా వంటింట్లోకి వెళ్లింది.
అందరూ భోజనాలకు కూర్చోన్నారు. విశాలాక్షి అందరికీ వడ్డించింది. మధ్యలో ‘ఏమిటో బాబూ ఈ పిల్లకు పెళ్లి చేయగలమా ’అనే దిగులు రోజురోజుకు ఎక్కువవౌతోంది ’అంది విశాలాక్షి.
‘ఊరుకో విశాలాక్షి. అబ్బాయి సంతోషంగా ఉంటే నీవెప్పుడు ఏదో ఒకటి చెప్తావు’అన్నాడు చలపతి.
‘అవును మాష్టారు. మీరు అంతా వెతుకుతున్నారుకాని, ఎదురుగా ఉన్నవాళ్లని పట్టించుకోవడంలేదు’అని నాల్కుకరుచుకున్నాడు.
పావని కళ్లెత్తి శేఖర్ వంక చూసింది.
‘ఏమిటి బాబూ ’అంది విశాలాక్షి.
‘నాయనా చలపతి ఎదురుగానా’ అనిఅడిగాడు తను అనుకొంటున్నది నిజమా కాదా’అని చలపతి.
పావని ఆశ్చర్యంగా ఆనందంగానూ శేఖర్ ను చూసి లోపలికి ఏదో పని ఉన్నట్టు వెళ్లింది.
‘అవును మాష్టారు. మీరు ఏమీ అనుకోకపోతే నాకు మీ అమ్మాయిని ఇవ్వచ్చుకదా. నేను మీ ఇద్దరినీ కన్నతల్లిదండ్రుల్లా చూసుకొంటాను కదా. నాపై మీకు నమ్మకం లేదా.. మీరు ఆటో తోలుతున్నాను అని అనుకోకపోతే’అన్నాడు చలపతి.
‘మేము వింటున్నది నిజమా ’అంది విశాలాక్షి ఆదుర్దాగా.
‘శేఖర్ నిజం చెప్పు. నీవు పావనిని ఇష్టపడుతున్నావా లేకు నేను కష్టపడుతున్నానని ఈ నిర్ణయం తీసుకొన్నావా’ సీరియస్‌గా అడిగాడు చలపతి.
‘అదేమీ కాదు మాస్టరూ. పావని నాకు మొదట్నుంచే నచ్చింది. ఆమె మృదుస్వభావం, ఆమె వ్యక్తిత్వం, సంస్కారం అన్నీ నాకు నచ్చాయి. కాని నేను ముందుకొస్తే మీరు ఏమనుకొంటారో అని ఆగాను’
‘ఈరోజు ఎలాగైనా మీకు చెప్పేద్దామనుకొని వచ్చాను. కానీ మీరు లేరు.. ’అంటూ నసుగుతున్న శేఖర్ ను చూసి
‘సరే. ఇది పెళ్లి వ్యవహారం కనుక నువ్వు మాకెంత ఇష్టమున్నా. మా అమ్మాయి అభిప్రాయానికే మేము విలువ నిస్తాము. మీరిద్దరి అభిప్రాయాలు ఒక్కటే అయితే మాకు అభ్యంతరం లేదు’అన్నాడు చలపతి.
‘సరేనండీ మీరు పావనిని అడిగి తర్వాత నాకు చెప్పండి. ఏమీ చెప్పినాకూడా నేను మాత్రం మీ ఇంటికే ఇలానే వస్తుంటాను. నేను మీ శిష్యుణ్ణే. కనుక ఏది చెప్పడానికి మొహమాట పడద్దుఅని చెప్పండి ’అని
‘రేపు మీరు రెడీ గా ఉండండి. మీ స్కూల్ దగ్గర నేను దింపడానికి వచ్చేస్తాను మాస్టారు’అంటున్న శేఖరుని అప్యాయంగా దగ్గర తీసుకొని భుజం తట్టారు చలపతి.
విశాలాక్షి కనులు తుడుచుకుంటూ ‘వెళ్లిరా బాబూ’అంది విశాలాక్షి.
శేఖర్ వెళ్లిన చప్పుడు విని పావని ముందుకొచ్చింది.
‘అమ్మా పావని. శేఖర్‌ని పెళ్లి చేసుకోవడం నీకు సమ్మతమేనా’అనిఅన్నాడు మృదువుగా చలపతి.
‘నాన్న ఇప్పటి వరకు మనకు తారసపడిన వాళ్లకన్నా శేఖర్ నే ఎంతో మేలు అనిపిస్తోంది నాకు. మీరేమన్నా ఆస్తిపాస్తుల గురించి అనుకొంటే నేను ఉద్యోగం చేస్తున్నా కదా నాన్న. ఏం కష్టం ఉండదు. నాకు శేఖర్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే’అంది పావని.
‘అమ్మా నీ లాంటి కూతుర్ను కన్నందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది. ఇక మీరిద్దరి పెళ్లి చేసి మేము ఆనందంగా ఉంటాం’అన్నాడు చలపతి.
విశాలాక్షి కూడా ‘మన అమ్మాయి మనసెరిగిన అల్లుడు మనకు వచ్చాడండీ అంతా దేవునిలీల’అంది విశాలాక్షి.
తల్లిదండ్రులిద్దరూ పావని తల ప్రేమగా నెమిరారు.

- మాధవ పెద్ది ఉష