18న కథకళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాల్ కథానాయకుడిగా పాండ్యరాజ్ దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందించిన చిత్రం కథకళి. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 18న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్న శ్రీకృష్ణా క్రియేషన్స్ అధినేత గౌరికృష్ణ మాట్లాడుతూ, తెలుగులో మాస్ హీరోగా ఫాలోయింగ్ వున్న విశాల్ చేసిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందిందని, తమిళంలో విడుదలై సెనే్సషనల్ హిట్ సాధించిందని తెలిపారు. మంచి కథ, కథనాలతో ప్రేక్షకులను థ్రిల్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్‌తో లావిష్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగులో కూడా విజయవంతం అవుతుందన్న నమ్మకం వుందని ఆయన అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఈనెల 18న థియేటర్లలో విడుదల చేస్తున్నామని ఆయన అన్నారు. మంచి కథ, సస్పెన్స్ థ్రిల్ చేసే ఫైట్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందని, ఇప్పటివరకూ తాను నటించిన చిత్రాలన్నీ డిఫరెంట్ జోనర్‌లో నిర్మించామని, ఈ సినిమా కూడా అదే స్థాయిలో మర్డర్ మిస్టరీ నేపథ్యంలో జరుగుతుందని తెలిపారు. తెలుగు నేటివిటీకి తగిన విధంగా వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే హైలెట్ అని ఆయన అన్నారు. ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ కథను తయారుచేసుకున్నామని, అనుకోని పరిస్థితులలో జరిగిన ఓ హత్య నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని, ఊహించని సంఘటనలతో పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా వుంటుందని దర్శకుడు పాండ్యరాజ్ తెలిపారు. కేథరిన్ ట్రెస్సా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో నాజర్, కరుణాస్, శత్రు, సూరి, శ్రీజిత్ రవి, పవన్, మైన్‌గోపి, మధుసూదన్‌రావు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి కెమెరా:బాలసుబ్రమణ్యం, సంగీతం:హిప్ హాప్ తమిళ, ఎడిటింగ్:ప్రదీప్ ఇ.రాఘవ్, మాటలు:శశాంక్ వెనె్నలకంటి, నిర్మాత:విశాల్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:పాండ్యరాజ్. (చిత్రం) కేథరిన్ ట్రెస్సా