మెయిన్ ఫీచర్

సంప్రదాయ పద్ధతులతో శోభాయమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కట్టు’ అంటే- స్ర్తి, పురుషుల వస్తధ్రారణ.
‘బొట్టు’ అంటే- ఆడ,మగ నుదుట పెట్టుకొనే కుంకుమ లేక తిలకం.
‘జుట్టు’ అంటే స్ర్తి,పురుషులు తమ శిరోజాలను అందంగా దువ్వుకుని ముడి వేసుకోవడం.
... ఈ మూడింటి విషయంలో వివిధ ప్రాంతాల ప్రజలు వివిధ రీతులను అనుసరిస్తూ ఉండటం వల్ల విభిన్న ఆచారాలు, సంప్రదాయాలు అమలులోకి వచ్చాయి. ఎవరి ఆచారాలు, సంస్కారాలు ఎంత గొప్పవో తెలిపేవి కట్టు, బొట్టు, జుట్టే అని మన పెద్దలు చెబుతూ ఉండడాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.
నైసర్గిక, వాతావరణ పరిస్థితులు ఆయా ప్రాంతాల ప్రజల వస్తధ్రారణను ప్రభావితం చేయడం సహజ పరిణామం. కానీ, పాశ్చాత్య సంస్కృతి ప్రపంచం అంతటా వేగంగా వ్యాపించడం వల్ల వస్తధ్రారణలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఆఫ్రికా దేశాలలో ఎవరి వస్తధ్రారణ విధానం వారికి ఉంది. రంగురంగుల దుస్తులు ధరించేవారున్నారు. తెల్లటి దుస్తులు ధరించేవారు ఉన్నారు. ‘దేశీయ వస్తధ్రారణ విధానాన్ని విడనాడరాదు’ అనే పట్టుదల కొంతమంది ఆఫ్రికా నాయకులలో బలంగా ఉంది. అంతర్జాతీయ వేదికలపై వారు తమ దేశ దుస్తులు వేసుకొని పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి వివిధ దేశాల వారితో విభిన్న వేషధారణలకు నిలయంగా కనిపిస్తుంటుంది. అరబ్బులకు ఒక ప్రత్యేక వస్తధ్రారణ విధానం ఉంది. కొద్దిమందిని మినహాయిస్తే ఇప్పటికీ అరబ్బులు వారి ప్రాచీన వస్తధ్రారణనే, సంప్రదాయ విధానానే్న అనుసరిస్తున్నారని చెప్పవచ్చు.
ప్రాక్ దేశాలలోనూ ఎవరి వస్తధ్రారణ పద్ధతులు వారికి ఉన్నాయి,. చైనా,జపాన్‌లతోపాటు బర్మా వరకూ ఒకే పద్ధతిలో వస్తధ్రారణ కనిపిస్తుంది. పాశ్చాత్య దేశాలలో చాలామంది నాయకులకు ఫుల్ సూట్ అలవాటు. సోవియట్ నియంత స్టాలిన్ కంఠం దగ్గరదాకా గుండీలు పెట్టుకొని ‘టై’ అవసరం లేని కోటు వేసుకొనేవాడు.
ఇక, నొసట బొట్టుపెట్టుకొనడం విలక్షణమైన భారతీయ సంప్రదాయం. బొట్టుకు తిలకం, పుండ్రం అనే పేర్లుకూడా ఉన్నాయి.
‘కస్తూరీ తిలకం లలాట ఫలకే..’ అంటూ శ్రీకృష్ణుణ్ణి ఘనంగా వర్ణించారు. భారతీయ మహిళలు పేరంటాలలో పాడుకొనే అనేక పాటలలో-
‘తిలకము దిద్దరే కలికి శ్రీరుక్మిణికి
మొలక నవ్వుల చెలి మోమున కస్తూరి’ అనేది కూడా ఒకటి. మన దేశంలో దేవతా విగ్రహాలకు రకరకాల తిలక ధారణ కనిపిస్తుంది. తమ తమ ఆరాధ్య దైవాన్ని బట్టి ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైతాలవారు వేర్వేరు రీతులలో బొట్టుపెట్టుకుంటారు. సాధారణంగా స్ర్తిలు పెట్టుకొనే బొట్టు వేరు, పురుషులు పెట్టుకొనే బొట్టు వేరు. కొందరు పురుషులు నిలువు బొట్టు పెట్టుకుంటారు. అలా నిలువు బొట్టు పెట్టుకొనే స్ర్తిలు అరుదు. భర్తను కోల్పోయిన స్ర్తిలు ఒకప్పుడు బొట్టుపెట్టుకొనేవారు కాదు. కానీ, ఇపుడు ఆ పద్ధతికి స్వస్తి పలికారు. కాలగమనంలో వచ్చిన మార్పు ఇది.
పచ్చకర్పూరం, కస్తూరి, సుద్ద (నాము) విభూతి (్భస్మం), గంధం మొదలైన ద్రవ్యాలు ఎక్కువగా దేవాలయాలలో విగ్రహాలంకరణకు వాడుతున్నారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఊర్థ్వపుండ్ర ధారణ చేసేటప్పుడు అంతర్ ద్వారం తలుపులు మూసి వేస్తారు. జియ్యంగార్లు, వైష్ణవ ఆచార్య స్వాములు అంతర్ ద్వారం ముందు పంక్తులు తీరి పద్మాసనంలో కూర్చుని దివ్య ప్రబంధ పఠనం చేస్తుండగా ఊర్థ్వపుండ్రధారణ పూర్తి అవుతుంది.
మానవ సంస్కారాల్లో మూడవ ముఖ్యాంశం- తలపై జుట్టు లేక కేశ సంపద. స్ర్తికైనా, పురుషుడికైనా నిజమైన అందాన్ని ఇచ్చేది జుట్టే.
శిరోజాలు రావడం, పెరగడం విషయంలో స్ర్తిలకూ, పురుషులకూ మధ్య చాలా ముఖ్యమైన తేడా ఉంది. పురుషుని శరీరం కఠినమైనదిగాను, స్ర్తి శరీరం మృదువైనదిగాను రూపొందడమేగాక పురుషులలాగా స్ర్తిలకు పెదిమలపైనా, చెంపలపైనా, గడ్డంపైనా జుట్టు మొలవకుండా ఉండడంవల్లనే స్ర్తిల ముఖాలు మృదువుగా ఉండి అందంగా ఉంటాయి. పురుషులకు ఛాతీపైన, నాభి దగ్గర, చేతులపైన, కాళ్ళపైన నల్లగా, దట్టమైన రోమాలు మొలిచి, మగవాడిలోని బలానికి నిదర్శనంగా ఉన్నా కొంత వికృతంగా ఉంటాయి. స్ర్తిలకు ఇలా చేతులమీదా, కాళ్ళమీదా- ఏదో కొద్దిమంది మగాళ్ళలాగా ఉండే ఆడవాళ్లకు తప్ప రోమాలు మొలవవు. అందువల్ల శారీరక సౌందర్యానికి స్ర్తి నిలువెత్తు నిదర్శనంగా ఉంటూ, ఆమెపై పురుషుల్లో ఆరాధనా భావం కలుగుతుంది. ఎలాంటి లింగ భేదం లేకుండా స్ర్తి, పురుషుల్లో శిరోజాలు పెరుగుతుంటాయి. శిరోజాలను అలాగే వదిలేయకుండా నూనె రాసి, పొందికగా దువ్వుకుని, జడగా అల్లుకుని మహిళలు కొత్త శోభను సంతరించుకుంటారు. జడ వేసుకోకపోయినా, శిరోజాలను చుట్టగా చుట్టి తల వెనుక వైపున ఉంచుకోవడం జరుగుతుంది. శిరోజాలు ఒత్తుగా ఉంటే వాటిని ఎలా ఉంచుకున్నా స్ర్తి అందంగానే కనిపిస్తుంది. స్ర్తిలు ఇంటి పట్టున ఉండేవారు అయితే పొడుగు జడగాని, ముడిగాని వేసుకుని సౌకర్యవంతంగా ఉందని భావిస్తారు. బయట తిరగాల్సిన ఉద్యోగినులు, విద్యార్థినులు అయితే తలపైన అంత పొడుగు జుట్టును ఉంచుకుంటే నానా అవస్థలూ పడక తప్పదు. అందువల్ల పురుషుల మాదిరి అప్పుడప్పుడు శిరోజాలను కత్తిరించుకోవడం తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. వివిధ రకాల హెయిర్ స్టయిల్స్ మహిళలకు సౌకర్యవంతంగా ఉండడమే కాదు, వారి అందాలను మరింతగా ద్విగుణీకృతం చేస్తాయి. స్ర్తిలు పొడవాటి జడను కొనసాగించాలా? బాబ్డ్ హెయిర్‌కు మారిపోవచ్చునా? అంటే- అది వారి అవసరాలు, జీవన విధానంపై ఆధారపడి ఉంటుంది.
కాలంతో పాటు సమాజంలోనూ అనూహ్యమైన మార్పులు వచ్చిన దృష్ట్యా పూర్వపు విధంగా కట్టు, బొట్టు, జుట్టులో కూడా మార్పులు రాక తప్పలేదు. ప్రాచీన భారతీయ దృక్పథంలో స్ర్తిలు ఇంటిపట్టున ఉంటూ గృహసీమను ఏలితే, పురుషులు బయటి వ్యవహారాలు చూసుకుంటూ సంపాదన బాధ్యతలను మోసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అన్ని రంగాల్లోనూ తాము పురుషులకు ఏ మాత్రం తీసిపోమని మగువలు నిరూపిస్తున్నారు. ఆధునిక కాలంలో అవసరమైన మార్పులను మనం స్వాగతిస్తూనే, ప్రపంచం యావత్తూ ఉత్తమంగా భావించిన మన సంప్రదాయాలను సాధ్యమైనంతగా అనుసరిస్తూ ఉండడమే శుభదాయకం.

-సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి