రంగారెడ్డి

రాష్ట్ర ఆవిర్భావంలో కవితది కీలకపాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మార్చి 13: తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను జాగృతం చేయడానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎనలేని కృషి చేస్తున్నారని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. ఆదివారం ఎంపీ కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ నివాసంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కవిత కీలకమైన పాత్ర వహించిందని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం తరఫున పార్లమెంట్‌లో పోరాడుతూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రానికి తీసుకువస్తున్న ఘనత ఆమెకు దక్కుతుందన్నారు. కెసిఆర్ కుటుంబంలో పుట్టిన కవిత ప్రజల సేవకు అంకితమవుతుందన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతున్న ఘనత కేసీఆర్ కుటుంబానికే దక్కిందని కొనియాడారు. ప్రజలకు నీడనిచ్చే ఎల్లవేళలా కాపాడే పార్టీలో తాను చేరినందుకు గర్వంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని, రాబోయే రోజుల్లో టీ ఆర్ ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సరికొండ వెంకటేష్, మొహినుద్దీన్ చందా, రఘుగౌడ్, యాదయ్య, ఏర్వ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మైలార్‌దేవ్‌పల్లిలో ..
కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడకలు జరుపుకున్నారు. ఆదివారం మైలార్‌దేవ్‌పల్లి ప్రజాభవన్‌లో మహిళలతో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మహిళలను ఉద్దేశించి కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భవించిన పిదపే మహిళలకు పెద్దపీట వేసిందన్నారు. మహిళా సంఘాలను ప్రోత్సహించి ఆర్థిక పురోగాభివృద్ధి చెందడానికి కేసీఆర్ కుటుంబానికే దక్కిందన్నారు. మహిళలకు ఎళ్లవేళలా ఎంపీ కవిత అండదండలు అందిస్తూ వారికి చేదోడువాదోడుగా నిలుస్తున్నారని కొనియాడారు.
అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మహిళా కార్యదర్శి డి.శకుంతల, టి.సుధాకర్‌రెడ్డి, జే.శేఖర్, సీతారాం మహిపాల్, చెన్‌రెడ్డి బుచ్చిరెడ్డి, టి.రఘుముదిరాజ్, టి.చిన్న, శరణమ్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.