రాష్ట్రీయం

పురపాలక చట్టం బిల్లును ప్రవేశపెట్టిన కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు అసెంబ్లీలో పురపాలక చట్టం బిల్లును ప్రవేశపెట్టారు. ఈ రోజు సాయంత్రం వరకు సవరణలు స్వీకరిస్తారు. శుక్రవారంనాడు బిల్లుపై చర్చ జరుగుతుంది. బోధనాసుపత్రులలో వైద్యుల పదవీకాల పెంపుపై కూడా సభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపాలిటీల సంఖ్యను 142కు పెంచామని, ఐదు వేల పరిపాలన విభాగాలు ఏర్పాటు చేయడమేగాక సాహసోపేతమైన అనేక నిర్ణయాలు తీసుకున్నామని సీఎం అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు.మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రూ. 2 వేల 74 కోట్లు ఇస్తాం అని సీఎం కేసీఆర్ తెలిపారు.