తెలంగాణ

ప్లాస్టిక్ ఉత్పత్తి, అమ్మకాలపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో ప్లాస్టిక్ ఉత్పత్తి, అమ్మకాలపై నిషేధం విధించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఆయన ఈరోజు ప్రగతి భవన్‌లో పల్లె ప్రగతిపై 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై సమీక్ష జరిపారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన అందరిలోనూ కలిగిందని అన్నారు. గ్రామాల అభివృద్ధికి ఇకపై ప్రతి నెల 339 కోట్లు విడుదల చేస్తామని, ఇవి పంచాయతీ నిధులకు అదనం అని అన్నారు. అలాగే రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను నిషేధించటంపై విధి విధానాలను ఖరారు చేయాల్సిందిగా ఆదేశించారు. అలాగే ఆర్టీసీ సమ్మెపై కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల్లో పండుగ కోసం ఊళ్లకు వెళ్లినవారు తిరిగి వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలుగుకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరారు.