తెలంగాణ

నారాయణఖేడ్‌కు గోదావరి నీళ్లిస్తా-కేసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్- తెలంగాణలో బాగా వెనుకబడిన ప్రాంతమైన నారాయణఖేడ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని, గోదావరి నీళ్లతో నియోజికవర్గం కాళ్లు కడుగుతానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. బుధవారం నిర్వహించిన ఉపఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. వరంగల్, హైదరాబాద్‌లలో ప్రజలు ఇచ్చిన తీర్పు మాదిరిగానే నారాయణఖేడ్‌లోనూ ప్రజలు టిఆర్‌ఎస్‌కు పట్టంగట్టాలని ఆయన కోరారు. పేదలకు పెన్షన్లు, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లువంటి పథకాలను సమర్ధంగా అమలు చేస్తున్నామని, నారాయణఖేడ్‌లోనూ ఆ పథకాలు వర్తింపచేస్తామని ఆయన హామీ ఇచ్చారు.