రాష్ట్రీయం

ప్రాజెక్టులపై సభలో సినిమా చూపిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ సిఎం కెసిఆర్
హైదరాబాద్, మార్చి 13: శాసనసభలో రెండు ప్రత్యేకంగా రెండు భారీ తెరలు ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై వివరించనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం శాసన సభలో తెలిపారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానం చెబుతూ ముఖ్యమంత్రి ఈ విషయం తెలిపారు. ప్రాజెక్టులపై పిక్చర్ చూపిస్తాను అని కెసిఆర్ తెలిపారు. గూగుల్ మ్యాప్‌లతో వివరిస్తానని అన్నారు. ఒక రోజంతా ప్రాజెక్టులపైనే వివరిస్తానని అన్నారు. ఈ అంశంపై ఆదివారం సభలో గంటకు పైగా మాట్లాడిన కెసిఆర్ ఇది ప్రారంభం మాత్రమేనని పూర్తి వివరాలు ప్రత్యేక సమావేశంలో చెబుతానని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంలో కుట్ర, సమైక్యాంధ్రలో జరిగిన అన్యాయం, ప్రాజెక్టుల పునర్నిర్మాణం వల్ల తెలంగాణకు ఏ విధంగా మేలు జరుగుతుంది అనే అంశాలపై సమగ్రంగా వివరించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. శాసన మండలిలోనూ ముఖ్యమంత్రి ఈ విషయం తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రాజెక్టులపై వివరించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.