బిజినెస్

శాన్-ఐపివి పోలియో వ్యాక్సిన్ వచ్చేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విడుదల చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్

హైదరాబాద్, డిసెంబర్ 4: శాన్-ఐపివి పోలియో వ్యాక్సిన్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం లాంచనంగా విడుదల చేశారు. శాంతా బయోటెక్స్ లిమిటెడ్ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ను సచివాలయంలో ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఓరల్ పోలియో వ్యాక్సిన్‌లో ఒక శాతం విఫలం అయ్యే అవకాశం ఉండగా, ఐపివిలో అలాంటి రిస్క్ కూడా ఉండదు. ఐపివి ఐదు డోస్‌ల ప్యాక్‌ను యూనిసెఫ్ ప్రతినిధులకు అందజేశారు. శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద రెడ్డి శాన్-ఐపివి ఉత్పత్తి గురించి వివరించారు. పోలియోను సంపూర్ణంగా నివారించేందుకు ఐపివి ఉత్పత్తి చేసినట్టు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఐపివి ఒక యూనిట్ ఖరీదు 1,050 రూపాయలు ఉందని, శాంతా బయోటెక్ కేంద్ర ప్రభుత్వానికి, యూనిసెఫ్‌కు కేవలం 55 రూపాయలకే అందజేస్తున్నట్టు చెప్పారు. యూనిసెఫ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఇవి ఉచితంగా లభిస్తాయని తెలిపారు. కాగా, శాన్-ఐపివి తెలంగాణలో ఉత్పత్తి కావడం తెలంగాణకు గర్వకారణం అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. వివిధ రకాల వ్యాక్సిన్‌ల తయారీలో శాంతా బయోటెక్ కృషిని ముఖ్యమంత్రి అభినందించారు. మరోవైపు మేడ్చెల్‌లోని తమ యూనిట్‌కు నీటి సమస్య గురించి శాంతా బయోటెక్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, తక్షణం సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జిహెచ్‌ఎంసి సత్వరం నీటి సరఫరా చేస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. క్యాన్సర్ కేర్ సెంటర్‌కు శాంతాబయోటెక్‌కు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని వరప్రసాద్‌రెడ్డికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలావుంటే పోలియో వ్యాక్సిన్‌ను యూనిసెఫ్ 2.5 మిలియన్ డోస్‌లను కొనుగోలు చేయనుంది. రెండు రాష్ట్రాల్లోనూ వీటిని యూనిసెఫ్ ఉచితంగా అందజేయనుంది. కేంద్ర ప్రభుత్వం, యూనిసెఫ్ పోలియోను సంపూర్ణంగా అరికట్టాలని నిర్ణయించుకున్నది తెలిసిందే.