మెయన్ ఫీచర్

పరిష్కారానికి నోచని సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

=======================
తెలంగాణ ఉద్యమకాలంలో కూడా కెసిఆర్ తెలంగాణ భవన్‌లో ఓ యాగాన్ని నిర్వహించారు. ఇది ఉద్యమకారులకుండే లక్షణం కాదని నాడు విమర్శలు వచ్చాయి. బహుశ ఆయన యాగఫలమే తెలంగాణ సాకారం అనుకుంటే, దాదాపుగా 1300 మందికి పైగా యువకులు ఎందుకు ప్రాణత్యాగం చేసారో కెసిఆర్ చెప్పలేకపోయారు. పోతే, నాటి యాగఫలంతో తెలంగాణ ప్రజలకన్నా, కుటుంబపరంగా ఎక్కువ లబ్దినే పొందారు. దళితుడే ముఖ్యమంత్రి అని, తానో కావలి కుక్క అని నినదించిన కెసిఆర్ స్వయాన ముఖ్యమంత్రి అయి కుటుంబ సభ్యులకు పెద్దపీటనే వేసుకున్నారు. ఇక ఉద్యమకాలంలో ప్రస్తావించిన సమస్యలు సమస్యలుగానే వుండిపోతున్నాయి. రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే వున్నది. కనీసం ఈ యాగ కాలంలో కూడా ఆగని ఈ ఆత్మహత్యలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 1500 దాటినట్లు రైతు సంబంధిత సంస్థలు, రైతు స్వరాజ్యవేదిక గణాంకాలు తెలుపుతున్నాయ.
========================
ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన అయుత చండీయాగానికి దాదాపు ఓ పది గంటల ముందే ఆసియాలోనే పేరెన్నిక గలిగిన నైజాం షుగర్ ఫ్యాక్టరీని నడుపుతున్న డెల్టా నేత గంగరాజులు లేఆఫ్ (జ్ఘక్యచిచి) ప్రకటించాడు. ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమిలేకపోవచ్చు! కాని, తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ ఏర్పడితే ఫాక్టరీని ప్రభుత్వ రంగంలోనే తెరిపిస్తానని, అడ్డొస్తే తల నరికి ఫ్యాక్టరీ గేటుకు వేలాడదీస్తానని ప్రకటించిన కెసిఆర్ తెలంగాణ ఏర్పడి ఇరవై నెలలు (20) కావస్తున్నా ఈ ఫ్యాక్టరీ ఊసే ఎత్తలేదు. ఈ ఫ్యాక్టరీని తెరిపించాలని కార్మికులు, కర్షకులు చేస్తున్న ఉద్యమం కెసిఆర్ దృష్టిలో పడకపోగా, గత సీజన్ చెరకు బకాయిలు రాక, ఈ సీజన్‌లో అసలు చెరుకు గానుగనే ఆడని స్థితి. దీనికి అనుబంధంగా వున్న కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి, మెదక్ జిల్లా ముంబాజిపల్లి యూనిట్లు కూడా శాశ్వతంగా మూతపడి, వందలాది మంది కార్మికులకు, కాంట్రాక్టు కూలీలకు, వేలాది మంది రైతు కుటుంబాలకు ఉపాధేకాదు బతుకే లేకుండా పోయింది. ఈ కర్మాగారాల ఆధారంగా నడిచే మొత్తం ఆర్థిక వ్యవస్థనే దెబ్బతిన్నది.
సిర్‌పూర్‌కాగజ్‌నగర్ కథ ఇదే! యాజమాన్యం లాకౌట్ ప్రకటించడంతో దాదాపు రెండువేల మంది కార్మికులు వీధినపడగా, అనుబంధంగా పనిచేసే కూలీలు, కుటుంబాలు బతుకుతెరువునే కోల్పోయాయి. నైజాంను భుజాలపై మోసే కెసిఆర్‌కు నైజాం ఏర్పాటుచేసిన ప్రభుత్వరంగ సంస్థల్ని నడిపించాలని, మూతపడిన వాటిని తిరిగి తెరిపించాలని లేకపోగా, ప్రైవేట్ రంగంలో మాత్రం మనకు సంబంధంలేని పరిశ్రమలకు అనుమతులిస్తూ ఒప్పందాల్ని చేసుకుంటున్నారు. ఏకగవాక్ష తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ కింద 1118.62 కోట్ల పెట్టుబడులతో 14 పరిశ్రమలకు హైదరాబాద్ చుట్టూగల భూముల్లో అనుమతులనిచ్చారు. ఇందులో 7079 మందికి ఉపాధి కలుగుతుందట! రూ. 25వేల కోట్ల పెట్టుబడితో ఇప్పటికే అనుమతించిన 1013 యూనిట్ల ద్వారా 76వేల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి జూపల్లి వెల్లడిస్తూ, అభివృద్ధి చెందిన దేశాల్లో ఓ పరిశ్రమ అనుమతికి 30-45 రోజులు పడితే, తెలంగాణలో అడిగిన వెంటనే అనుమతి ఇస్తున్నామనడంలోనే, ఆర్థిక లబ్ది ఎంతగా వుంటుందో తెలుస్తున్నది.
నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనమిక్స్ అండ్ రిసెర్చ్ (్ళఉ్గ) 2013, 2014 సంవత్సరాల గణాంకాల్ని విడుదల చేస్తూ, గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయిదాకా ప్రతి పనికి లంచం (ఇజఇళ) ఇవ్వనిదే నడవడం లేదని, నల్లధనం పోగుపడడానికి ఈ లంచాలే కారణమని తెలిపింది. ఇలా స్థానిక సంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రతీ గ్రామీణ కుటుంబం సంవత్సరానికి రూ.2,900/- పట్టణ ప్రాంతం కుటుంబం రూ.4,400/- లంచంగా ఇస్తున్నట్టు తేలింది. లక్నో, పాట్నా, భువనేశ్వర్, పునే, హైదరాబాద్‌లలో జరిపిన ఈ సర్వే ఆంధ్రప్రదేశ్‌తో సహా 15 రాష్ట్రాల్లో జరపగా, అనేక విషయాలు బయటపడ్డాయి. వివిధ ప్రాజెక్టులను చేపట్టే కాంట్రాక్టర్లకు ఇంటర్వ్యూ చేయగా ప్రాజెక్టు అయ్యే ఖర్చులో 9 శాతాన్ని రాజకీయ నాయకులకు, అధికారులకు లంచాలుగా ఇవ్వాల్సి వస్తుందని 80 శాతం తెలపగా, కాలయాపనకు గురయ్యే ప్రాజెక్టులకు మరో 20శాతం దాకా సమర్పించుకోవల్సి వస్తున్నదని తేలింది. ఇలా పబ్లిక్ సెక్టారుల పేరున, ప్రాజెక్టుల పేరున ఆర్జించడం ఓ సులభమైన మార్గమని, ఇలా సంపాదించిన, పోగుపడిన డబ్బునే తిరిగి పెట్టుబడిగా పెడుతూ కాంట్రాక్టులు దక్కించుకోవడం జరుగుతున్నదని, ఈ సర్వే తెలిపింది. పోలవరం టెండర్లలో ఈ వాసనల్ని చూపడం జరిగిందే!
దీన్నిబట్టి పాలకులు కొత్తకొత్త ప్రాజెక్టులకై ఎందుకు తహతహ లాడుతారో, పాతవాటి జోలికి ఎందుకు పోరో తెలుస్తున్నది. కాంగ్రెస్ హయాంలోని వృద్ధాప్య పింఛన్ పథకంస్థానే వచ్చిన ఆసరా పథకం ఈ కోవలోనిదే కాగా, వైఎస్‌ఆర్ రాజీవ్ గృహకల్ప పథకం స్థానంలో వచ్చిన డబుల్ బెడ్‌రూం పథకం కూడా ఇలాంటిదే! ఆసరా పథకం లబ్దిదారుల్ని చూస్తే అదెంత లోపభూయిష్టంగా ఉన్నదో తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమకాలంలో కూడా కెసిఆర్ తెలంగాణ భవన్‌లో ఓ యాగాన్ని నిర్వహించారు. ఇది ఉద్యమకారులకుండే లక్షణం కాదని నాడు విమర్శలు వచ్చాయి. బహుశ ఆయన యాగఫలమే తెలంగాణ సాకారం అనుకుంటే, దాదాపుగా 1300 మందికి పైగా యువకులు ఎందుకు ప్రాణత్యాగం చేసారో కెసిఆర్ చెప్పలేకపోయారు. పోతే, నాటి యాగఫలంతో తెలంగాణ ప్రజలకన్నా, కుటుంబపరంగా ఎక్కువ లబ్దినే పొందారు. దళితుడే ముఖ్యమంత్రి అని, తానో కావలి కుక్క అని నినదించిన కెసిఆర్ స్వయాన ముఖ్యమంత్రి అయి కుటుంబ సభ్యులకు పెద్దపీటనే వేసుకున్నారు. ఇక ఉద్యమకాలంలో ప్రస్తావించిన సమస్యలు సమస్యలుగానే వుండిపోతున్నాయి. రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే వున్నది. కనీసం ఈ యాగ కాలంలో కూడా ఆగని ఈ ఆత్మహత్యలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 1500 దాటినట్లు రైతు సంబంధిత సంస్థలు, రైతు స్వరాజ్యవేదిక గణాంకాలు తెలుపుతుంటే, ఇవి తప్పుడు లెక్కలని, చనిపోయింది 782 మంది మాత్రమేనని, ఇందులో అసలైన రైతులు 342 మంది మాత్రమని ప్రభుత్వం ప్రకటించింది. రైతు ఆత్మహత్యగా నిర్ధారణ జరగాలంటే 13 రకాల పత్రాల్ని జతచేయాల్సి వస్తుందంటే, గత ప్రభుత్వానికి కెసిఆర్ ప్రభుత్వానికి గల తేడా ఏంటో తెలుస్తున్నది.
ఇక ఉద్యోగాల వేట కొనసాగుతూనే వున్నది. ఆర్భాటంగా తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఏర్పాటుచేయడం, సిబ్బందిని నియామకం చేయడం, సిలబస్ కమిటీని ఏర్పాటుచేయడం చకచకా జరిగిపోయాయి. కేవలం 2600 పోస్టులకై పరీక్షలు నిర్వహించడం తప్ప నేటికి ఒక్క నియామకం జరగలేదు. మున్ముందు మరెన్ని ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తారో తెలియదు. ఇక సాధారణంగా వుండే పోలీసు కానిస్టేబుల్, ఉపాధ్యాయుల నియామకాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్న చందంగా ఉన్నాయ. డిఎస్సీ పెడతామని, పెట్టమని, వచ్చే సంవత్సరమని కాలయాపన చేస్తున్నారే గాని వాస్తవకారణాల్ని చెప్పడం లేదు. శిక్షణ లేని ఉపాధ్యాయుల ఎంపికకై ఏర్పాటుచేసిన డిఎస్సీ విధానం లేకుండా నియామకం జరిపే విధానానికి తెరాస ప్రభుత్వం శ్రీకారం చుడితే ఖాళీలు వెంటనే భర్తీ అయ ప్రభుత్వ పాఠశాలలు కనీసంగా నడిచేవి. ఇలా ఉన్న ప్రభుత్వ విద్యారంగాన్ని దెబ్బతీస్తూ, ఓ ప్రత్యామ్నాయ సమాంతర కెజి టు పీజి నినాదాన్ని ముందేసుకున్నారు. ఇది ఆచరణలో ఎలాంటి ఫలితాల్నిస్తుందో ఊహించుకోవచ్చు! వైఎస్‌ఆర్, కిరణ్‌కుమార్ ప్రారంభించిన మోడల్ స్కూళ్ళ దుస్థితిని చూస్తూనే వున్నాం. త్రిబుల్ ఐటిల, కొత్తగా ఏర్పాటైన విశ్వవిద్యాలయాల, పాత విశ్వవిద్యాలయాల పరిస్థితి తెలిసిందే!
సుల్తాన్‌బజార్ గుండాపోయే మెట్రోరైలు ముందుగా తనపైనుండి పోవాలని గర్జించిన కెసిఆర్ ఇప్పుడు వౌనం వహించారు. వైద్య, ఆరోగ్య విషయాలపై నాటి ఆంధ్రా రాజకీయాల్ని తూర్పారబట్టిన వ్యక్తి, ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మోడల్ వైద్యశాలగా మార్చలేకపోగా, ఉస్మానియా దవాఖానను, ఎర్రగడ్డ దవాఖానను కూల్చే పథక రచన మాత్రం చేశారు. గత ప్రభుత్వాల లాగానే ఏ ప్రభుత్వ కార్యాలయంలో లంచంలేనిదే పని జరుగదు. పెట్టాల్సిన దరఖాస్తుల్లో, తిరగాల్సిన విధానంలో, ఇవ్వాల్సిన లంచాల్లో మార్పులేదు.
ఇక గ్రామీణ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. కాలంకాక కరువుకోరల్లో చిక్కుకోవడంతో యువత పట్టణాలకు అడ్డామీది కూలీలుగా పోవడం, అక్కడా పని దొరక్క వెనక్కిరావడం జరుగుతూనే వున్నది. గల్ఫ్ బాట అసలు ఆగనే లేదు. దళారి ఏజెంట్లు మామూలుగానే కొనసాగుతున్నారు. స్వయంగా ఒకప్పుడు ఈ పనినే చేసిన కెసిఆర్‌కు ఇవన్నీ తెలియవనుకుందామా? వర్షాలు లేక వట్టిపోయిన బోర్లు, ఉన్న పంటను దక్కించుకోవాలంటే, మరింత లోతుకు బోర్లువేయాలనే ఆశ రైతుల్ని నిలువునా ముంచుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం వెనుక కాంట్రాక్టర్ల హస్తలాఘవం వుందనేది తెలిసిందే!
తెలంగాణ ఏర్పడిన తర్వాత మెరుగుపడాల్సిన పాలన గాడిలో పడకపోగా, గత ప్రభుత్వాల లాగానే కొనసాగితే తెలంగాణను ఎందుకు తెచ్చుకున్నామనే ఆలోచన వస్తున్నది. అనేక త్యాగాలుచేసి సాధించుకున్న తెలంగాణ పాలకుల మార్పుకే పరిమితమైతే, తిరిగి ఉద్యమించడం అనివార్యవౌతుంది. సమస్యల పరిష్కారానికి యాగాలు, క్రతువులే కారణమైతే గోదావరి పుష్కరాలకు జనాల్ని తరలించి ముంచి ఆరునెల్లు కూడా కాలేదు. జనంతోపాటు రాజకీయ నాయకులు, ఉన్నతస్థాయి బ్యూరోక్రాట్లు, అధికారులు యావత్తు పుష్కర స్నానమాచరించినా రాష్ట్రంలో కనీసం వర్షం కూడా పడని స్థితి. పుష్కరుడు, వరుణుడు కరుణించని వైనం.
ఓ ముఖ్యమంత్రికి వ్యక్తిగతం అంటూ వుంటుందా! వ్యక్తిగతంగా వుండే నమ్మకాల్ని సార్వజనీనం చేయడం సమంజసమైన చర్యలనగలమా! రాష్టప్రతి మొదలుకొని, సుప్రీంకోర్టు న్యాయాధీశులు, రాష్ట్ర గవర్నర్, ప్రధాన న్యాయాధీశులు, ముఖ్య కార్యదర్శి, డిజిపితో సహా యావత్ మంత్రి మండలి, అధికార పార్టీ ఎంఎల్‌ఎలతో సహా హాజరైన ఈ యాగం ము ఖ్యమంత్రి వ్యక్తిగత కార్యక్రమం అవుతుందా? 40 శాతం మంది పసి పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు కుటుంబ సంక్షేమశాఖ రిపోర్టులు తెలుపుతుంటే, టన్నులకొద్దీ నెయ్యిని అగ్నికి ఆహుతి నివ్వడం ప్రజాస్వామ్యమే అయితే కెసిఆర్ అభినందనీయుడే! ఇప్పుడన్నా రాష్ట్రం సుభిక్షం కావాలని కోరుకుందాం!

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162