అంతర్జాతీయం

అమెరికాతో భారత్‌ మిలిటరీ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్‌: అమెరికా పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌, అమెరికా రక్షణ మంత్రి ఆష్‌ కార్టర్‌ మిలిటరీ లాజిస్టిక్స్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు ఇక మీదట యుద్ధవిమానాలు, యుద్ధనౌకల మరమ్మతులు, ఇంధన భర్తీ తదితరాల కోసం భారత సైనిక స్థావరాలను అమెరికా, అమెరికా సైనిక స్థావరాలను భారత్‌ వాడుకోవచ్చు. భారత్‌తో రక్షణ వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం పంచుకునే అంశాలపై అమెరికా అంగీకరించిందని సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. మీడియా సమావేశంలో అమెరికా మంత్రి కార్టర్‌, భారత రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ మాట్లాడారు. అమెరికా-భారత్‌ల రక్షణ సంబంధాలకు సంబంధించి ఈ ఒప్పందం గొప్ప మైలురాయి అన్నారు.