కడప

అగ్నిగుండంగా మారిన కడప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 12: జిల్లాలో భానుడి ప్రతాపం రోజురోజుకు పెరుగుతుండటంతో కడప వాసులు గడగడలాడుతున్నారు. మంగళవారం కడపలో గరిష్ట ఉష్ణోగ్రత 44.5 డిగ్రీలకు చేరుకుంది. ఏప్రిల్ నెలలో గత దశాబ్ధంలో ఎన్నడూలేని విధంగా పగటి ఉష్ణోగ్రత 44.5 డిగ్రీలకు చేరింది. ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ప్రస్తుతం టెన్త్ క్లాస్ వ్యాల్యుయేషన్ మొదలుకావడంతో విధుల నిమిత్తం హాజరైన ఉపాధ్యాయులు, స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రంలో ఎండవేడికి బెంబేలెత్తుతున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 3.30గంటల వరకు జిల్లాకేంద్రంతోపాటు పలు నియోజకవర్గాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొని పురవీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకు ఈ వేసవిలో 15 మంది మృత్యువాత పడగా, అనధికారికంగా 30మంది మృతిచెందారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే తప్ప వడదెబ్బతో మృతి చెందినట్లు తేల్చరాదని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. మొత్తమీద కడపలో భానుడు నిప్పులు కక్కుతూ జనాన్ని హడలెత్తిస్తున్నాడు.