కడప

ఎమ్మెల్యే రాచమల్లుకు అరెస్టు వారెంట్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 25: ప్రొద్దుటూరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్‌రెడ్డికి ఆదివారం స్థానిక వన్‌టౌన్ పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మదర్‌థెరిస్సా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అధికారుల నుంచి, ఆసుపత్రి అనివృద్ధి కమిటీ నుంచి కాని ఎటువంటి అనుమతులు లేకుండా ఎమ్మెల్యే రాచమల్లు విగ్రహాన్ని ఆవిష్కరించారని ఈ మేరకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీనివాసులరెడ్డి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రాచమల్లుకు అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి

కమలాపురం,సెప్టెంబర్ 25: నవ్యాంధ్రఫ్రదేశ్‌కు ప్రత్యేక హోదా శరణ్య మని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు గాలి చంద్ర అన్నారు. ఆయన ఆదివారం విలేఖర్లతో మాట్లాడుతూ కేంద్రం ప్రత్యేకహోదాతో సమానంగా ప్యాకేజి ఇస్తామనిచెప్పి ప్రజలను మరోసారి మోసం చేసారన్నారు. చట్టబద్దతలేని ప్యాకేజిలను ప్రజలు నమ్మరు అని అన్నారు. ఏపికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామ న్న ఎన్నికల హామీలను బిజెపి నేతలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆనాడు రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో ఇచ్చిన కోరిన హామిని నిలబెట్టుకోలేక పోగా ప్యాకేజి పేరుతో కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. ర కడపలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయకుండానే ఇక్కడి ప్రజలను దగా చేస్తున్నారని, కొత్తరాష్ట్రంలో పలు విద్యాసంస్థల కు శంకుస్థాపనచేసి వదిలేశారని విమర్శించారు. ప్రజలను మోసం చేస్తున్న బిజెపి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, కేంద్రానికి వంతపాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. కడప ఉక్కుపరిశ్రమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచేలా సిపిఐ ఆందోళనా కార్యక్రమాలను కొనసాగిస్తుందని అన్నారు.

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యాయత్నం
వేంపల్లె, సెప్టెంబర్ 25: మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న చెన్నకేశవరెడ్డి ఆదివారం ట్రిపుల్ ఐటీ పరిసరాల్లో గుర్తు తెలియని మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తోటి సెక్యూరిటీగార్డులు తెలిపారు. గత రాత్రి విధులు నిర్వర్తించే సమయంలో సెక్యూరిటీ గార్డు చెన్నకేశవరెడ్డి నిద్రించాడని, దీంతో ట్రిపుల్ ఐటీ భద్రతా అధికారి ఆ సెక్యూరిటీ గార్డును సస్పెన్షన్ చేస్తూ వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. దీంతో సెక్యూరిటీగార్డు చెన్నకేశవరెడ్డి మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఆత్మహత్యకు పాల్పడిన సెక్యూరిటీగార్డును తోటి సెక్యూరిటీగార్డులు హుటాహుటిన వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమచికిత్సలు నిర్వహించి అనంతరం మెరుగైన వైద్యచికిత్సల కోసం కడప రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న సెక్యూరిటీగార్డు చెన్నకేశవరెడ్డిని శాసనమండలి ఉపాధ్యక్షుడు సతీష్‌రెడ్డి పరామర్శించారు.
ట్రిపుల్ ఐటీ భద్రతా విభాగం అధికారి వివరణ
ట్రిపుల్ ఐటీలో రాత్రి సమయంలో విధులు నిర్వర్తించే సెక్యూరిటీ గార్డులు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతారని, ట్రిపుల్ ఐటీ భద్రతా విభాగం అధికారి రెడ్డిశేఖర్‌రెడ్డి తెలిపారు. రాత్రి సమయంలో విద్యార్థులను కంటికి రెప్పలాగా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత రాత్రి విధులు సక్రమంగా నిర్వర్తించకుండా నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డు చెన్నకేశవరెడ్డిని సస్పెండ్ చేస్తూ వివరణ కోరినట్లు ఆయన వివరించారు.

కష్టాల కడలిలో హాస్టల్ విద్యార్థులు!

సుండుపల్లె, సెప్టెంబర్ 25: మండలంలో విద్యార్థుల చనువుకునేందుకు ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న . ఈ హాస్టళ్లలో విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. స్థానిక సుండుపల్లెలో ఒక ఎస్సీ హాస్టల్, ఒక బీసీ హాస్టల్, ఒక ఎస్టీ హాస్టళ్లు ఉండగా జికె రాచపల్లె నందు ఒక బాలికల హాస్టల్, ఒక బాలుర హాస్టల్ ఉన్నాయి. అయితే విద్యార్థుల కష్టాలు పట్టించుకునే వారేలేరు. విద్యార్థులు తాగునీరుగా ఉపయోగించే నీరు ట్యాంకు నుంచి వచ్చే కుళాయి నీరు లేదా ఏటి నీరు ఈ నీటిని తాగలేక విద్యార్థులు ఎవరితో చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. అయితే స్నానానికి వాడుకోవాల్సిన నీరు తాగేందుకు వాడుతున్నారు విద్యార్థులు. పాపం పసిపిల్లలు పడుతున్న కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. హాస్టళ్లలో తాగడానికి, స్నానానికి ఒకే నీరు వాడటం చూస్తే గుండె పగిలే పరిస్థితి. అంతేకాకుండా పాచి పట్టిన డ్రమ్ములలో నీటిని పోసి ఉండటం, డ్రమ్ముల పక్కనే లెట్రిన్ ఉండి కంపు కొట్టడం అదే గదిలో ఒక పక్కన భోజనాలు చేయడం, స్నానాలు అదే గదిలో చేయడం, ఆఖరికి భోజనాలు కూడా అక్కడే పసిపిల్లలు తింటుంటే వారి తల్లిదండ్రులు చూస్తే వారి గుండె బద్దలయిపోతుంది. అసలు అధికారులు ఉన్నారా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
హాస్టల్‌లో ఉండాలంటేనే భయంగా ఉంది..
హాస్టల్‌లో ఉండాలంటేనే భయమేస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. తాగునీరు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నామని, హాస్టల్‌లో లైట్లు కూడా సరిగా లేవని, భోజనం చేయాలంటే భయమేస్తోందన్నారు. వర్షం పడితే హాస్టల్ వర్షంతో నిండిపోతుందని, గదులలోకి పురుగులు కూడా వస్తున్నట్లు తెలిపారు. మాకు మంచి భోజనం, హాస్టల్ బాగా శుభ్రంగా చేస్తే మేం బాగా చదువుకుంటామని వారు వాపోతున్నారు.