కడప

తెలుగుభాషపై పట్టుసాధించాలంటే జానమద్ధి రచనలు చదవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప(కల్చరల్), అక్టోబర్ 23: తెలుగుభాషాభివృద్ధిచేసుకోవాలన్నా, తెలుగుభాషపై పట్టుసాధించాలన్న స్వర్గీయ డాక్టర్ జానమద్ధి హనుమచ్చాస్ర్తీ రచనలు చదవాలని ఏపి రాష్టస్రర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు జస్టిస్ ఎస్‌వి భట్ పేర్కొన్నారు. స్థానిక సిపిబ్రౌన్ గ్రంథాలయంలో ఆదివారం జానమద్ధి హనుమచ్చాస్ర్తీ 92వ జయంతి సందర్భంగా పంచమ సాహితీ పురస్కార ప్రధానోత్సవకార్యక్రమం జరిగింది. తమిళనాడు ప్రభుత్వ రిటైర్డు ముఖ్యకార్యదర్శి జె.తిరువెంగళాచార్యులు అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన జస్టిస్ భట్ మాట్లాడుతూ మాతృబాష తెలుగుపై అందరూ మక్కువ పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పక్కరాష్ట్రాల్లో వారి భాష అమలుపై చిత్తశుద్ధి ఎక్కువగా ఉందని గుర్తుచేశారు. అయితే మనరాష్ట్రంలో కూడా తెలుగు అమలుపై అభిమానాన్ని పెంచుకోవాల్సివుందన్నారు. గంధపు చెక్కవలే కరుగుతూ నలుగురికి సువాసన వెదజల్లే తాపత్రయం కలిగినవారు మోక్షగుండం విశే్వశ్వరయ్యను జానమద్ధి రచనలో పేర్కొన్న విషయాన్ని తెలుపుతూ జానమద్ది కూడా తన దృష్టిలో మోక్షగుండం విశే్వశ్వరయ్యకు తక్కువ కాదన్నారు. నేటి యువత తమవద్ద చరవాణి ల్యాప్‌ట్యాప్స్ ఉంటే ఎవ్వరి అవసరం లేదనిపిస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారన్నారు. రాసిన పరీక్షలో రెండు మార్కులు తక్కువైతే కుంగి పోతున్నారన్నారు. సాధన ఉన్న మనిషికి సాధనాలతో అవసరంలేదని సూచించారు. తెలుగు భాషకు ఇంత వరకు ఎలాంటి సహాయం తాను చేయలేదని, అయితే ఇకపై అలా ఉండనని సభాముఖంగా తెలియజేశారు. మాతృభాష తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాల్సివుందన్నారు. రాష్టశ్రాసన మండలి ఉపసభాపతి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తనకు సాహిత్య పరిజ్ఞానం అంతగా లేనప్పటికీ సాహిత్యరంగానికి ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. తనవంతుగా రాష్ట్రప్రభుత్వం తరపున అవసరమైన అంశాలపై సహాయం చేయడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమాన్ని సభా సమన్వయం జానమద్ది సాహితీపీఠం మేనేజింగ్ ట్రస్టి జానమద్ది విజయభాస్కర్ చేపట్టారు. అనంతరం జానమద్ది సాహితీపీఠం పురస్కార గ్రహీత ఆచార్య కేతువిశ్వనాధరెడ్డిని అతిధులు ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో మంలో వైవియు రిజిస్ట్రార్ డా.నజీర్ అహ్మద్, జిల్లా మాజీ రచయితల సంఘం అధ్యక్షుడు మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ బాలిరెడ్డి, ఎంపిడిఓ ఎం.సురేష్ సాహితీ ప్రియులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అలాగే అతిధులకు పీఠం తరపున సత్కారం చేశారు.